సిబిఐ విచారణను అడ్డుకోవడం ఏమిటీ
సీఎం జగన్ పై నంద్యాల అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ ఆగ్రహం
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ పోరాట కమిటీ గారి కుటుంబానికి సంపూర్ణ న్యాయం కోసం నాలుగు డిమాండ్లతో నంద్యాల అబ్దుల్ సలాం నాయ పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష 8 వ రోజు జానోజాగో(ముస్లింల అభివృద్ది వేదిక) జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా ప్రారంభించారు. ఆవాజ్ కమిటీ జిల్లా కన్వీనర్ మస్తాన్ వలి అధ్యక్షత జరిగిన.
ఈ దీక్షలో అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటి సభ్యులు ఐయుఎంఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సలాం మౌలానా, పిడిఎస్యు జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.ఎం.డీ.రఫీ , ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్) జిల్లా నాయకులు నవీన్, రిటైర్డ్ కాంపౌండర్ కె.జిలాని భాష కూర్చోడం జరిగింది. ఈ దీక్షా శిబిరానికి అబ్దుల్ సలాం న్యాయపోరాటం కమిటీ రాష్ట్ర కన్వీనర్ మౌలానా ముస్తాక్ అహ్మద్ ,ఆవాజ్ జిల్లా కన్వీనర్ మస్తాన్ వలి, ఐయూఎంఎల్ జిల్లా కార్యదర్శి సలాం మౌలానా, పిడిఎస్యు జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.ఎం.డీ.రఫీ,మాట్లాడుతూ దోషులను తక్షణమే అరెస్టు చేయాలి.
రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణ జరపడాన్ని అడ్డుకోవడం సరైంది కాదని హైకోర్టులో సీబీఐ విచారణకు న్యాయమూర్తులు ప్రజా వ్యాజ్యము రిట్ పిటిషన్ అంగీకరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్న డీజీపీ, ఎస్పీ, డీఎస్పీ లకు వచ్చే నెల 15 లోపల ఆత్మహత్య వివరాలు హైకోర్టు జారీ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ అధికారులు విచారణ చేస్తున్నారని సిబిఐ విచారణ అవసరం లేదని అడ్డుకోవడం సరైంది కాదు ఆయన తెలిపారు. అలాగే 28 వ తేదీ అయినా అరెస్టుకు ఆదేశాలు న్యాయమూర్తులు చేయాలని వారు కోరారు. ఈ 8 వ రోజు దీక్షకు సంపూర్ణ మద్దతు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్లా, ఎంహెచ్ పీఎస్ జిల్లా అధ్యక్షులు యూనిస్, హిందుస్థాన్ యునైటెడ్ ముస్లిం ఆర్గనైజేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సలీం అలీ ఖాన్, ఆవాస్ యూత్ నాయకులు సద్దాం హుస్సేన్ మద్దతు తెలియజేశారు.
Post A Comment:
0 comments: