ఎన్ కౌంటర్ తో షాహిదా కు న్యాయం చెయ్యండి
ముస్లిం హక్కుల పోరాట సమితి డిమాండ్
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
బోయ రఘు తో పాటు మిగతా నలుగురిని ఎన్ కౌంటర్ చేసి మానవమృగాల చేతిలో బలైన దూదేకుల షాహిదకు న్యాయం చేయాలని ముస్లిం హక్కుల పోరాట సమితి నంద్యాల జిల్లా అధ్యక్షులు యూనిస్ డిమాండ్ చేశారు.అనంతపురం జిల్లా కల్యాణ దుర్గం చాపిరి గ్రామానికి చెందిన దూదేకుల షాహిదా ను అదే గ్రామానికి చెంది బోయ రఘు ప్రేమ పేరుతో మోసం చేసి అతి కిరాతకంగా చెరువులో తోసి చంపాడు,దీనిపై17వ తేదీ రాత్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు సరిగా స్పందించలేదన్నారు,మరుసటిరోజు నిందితుడు రఘును పోలీస్ స్టేషన్ కు తరలించిన తప్పించుకు పోయాడని పోలీసులు చెప్పడం బాధాకరమన్నారు,17వ తేదీ చనిపోతే22వ తేదీ వరకు విషయాన్ని దాచిన నిందితుడు రఘు ను వెంటనే కాల్చి చంపాలని ఆవేదన వ్యక్తంచేశారు. గత కొంతకాలం నుంచి ముస్లిం లపై దాడులు పెరిగాయని కఠినమైన చర్యలు తీసుకోకపోతే మరింత ఘోరాలు జరుగుతాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణ1న్యాయం చేయాలని, ఎటువంటి రాజకీయ ప్రలోభాలకు లొంగ వద్దని అన్నారు.
Post A Comment:
0 comments: