బిస్మిల్ అజమాబాది కలం నుంచి జాలువారిన గీతం...

“సర్ఫరోషి కి తమ్మన్నా” 

నాడు బ్రిటీషర్లకు వణుకు పుట్టించిన గీతం

రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్, భగత్ సింగ్, చంద్ర శేఖర ఆజాద్ ఆ గీతం స్పూర్తి దాయకం


బ్రిటీషర్ల నుంచి భారతదేశ విముక్తి కోసం నాడు సాగిన స్వాతంత్య్ర భారత సంగ్రామ చరిత్రలో ప్రతి భారతీయుడిగి ఒక్కో రకమైన ప్రముఖ పాత్ర. భారతీయ పోరాటంలో కుల, మత కోణం వెతకలేం. ఎందుకంటే నాడు అన్ని కులాల వారు, మతాల వారు ఐక్యంగా తామంతా భారతీయులమన్న భావనతోనే ఏకమయ్యారు. తమ కులం, మతం వ్యక్తిగతానికి పరిమితం చేశారు. బాహ్య సమాజంలో మాత్రం భారతీయతను చాటారు. తమంతా సోదరులమని బ్రిటీషర్ల కే కాదు యావత్తు ప్రపంచానికి చాటి చెప్పారు నాటి మన భారతీయ పూర్వీకులు. నాటి స్వాతంత్య్ర సంగ్రామానికి కొందరు ప్రత్యక్ష పోరాటాలకు దిగితే ఆ ఉద్యమాలకు మరి కొందరు పాట రూపంలో, సంపద ధానం రూపంలో ఉద్యమంలో పాలుపంచుకొన్నారు. అలాంటి వారిలో ఒకరు బిస్మిల్ అజమాబాది (సయ్యద్ షా మొహమ్మద్ హుస్సేన్) (1901-1978). భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమం గురించి ప్రస్తావిస్తే చాలు అందరికి అవలీలగా గుర్తొచ్చే పేర్లు రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్, భగత్ సింగ్, చంద్ర శేఖర ఆజాద్. ఎందుకంటే బ్రిటీషర్లపై నేరుగా పోరాటం చేసిన వీరులు. దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారు వీరు. ఇలాంటి భారతీయ విప్లవ కారులకు స్పూర్తినిచ్చిందేమిటీ అంటే అదే బిస్మిల్ అజమాబాది కలం నుంచి జాలువారిన గీతం...“సర్ఫరోషి కి తమ్మన్నా”. నాడు ఈ గీతం స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. ఇది వక్రీకరించబడిన చరిత్ర విస్మరించినా వాస్తవంలో మాత్రం ఇది చారిత్రాత్మక వాస్తవం.

బీహార్ కు చెందిన బిస్మిల్ అజీమాబాది (Bismil Azimabadi) (సయ్యద్ షా మొహమ్మద్ హసన్) 1901 సంవత్సరం లో అజీమాబాద్, పాట్నాలో జన్మించారు. ఆయన 1978 లో మరణించారు. ఈయన భూస్వామి. జాతియోద్యంలో చురుకుగా పాల్గొన్నారు. ఈయన కవి, స్వాతంత్ర్య సమరయోధుడు. ఉర్దూ, అరబిక్, పెర్షియన్, ఆంగ్లములో కవిత్వం రాశారు. గజల్, నాజ్మ్ లో కూడా ప్రసిద్దులు. ఈయన1921 లో డిల్లి నుంచి ప్రచురింపబడే జర్నల్ సబాలో (journal Sabah) లో రాసిన దేశభక్తి గీతం  “సర్ఫరోషి కి తమ్మన్నా” ఎందరో స్వాతంత్ర సమరయోధులకు ముఖ్యంగా రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్, భగత్ సింగ్, చంద్ర శేఖర ఆజాద్ వంటి ప్రముఖ స్వాతంత్ర సమర యోధులకు స్ఫూర్తి ఇచ్చింది. ఈ దేశభక్తి గీతం  భారతదేశంలో బ్రిటిష్ రాజ్ కాలంలో యుద్ధ కేకగా భారత స్వాతంత్ర్య సమరయోధుడు రామ్ ప్రసాద్ బిస్మిల్ చేత అమరత్వం పొందింది. ఆ రోజులలో ఈ గీతం బ్రిటిష్ వారి పట్ల విప్లవ శంఖం మ్రోగించినది. బీహార్ ఉర్దూ అకాడమీ అతని పేరు మీద "బిస్మిల్ అజీమాబాది అవార్డు" కూడా అక్కడ ఇస్తున్నారు.

 

 ✍️ రచయిత-మహమ్మద్ అజ్గర్ అలీ

రాజనీతి తత్వ శాస్త్ర విశ్రాంత అధ్యాపకులు

సెల్ నెం-94915-01910

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: