మా హయాంలో పార్టీలకు అతీతంగా పంట నష్టం
కందుల నారాయణ రెడ్డి
(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)
తర్లుపాడు మండలంలోని తర్లుపాడు గ్రామంలో 'నివర్' తుఫాన్ వల్ల నష్టపోయిన రైతుల యెక్కదాదాపు 300 ఎకరాలలోని శనగ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లు మార్కాపురం మాజీ శాసనసభ్యులు, టీడీపీ ఇంచార్జి కందుల నారాయణ రెడ్డి గారు తెలిపారు.. అంతకు ముందు మార్కాపురం మండలం లోని చింతగుంట మరియు తిప్పాయపాలెంలలో పర్యటించిన అయన విలేకరులతో మాట్లాడుతూ.... గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పార్టీలకు అతీతంగా నియోజకవర్గంలో దాదాపు 90 కోట్ల రూపాయలు పంట నష్ట పరిహారంగా చెల్లించామని కానీ ఈ' నివర్ 'తుఫాన్ ప్రభావంతో రైతులు మిరపకు దాదాపు లక్ష రూపాయలు, పత్తి పంటకు 50వేలు, మినుము పంటకు 40వేల రూపాయలు పెట్టుబడి పెట్టారని తెలిపారు. కానీ ఇప్పటివరకు పంట నష్ట పరిహార అంచనాకు ఏ అధికారులు గ్రామాలలో క్షేత్ర స్థాయిలో పర్యటించలేదు అని వెంటనే అధికారులు స్పందించి వివిధ పంటల నష్ట పరిహార అంచనాలు తయారు చేసి మిరప పంటకు ఎకరాకు 50వేలు, పత్తి, మినుము మరియు శనగపంటలకు 30 వేలు తక్షణమే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసారు. లేనిచో సంబంధిత ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లను రైతుల ఆధ్వర్యంలో ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..
Post A Comment:
0 comments: