మత విద్వేషా రాజకీయాలు బీజేపీకి అలవాటే 

తెలుగు యువత రాష్ట్ర నేత యన్ యమ్ డి ఫిరోజ్

(జానో జాగో వెబ్ న్యూస్ -నంద్యాల టౌన్ రిపోర్టర్)

మత విద్వేషా రాజకీయాలు బీజేపీకి అలవాటే అని తెలుగు యువత రాష్ట్ర నేత యన్ యమ్ డి ఫిరోజ్ ఆరోపించారు. ఈ సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర నాయకులు యన్ యమ్ డి ఫిరోజ్ మాట్లాడుతూ అబ్దుల్ సలాం కుటుంబ ఆత్మహత్యలపై కనీసం మానవత్వం లేకుండా మతంతో ముడిపెట్టి రాజకీయాలు చేస్తున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీజేపీ ఎక్కడ అడుగుపెట్టిన మతతత్వ రాజకీయాలు చేస్తుందని యూపీలో మతతత్వ రాజకీయాలు సాగినట్టు ఏపీలో సాగనివ్వమని హెచ్చరించారు. అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం కోసం కులమతాలకు అతీతంగా రాజకీయపార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రజలందరూ తోడుగా ఉన్నారని తెలియజేశారు. ప్రజలకు ప్రేమానురాగాలు ఇవ్వాలి తప్ప విద్వేషాలు కాదని ఫిరోజ్  హితవు పలికారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: