కేంద్రం ఆదుకోవాలి 

వైసీపీ నేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

నివర్ తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందించి ఆదుకోవాలని రాష్ట్ర వైసీపీ నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి కోరారు. తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని,అందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ యుద్ధ ప్రాతిపదికన ఏరియల్ సర్వే నిర్వహించి అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారన్నారు. తుఫాను బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి నిరంతరం కృషి చేస్తుంటే మరోవైపు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కడ తిరగక పొగ మరోవైపు ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఆయన దిగజారుడు విధానాలకు నిదర్శనమని విమర్శించారు. కరోనా కోవిద్ వ్యాప్తిని నివారించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన కృషిని దేశమంతా గుర్తించి ప్రశంసించడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికి ఎంతో సమర్ధతో ముఖ్యమంత్రి వాటిని అధిగమించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలుపరిచి ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటున్నారని అన్నారు. తుఫాను కారణంగా పంటలన్ని నీటి కుంటాలుగా మారిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో  నష్టపోయిన పంటలను లెక్కించి రైతులకు ఆర్ధిక సహాయాన్ని అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్యలు తీసుకుంటున్నారని, కావున ఎవరు భయపడవద్దని రాష్ట్ర వైసీపీ నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి ప్రజలకు భరోసా ఇచ్చారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: