సీబీఐ విచారణతోనే ...అబ్దుల్ సలాంకు న్యాయం 

ఆ దిశగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి

రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

అబ్దుల్ సలాంకు న్యాయం జరగాలంటే సిబిఐ విచారణ జరిపించాలని, ఇందుకోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలని రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం చేసినట్లు అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ రాష్ట్ర కన్వీనర్ మౌలానా ముస్తాక్ అహ్మద్ పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ లో ఉన్న ఇక్రా స్కూల్లో ఇమాములు, మతపెద్దలు, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలతో అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఆవాజ్ జిల్లాకమిటీ  కన్వీనర్ మస్తాన్ వలి అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశంలో  ముఖ్యఅతిథిగా రాష్ట్ర కన్వీనర్ మౌలానా ముస్తాక్ అహ్మద్, జానోజాగో(ముస్లింల అభివృద్ది వేదిక) సంఘం జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా, ఇమామ్ కౌన్సిల్ రాష్ట్ర నాయకులు అతావుల్లా, అబ్దుల్ హాది, మౌలానా మహబూబ్ బాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బాబా ఫక్రుద్దీన్, పిడిఎస్ యూ నాయకులు రఫీ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చింతలయ్య, ఎం హెచ్ పిఎస్ జిల్లా అధ్యక్షులు యూనుస్, జమాతే ఇస్లామ్ నాయకులు అబ్దుల్ సమద్,  ఆవాజ్ కమిటీ అధ్యక్షులు బాబుల్లా,   కాంగ్రెస్ నాయకులు అబ్దుల్లా,  ఎంఆర్ఎఫ్ నాయకులు మాభాష, సిరివెళ్ల, వెలుగోడు, బనగానపల్లె, మహానంది, నందికొట్కూరు,  గడివేముల తదితర మండలాల నుండి వివిధ పార్టీల నాయకులు పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా మౌలానా ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యలపై సిబిఐ విచారణ జరిపించాలని చేస్తున్న అనేక ఆందోళన ఫలితంగా అధికారులు దిగివచ్చి తూతూ మంత్రంగా విచారణ జరిపించి దోషులను శిక్షించకుండా కాపాడడం జరిగిందని ఆరోపించారు. ఇప్పటికైనా దోషులను కఠినంగా శిక్షించేందుకు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని,  నిమిషాంబ జువెలర్స్ లో దొంగతనం జరిగినప్పుడు నుండి దోషులైన గంగి శెట్టి శ్రీధర్ నిమిషాంబ జువెలర్స్ యజమాని పోలీసుల ప్రజాప్రతినిధుల ఫోన్ కాల్స్ తీయాలని, పోలీసులను ఉద్యోగాలు నుంచి తొలగించాలని,  వారి ఆస్తులను అవినీతి నిరోధక శాఖ వారిచే జప్తు చేయాలని డిమాండ్ చేశారు.


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: