ఒక్కసారి గెలుపుతోనే ఇంతటి గర్వమా

వై.ఎస్.పై బీజేపీ నేత రఘునందన్ వ్యాఖ్యలు అనుచితం

తీవ్రంగా ఖండించిన డాక్టర్ ఏలూరి

(జానోజాగో వెబ్ న్యూస్-తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి)

తెలుగు రాష్ట్రాలలో తన పరిపాలన ద్వారా ప్రజల  హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న దివంగత ముఖ్యమంత్రి, జననేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర వైసీపీ నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి సోమవారం ఒక ప్రకటన పేర్కొన్నారు. రెండు సార్లు ఓడిపోయి టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాల ఫలితంగా మొదటిసారి ఎమ్మెల్యే గా గెలిచినంత మాత్రాన ఇంత అహంకారంతో మాట్లాడం మంచి పద్ధతి కాదని ఆయన రఘునందన్ కు హితవు పలికారు. పావురాలు గుట్టలో పావురమైనరాని అని వైఎస్ పై చేసిన వ్యాఖ్యల పట్ల ఉమ్మడి రాష్ట్రంలోని వైసీపీ క్యాడర్ మాత్రమే గాక తెలుగు ప్రజలందరూ  తీవ్ర మనోవేదనకు గురయ్యారని అన్నారు.

 డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని లేనిచో తగిన బుద్ధి చెబుతామని వైసీపీ నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ ను హెచ్చరించారు. ఒక ప్రజాప్రతినిధికి ఉండాల్సిన లక్షణాలు రఘునందన్ కు లేవని.. దుబ్బాక ఉపఎన్నికల్లో గెలిచానని అతను గర్వంతలకెక్కి మాట్లాడుతున్నారని అన్నారు. ఒక్కసారేదో సింపతితో గెలిచి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే  వైసీపీ కార్యకర్తలు దుబ్బాకకు వచ్చి మరీ కొడతారని తీవ్రంగా హెచ్చరించారు. సభ్యత సంస్కారం లేకుండా చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడటం అతని నీచ సంస్కృతికి నిదర్శనం అన్నారు. ఇకనైనా గొప్ప నాయకుల పట్ల రఘునందన్ రావు మర్యాదగా మాట్లాడటం నేర్చుకోవాలని హితవు పలికారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: