నివర్ తుఫాను నేపథ్యంలో...
సహాయక బృందాలను అప్రమత్తం చేసిన ఏపీ
విపత్తను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్దంగా ఉండాలి-సీఎం వై.ఎస్.జగన్
(జానోజాగో వెబ్ న్యూస్-నెట్ వర్క్ డెస్క్)
బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడిన నివర్ తుఫాను రేపు మరింత తీవ్ర రూపం దాల్చనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి బంగాళఖాతంలో ఏర్పడిన నివర్ చెన్నై ఆగ్నేయం దిశగా 420 కిమీ వేగంతో పుదుచ్చెరి చుట్టూ కారైకల్, మామల్లపురం, తమిళనాడు తీరాలు దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో 24 గంటల్లో నివర్ తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. దీనివల్ల రేపు, ఎల్లుండి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చెరిల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి ప్రభుత్వాలు రక్షణ చర్యల్లో భాగంగా సహాయక బృందాలను అప్రమత్తం చేస్తున్నాయి.
ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను అప్రమత్తం చేసిన ఏపీ ప్రభుత్వం
ఇక రేపు(బుధవారం) మామళ్లపురం- కరైకల్ తీరం వెంబడి 65-85 కిమీ వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందున దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భార వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతీ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున్న మత్సకారులు వేటకు వెళ్లొద్దని ఏపీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అంతేగాక నెల్లూరు జిల్లాలో ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ సహాయక బృందాలను సిద్దం చేస్తుండగా.. కాకినాడ, అమలాపురం, పెద్దాపురంలోని 13 మండలాలు అధికారులకు ఏపీ ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది. ఇక కృష్ణా జిల్లా అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్ ఇంతియాజ్ అలీ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డివిజనల్ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
చెన్నైలో 100 కి.మీ వేగంతో ఈదురు గాలులు
అయితే నిన్నటి నుంచి చెన్నై, కరైకల్, నాగపట్నంలో కురిసిన వర్షం కారణంగా చెన్నై పోర్టులో 6వ నంబర్ వద్ద తమిళనాడు ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. చెన్నైలో 100 కి.మీ వేగంతో గాలులు వీచే సూచనలు ఉండటంతో కడలూరు పోర్టులో 7వ నంబర్ వద్ద అధికారులు హెచ్చరిక జారీ చేశారు. కడలూరు, మహాబలిపురం, పెరబలూరులో కూడా భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
అప్రమత్తంగా ఉండండి...అధికార్లకు సీఎం ఆదేశం...
‘నివర్’ తుపాను నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో సీఎం శ్రీ వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్
తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు హాజరు. తుపాను కదలిక, ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలపై అధికారులతో విస్తృతంగా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, వ్యవసాయ, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, పోలీసు, విపత్తు నిర్వహణ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు హాజరయారు.
తుపాను నేరుగా ఏపీని తాకకపోయినా, తమిళనాడుకు చేరువలోనూ, సముద్ర తీర ప్రాంతాలలోనూ దాని ప్రభావం ఉంటుంది, భారీ వర్ష సూచన కూడా ఉందని ముఖ్యమంత్రి అధికార్లకు సూచించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికార్లను ఉద్దేశించి మాట్లాడుతూ...రేపు (బుధవారం) సాయంత్రం నుంచి, ఎల్లుండి (గురువారం) అంతా ప్రభావం ఉంటుందని చెప్తున్నారు, వర్షాలు బాగా పడే అవకాశాలున్నాయి. దీనికి మనం సన్నద్ధంగా ఉండాలి, నెల్లూరు, చిత్తూరు, కడపలోని కొన్ని ప్రాంతాలు, ప్రకాశం జిల్లాలో తీర ప్రాంతం, కర్నూలు, అనంతపురం జిల్లాలలో 11–20 సెంటీమీటర్ల మేర వర్షాలు కురిసే అవకాశం, అలాగే గంటకు 65 నుంచి 75 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది, పంటలు దెబ్బతినకుండా వాటి రక్షణకోసం చర్యలు తీసుకోవాలి,ఆర్బీకేల ద్వారా రైతులకు సూచనలు పంపాలి:
కోత కోసిన పంటలను రక్షించేందుకునే విధంగా వారికి అవగాహన కల్పించాలి, ఒక వేళ పంటలు కోయకుండా అవి పొలంలోనే ఉంటే.. వాటిని కోయకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది, అక్టోబరులో కురిసిన భారీ వర్షాలతో చెరువులు, రిజర్వాయర్లు అన్నీ నిండి ఉన్న నేపథ్యంలో మళ్లీ వర్షాలు పడితే.. చెరువులకు గండ్లు పడే అవకాశాలు ఉంటాయి, ఆ గండ్లు పడకుండా నిరంతరం మానిటర్ చేసి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి, కోస్తా ప్రాంతంలో ప్రాణ నష్టం లేకుండా, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా చూసుకోండి గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వారికి దిశా నిర్దేశం చేయండి, వారి సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోండి:ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధం చేసుకోండి: అలాగే కరెంటు సరఫరాకు అంతరాయం కలిగితే, వెంటనే పునరుద్ధరణకు కరెంటు స్తంభాలను సిద్ధం చేసుకోండి:ప్రతి జిల్లా కలెక్టరేట్‌లో రోజంతా పని చేసే కంట్రోల్ రూం ఏర్పాటు చేసుకోండి: మండల కేంద్రాల్లో కూడా కంట్రోల్ రూమ్స్ ఉండాలి: నెల్లూరు నుంచి తూర్పుగోదావరి వరకూ వర్షాలు ఉండే అవకాశాలున్నాయి: ఎక్కడైనా చెట్లు విరిగి పడితే వాటిని వెంటనే తొలగించేలా తగిన పరికరాలను, సామగ్రిని అందుబాటులో ఉంచుకోండి: తుపాను సమయంలో తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ రూపొందించిన బుక్‌లెట్‌ను అన్ని గ్రామ సచివాలయాలకు అందుబాటులో ఉంచారు. ఆ సమాచారం సిబ్బందికి, ప్రజలకు చేరవేసేలా చూడాలి: రైల్వే కోడూరు, రాజంపేట, బద్వేలు లాంటి ప్రాంతాలపై ప్రభావం ఉంటుంది, జాగ్రత్తలు తీసుకోవాలి: నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో అవసరమైన చోట్ల సహాయ, పునరావాస శిబిరాలపై దృష్టి పెట్టాలి: అని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అధికార్లకు సూచించారు.
Post A Comment:
0 comments: