ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలి

డిహెచ్ పీఎస్ ఆధ్వర్యంలో  రౌండ్ టేబుల్ సమావేశం 

(జానోజాగో వెబ్ న్యూస్-మడకశిర ప్రతినిధి)

మడకశిర పట్టణం లోని రాజీవ్ గాంధీ సర్కిల్ నందు డిహెచ్ పీఎస్ ఆధ్వర్యంలో ఎమ్మా హనుమంతు అధ్యక్షతన ఎస్సీ వర్గీకరణ-సుప్రీంకోర్టు తీర్పు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పావగడ శ్రీరాం, ఉమర్ ఫారూఖ్ ఖాన్, జుబేర్, లక్ష్మీనారాయణ, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్  ఖాన్ మాట్లాడుతూ

 

జస్టిస్ లోకూర్ కమీషన్ జస్టిస్ ఉషా మెహ్రా కమీషన్ ఎబీసీడీ వర్గీకరణకు అనుకూలంగా నివేదికలందజేశాయని, సుప్రీంకోర్టు 5బెంచీ ల న్యాయమూర్తులు రాష్ట్రాలు ఏబీసీడీ వర్గీకరణ విషయంలో ముందుకెళ్ల వచ్చు అని చెప్పినా ప్రభుత్వాలు స్పందించడం లేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  శీతాకాల సమావేశాల్లో ఏబీసీడీ వర్గీకరణకు అనుకూలంగా చట్టం చేసి పార్లమెంటులో బిల్లు పెట్టి ఆమోదింపజేయాలని విజ్ఞప్తి చేశారు.

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: