అక్రమ అరెస్టులను ఖండించండి

పీడీఎస్ యూ, పీవైఎల్

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

గత టీడీపీ ప్రభుత్వం హయాంలో నిర్మించిన టిడ్కో గృహాలను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని సిపిఐ నాయకులు చేస్తున్న కార్యక్రమాన్ని నంద్యాల పోలీసులు అడ్డుకోవడం విడ్డూరంగా ఉందని పిడిఎస్ యూ జిల్లా సహాయ కార్యదర్శి  ఎస్.ఎం.డీ.రఫీ, పీవైఎల్ జిల్లా నాయకుడు యూ.నవీన్ పేర్కొన్నారు. సోమవారం గృహాలను లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని ప్రకటించడంతో సిపిఐ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని వారు పేర్కొన్నారు.  ఈ అక్రమ అరెస్టులను వారు ఖండించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం  అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటిన తర్వాత కూడా లబ్ధిదారులకు గృహాలు అప్పజెప్పకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డిపాజిట్ దారులు అందరికీ  వారి డబ్బు వారికి చెల్లించి ఉచితంగా గృహాలను పేదలకు పంపిణీ చేయాలని పీడీఎస్ యూ, పీవైఎల్  విద్యార్థి యువజన సంఘాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నమన్నారు.అక్రమ అరెస్టులు అక్రమ నిర్బంధాలు ద్వారా వామపక్ష ఉద్యమాలను ఆపలేరని పై నాయకులు తెలిపారు. ప్రజాగ్రహం చెవి చూడకముందే ప్రభుత్వము లబ్ధిదారులకు గృహాలు పంపిణీ చేయాలని పై నాయకులు డిమాండ్ చేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: