పటేల్ మరణం కాంగ్రెస్ కు తీరని లోటు

కాంగ్రెస్ నేతల నివాళ్లి

హాజరైన ముస్లిం నేతలు

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని నేతలు పేర్కొన్నారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  డాక్టర్ చింతల మోహన్ రావు మాట్లాడుతూ సీనియర్ నేత బహు మేధావి రాజకీయ దురంధరుడు సంక్షోభ నివారణ లో సందర్భ స్ఫూర్తి గా వ్యవహరించే వ్యక్తి అయినటువంటి అహ్మద్ పటేల్ గారి మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలగజేసింది అని కాంగ్రెస్ పార్టీ నీ ఒడి దుడుకులు లో తనదైన శైలితో సమస్యలను పరిష్కరించి శ్రీమతి సోనియా గాంధీ గారికి ముఖ్య సలహాదారుగా వ్యవహరించి పార్టీకి తనదైన శైలిలో సేవలు అందించి అందరికీ ఆదర్శంగా నిలిచిన మహా వ్యక్తి అహ్మద్ పటేల్ గారు అని ఈ సందర్భంగా చెప్పవచ్చు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ ఆయన ఆత్మకు భగవంతుడు శాంతిని ప్రసాదించాలని వేడుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూన్నాము.


 

హాజరైన ముస్లిం నాయకులు

సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ ఖాన్, జానోజాగో(ముస్లింల అభివృద్ది వేదిక) సంఘం జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా,  ఎన్ హెచ్ పి ఎస్ పోరాట సమితి నాయకులు యూనుస్ ఐయుఎంఎల్ జిల్లా కార్యదర్శి సలాం మౌలానా ఈ సమావేశానికి హజరై మాట్లాడుతూ  భారత రాజ్యాంగం కేవలం ఓ చట్టపరమైన పత్రం కాదని సమాజంలో అన్ని వర్గాల హక్కులకు, స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు భరోసా ఇచ్చే ముఖ్యమైన సాధనం. కుల, మత, లింగ, ప్రాంతీయ, భాషా దుర్విచక్షణలకు ఆస్కారం ఇవ్వకుండా పౌరులందరికీ సమానత్వం సాధిస్తుందని  శాసన, ప్రభుత్వ, న్యాయ వ్యవస్థల మధ్య అధికారాల విభజన భారత రాజ్యాంగ విశిష్ట లక్షణం. ఒక వ్యవస్థ అధికారాల పరిధిలోకి మరో వ్యవస్థ చొరబడే వీలులేదని రాజ్యాంగం  స్పష్టపరుస్తోంది అన్నారు.

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: