జగన్ మామయ్య చొరవతో..

 గిరిజన విద్యార్థులకు నీట్, ఐఐటి శిక్షణ కేంద్రాలు

విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలనే సీఎం సంకల్పం అమోఘం

ఉన్నత విద్యకు జగన్ కృషి

గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు నాయక్

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

పేద గిరిజన విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో నీట్. ఐఐటీలో శిక్షణ ఇచ్చేందుకు సీఎం జగన్ మామయ్య నిర్ణయం తీసుకోవడం అమోఘని, గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు నాయక్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం నంద్యాల పట్టణంలోని స్థానిక  ఆర్ అండ్ బి ప్రభుత్వ అతిథిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజు నాయక్ మాట్లాడుతూ గిరిజనులు ఉన్నతమైన విద్యను అభ్యసించడానికి జగన్ ప్రభుత్వం కొత్త నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. నీట్ ఐఐటిలో శిక్షణ ఇచ్చేందుకు విశాఖలో రెండు ప్రత్యేక కేంద్రాలను ప్రారంభించాలని, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, గురుకుల విద్యాలయాల  పాలకమండలి సంస్థ ఆమోదించడం హర్షించదగ్గ విషయమన్నారు.
గిరిజనుల కోసం వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. అదే విధంగా పేద గిరిజన విద్యార్థుల కోసం విశాఖలోని బాలికలకు, బాలురకు ప్రత్యేకంగా రెండు నీట్, ఐఐటి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం అన్నది సాహసోపేత  విషయం కాదని, విద్యార్థులకు రెండేళ్ల పాటు శిక్షణ ఇస్తామని గిరిజన శాఖ మంత్రి తెలిపారన్నారు. ఫలితాలు సరిగ్గా రాని ఎక్సలెన్స్ విద్యాసంస్థలను సాధారణ విద్యా సంస్థలు గా మార్చేస్తున్నట్లు ఆమె తెలిపారన్నారు. గిరిజన విద్యార్థుల కోసం ఉన్నత విద్యను అందించేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉందన్నారు. సీఎం జగన్ కు గిరిజనులు రుణపడి ఉంటారని హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి రవి నాయక్, జిల్లా అధ్యక్షులు బాలునాయక్ ఉన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: