పోలీస్ స్టేషన్ ను అకస్మిక తనిఖి చేసిన ...

దర్శి డిఎస్పి కె. ప్రకాష్ రావు 

(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

ప్రకాశంజిల్లా తర్లుపాడు మండలములోని తాడివారిపల్లె పోలిస్ స్టేషన్ ను దర్శి డిఎస్పి కె. ప్రకాష్ రావు  ఆకస్మికంగా తనిఖి చేశారు. ఈ సందర్భంగా కేసుల వివరాలు, రికార్డులను తనిఖి చేశారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా వుండడముతో సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిఎస్పి కె. ప్రకాష్ రావు మాట్లాడుతూ మండల పరిధిలో 2019 సంవత్సరములో వివిధ కేసులు 120 నమోదు అయ్యాయని, అవి అన్నింటిని పరిష్కరించారన్నారు. 2020 సంవత్సరానికి సంబంధించి రెండు హత్య కేసులు నమోదు అయ్యాయని, వాటిని నిందితులను పట్టుకొని కోర్టుకు అప్పగించడం జరిగిందన్నారు. అలాగే తర్లుపాడులోని వీరభద్ర స్వామి ఆలయములో గోపులు కలశం దొంగిలించిన కేసులో మొత్తం ఐదు మంది నిందితులు వుండగా వారిలో ఇద్దరిని పట్టుకొని కేసు నమోదు చేశామన్నారు. మరో ముగ్గురి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామన్నారు. యువత తప్పడు మార్గములో పయనించకుండా చూడాలన్నారు. ప్రజలు పంతాలకు పోయి అనవసరంగా గొడవలు పడకుండ జాగ్రత్త వహించాలన్నారు. పోలిస్ స్టేషన్ పరిధిలో సిబ్బంది కొరత వుందని, 17 మంది సిబ్బంది కావాల్సివుండగా కేవలం 9 మంది మాత్రమే వున్నారని, త్వరలోనే ఖాళీలను భర్తి చేస్తామన్నారు. పోలిస్ స్టేషన్ ను తాడివారిపల్లె నుండి తర్లుపాడుకు తరలించడంతో ఖాళీగా వున్న తాడివారిపల్లె పోలిస్ స్టేషన్ లో అవుట్ పోస్ట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపమన్నారు. ఎస్సై ఆవుల వెంకటేశ్వర్లు ఆధ్వర్యములో పోలిసు సిబ్బంది ప్రజలకు సేవలు చేస్తున్నారని ఎటువంటి కేసులనైనా సత్వరమే పరిష్కరించే విధంగా ఎస్సై చొరవ తీసుకుంటున్నారని కొనియాడారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: