ఎయిడ్స్ బాధితులకు...

విజయ బ్లడ్ బ్యాంక్ టెక్నీషన్ అన్నదానం

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల విజయ బ్లడ్ బ్యాంక్ ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న మద్దిలేటి తన నాన్న వర్ధంతి సందర్భంగా అతని తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, అందుకోసం ఏదో ఒక మంచి పని చేయాలని భావించి ఈ రోజు నంద్యాల ఎస్.ఆర్.బి.సి కాలనీ నందు ఉన్న పరివర్తన లైఫ్ సెంటర్ నందు ఎయిడ్స్ బాధితులకు, పుణ్యకార్యం అయినటువంటి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆసరా సొసైటీ అధ్యక్షులు షేక్ బాబా ఫక్రుద్దీన్, విజయ బ్లడ్ బ్యాంక్ టెక్నిషన్స్ ప్రవీణ్, అశోక్, విజయ్, మహేష్, వినోద్, సాయి, సెంటర్ నిర్వాహకులు అబ్రహం తదితరులు పాల్గొనడం జరిగింది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: