మంత్రి ఎర్ర‌బెల్లి దంపతుల‌తో ...

సినీ నిర్మాత దిల్ రాజు దంపతుల భేటీ


(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు దంప‌తుల‌ని సినీ నిర్మాత దిల్ రాజు దంప‌తులు శుక్ర‌వారం హైద‌రాబాద్ లో ఓ కార్య‌క్ర‌మంలో క‌లిశారు. ఈ సంద‌ర్భంగా దిల్ రాజు దంపుత‌ల‌కు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు-/ఉషా ద‌యాక‌ర్ రావు దంప‌తులు పెళ్ళి శుభాకాంక్ష‌లు తెలిపారు. అలాగే వారికి నూత‌న ప‌ట్టు వ‌స్త్రాల‌ను బ‌హూక‌రించారు. దిల్ రాజు పెళ్ళి త‌ర్వాత ఈ ఇరువురి దంప‌తులు క‌లుసుకోలేక‌పోయారు. అనుకోకుండా కలుసుకోవ‌డంతో అప్యాయ‌త‌ల‌ను పంచుకున్నారు.



 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: