అబ్దుల్  సలాం ఆత్మహత్యపై సిబిఐ విచారణ జరపాలంటూ... 

అబ్దుల్ సలాం న్యాయపోరాట కమిటీ ఆధ్వర్యంలో నంద్యాలలో రాస్తారోకో

రాస్తారోకోలో పాల్గొన్న నాయకులు 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల పట్టణంలో అబ్దుల్ సలాం న్యాయపోరాట కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సంజీవనగర్ గేట్లో 30 నిమిషాలు రాస్తారోకో చేయడం జరిగింది. ఈ రాస్తారోకోలో అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ రాష్ట్ర కన్వీనర్ మౌలానా ముస్తాక్ అహ్మద్, సిపిఎం పట్టణ కార్యదర్శి తోట మద్దులు, మత పెద్దలు అబ్దుల్ హాజీ, ఐయుఎంఎల్ జిల్లా కార్యదర్శి సలామ్ మౌలానా,ఇదృష్ మౌలానా, సిపిఐ జిల్లా నాయకులు బాబా ఫక్రుద్దీన్, జానో జాగో(ముస్లింల అభివృద్ది వేదిక) సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా, పిడిఎస్ యూ జిల్లా సహాయ కార్యదర్శి రఫీ, ఆవాజ్ కమిటీ నాయకులు మస్తాన్ వలి, ఎంహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు యూనిస్, ఎంఆర్ఎఫ్ డివిజన్ అధ్యక్షులు మహబూబ్ బాషా, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్లా, ఎంఐఎం నియోజకవర్గ అధ్యక్షులు అక్బర్ హుస్సేన్ లు పాల్గొని మాట్లాడుతూ 

 

అబ్దుల్ సలాంకు న్యాయం జరగాలంటే సిబిఐ విచారణ జరిపించాలని,  అసెంబ్లీలో సిబిఐ విచారణ జరిపిస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిఐ, క్రైమ్ పార్టీ పోలీసులు గంగాధర్ అండ్ క్రైమ్ టీం ను అరెస్టు చేయాలని, అలాగే వారిని ఉద్యోగాల్లో నుండి తొలగించి వారు అక్రమంగా సంపాదించిన ఆస్తులపై ఏసీబీ అధికారులతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ వేగవంతంగా జరిపించి బాధ్యులపై వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన అబ్దుల్ సలాం పోరాట సమితి, అనంతపురం సాజిదాబి  బాలికపై అత్యాచారం చేసి చంపిన దోషులను యావజ్జీవ శిక్ష విధించాలని పై నాయకులు డిమాండ్ చేశారు . ఈ రాస్తారోకో కార్యక్రమంలో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక నంద్యాల నాయకులు జకీర్, ఫారీద్, సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు గౌస్, లక్ష్మణ్, సిపిఎం మండల కార్యదర్శి సద్దాం హుస్సేన్, రైతు సంఘం నాయకులు సోమన్న, ఇఫ్టూ అధ్యక్షులు ఇర్ఫాన్,  డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి హుస్సేన్ బాషా శివ, ఆవాజ్ యూత్ సద్దాం హుస్సేన్, ముస్లిం మత పెద్దలు, ఇతర ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: