దిశచట్టం పట్టిష్టంగా అమలు చేసి...

షాహిదాకు న్యాయం చేయండి

జానోజాగో సంఘం డిమాండ్

జానోజాగో సంఘం జాతీయ అధ్యక్షులు సయ్యద్ నిసార్ అహ్మద్

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

అనంతపురం జిల్లా కల్యాణ దుర్గం చాపిరి గ్రామానికి చెందిన దూదేకుల షాహిదాపై ఆత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన దోషులపై దిశచట్టం పట్టిష్టంగా అమలు చేయాలని జానోజాగో(ముస్లింల అభివృద్ది వేదిక) సంఘం డిమాండ్ చేసింది. ఈ మరకు జానోజాగో సంఘం జాతీయ అధ్యక్షులు సయ్యద్ నిసార్ అహ్మద్, జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా, ఏపీ రాష్ట్ర గౌరవ సలహాదారు షేక్ అబ్దుల్ రజాక్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు ముంతాజ్ ఫాతిమా, ఏపీ రాష్ట్ర సమన్వయ కర్త షేక్ గౌస్ బాషా ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా

 

ఏపీ రాష్ట్ర గౌరవ సలహాదారు షేక్ అబ్దుల్ రజాక్


తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు ముంతాజ్ ఫాతిమా

అత్యాచార నింధితులకు వెణులో వణుకుపుట్టేలా చట్టంలో అమలు చేయాలన్నారు. లేకపోతే చట్టం ఉద్దేశం ఏ మాత్రం నెరవేరదని వారు పేర్కొన్నారు. షాహిదా అత్యాచార, హత్య కేసులో బోయ రఘు తో పాటు నింధితులుగా ఉన్న వారందరిని దిశా చట్టం కింద శిక్షించాలని డిమాండ్ చేవారు. లేని పక్షంలో ఇతర ప్రజా సంఘాలను కలుపుకొని ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. షాహిదాను అతి కిరాతకంగా బోయ రఘు చెరువులో తోసి చంపినట్లు స్థానికంగా విమర్శలొస్తున్నాయని దీనిపై17వ తేదీ రాత్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు సరిగా స్పందించేలేదన్న విమర్శలు వస్తున్నాయన్నారు.
ఏపీ రాష్ట్ర సమన్వయ కర్త షేక్ గౌస్ బాషా

 ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం జోక్యం చేసుకొని నింధితులకు కఠినంగా శిక్షించాలని వారు కోరారు. మైనార్టీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ తరహాలో ప్రత్యేక రక్షణను కల్పిస్తూ మైనార్టీలకు ప్రత్యేక చట్టం తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు పేర్కొన్నారు. దిశా చట్టం రాష్ట్రంలో అమలులోవున్నా కామపిశాచులు ఇంకా రెచ్చిపోతున్నారని విమర్శించారు. చట్టం పకడ్భందీగా అమలు కాకపోవడవల్లే నేర ప్రవృత్తి పెరిగిపోతోందని వారు ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం దిశా చట్టాన్ని పకడ్భంధీగా అమలు చేయాలని కోరారు. షాహీదా అత్యాచార, హత్య నింధితులను తీవ్రతీ తీవ్రంగా శిక్షించాలని వారు కోరారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: