అభాగ్యులకు అండగా హ్యూమన్ రైట్ కౌన్సిల్
షేక్ ఖలీఫాతుల్లా బాషా
(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)
విజయవాడ సిటీ ప్రెస్ క్లబ్ లోజరిగిన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సమావేశానికి ముఖ్యఅతిధిగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా రీజియన్ ఛైర్మన్ షేక్. ఖలీఫాతుల్లాబాషా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖలీఫాతుల్లా మాట్లాడుతూ సమాజంలో మానసిక రుగ్మతలకు లోనైన అభాగ్యులకు అండగా ఉంటామని చెప్పారు.
దేశ వ్యాప్తంగా ఈ కౌన్సిల్ ను ఆశ్రయించిన బాధితులకు అండగా నిలిచి న్యాయం జరిగేలా సహాయం అందించామని తెలిపారు.ఆంధ్రప్రదేశ్ నుంచి పనికోసం గల్ఫ్,దుబాయ్ దేశాలకు వెళ్లి అక్కడి షేక్ లాబారిన పడి కష్టాలు పడుతున్న మహిళలను వారి కుటుంబాలు ఈ కౌన్సిల్ ను ఆశ్రయించిన వెంటనే షేక్ కులబారినుంచి రక్షించి వారిని ఇండియా కు తీసుకుచ్చి వారి కుటుంబాలకు అపగించడమైనదని తెలిపారు.కృష్ణ జిల్లా, ఖమ్మం జిల్లా ,విజయవాడ సిటీ లలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరుపున సమాజ సేవా చియడానికి పలువురికి వివిధ బాధ్యతలను పప్పగిస్తూ ఈ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు పంపిన నియామక పాత్రలను ఈ కౌన్సిల్ సౌత్ ఇండియా రీజియన్ ఛైర్మన్ షేక్. ఖలీఫాతుల్లాబాషా చేతుల మీదుగా అందించారు.
Post A Comment:
0 comments: