ఆ కార్పొరేట్,ప్రైవేట్ పాఠశాలల పై చర్యలు తీసుకోవాలి
ప్రగతిశీల యువజన సంఘం జిల్లా నాయకులు నవీన్ డిమాండ్
(జానోజాగో వెబ్ న్యూస్-నందికొట్కూరు ప్రతినిధి)
రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలను పునఃప్రారంభం చేసింది..ఈ నేపధ్యంలో కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థుల తల్లిదండ్రులు నుండి అడ్డగోలుగా ఫీజులు వసూళ్లు చేస్తూ విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని ప్రగతిశీల యువజన సంఘం జిల్లా నాయకులు నవీన్ కుమార్ అన్నారు.మంగళవారం నాడు స్థానిక నందికొట్కూరు తహసీల్దార్ సిహెచ్ రూపలత గారికి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ప్రగతిశీల యువజన సంఘం జిల్లా నాయకులు నవీన్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా నిబంధనలు పాటించాలని,జగనన్న విద్యాకానుక పూర్తిస్థాయిలో విద్యార్థులకు అందజేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ సైకిళ్లు అందజేయాలని డిమాండ్ చేశారు.అనుమతులు లేని ప్రైవేట్ పాఠశాలలు మూసివేయాలని ,కరోనా నిబంధనలు పాటించని పాఠశాల లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నందికొట్టుకురు ప్రగతిశీల యువజన సంఘం డివిజన్ నాయకులు అఖిల్ మొదలైన వారు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: