సాంఘిక విప్లవకారుడు...
మహాత్మా జ్యోతి రావు పూలే
ఘన నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నేతలు
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
మహాత్మా జ్యోతి రావు పూలే 130 వ వర్ధంతిని పురష్కరించుకొని పూలేకు పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు ఘన నివాళ్లులర్పించారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నంద్యాల అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చింతల మోహన్ రావు మాట్లాడుతూ భారతీయ సమాజంలో అసమాన కుల సంస్కృతిని మార్చి సమానత్వ జీవన విధానం నెలకొల్పేందుకు మహోన్నతమైన కృషి చేసిన గొప్ప సాంఘిక విప్లవ మూర్తి అని కొనియాడారు.
పూలే ఆలోచనలు నేటి విద్యాధిక యువతకు మార్గదర్శం కావాలన్నారు. "ఆర్ధిక అసమానతలు, సామజిక ఆంక్షలు వెరసి అణగారిన వర్గాలు అభివృద్హికి నోచుకోక ఆటవిక జీవనానికి అలవాటుపడగా, కోటి వెలుగుల సూరీడులా బడుగు బలహీన వర్గాల జీవితాల్లో ఉదయించిన ఆశయ సూరీడు మహాత్మా జ్యోతిబా ఫూలే అని, ఎందరినో ఉత్తేజపరిచి, మరెందరికో స్ఫూర్తిగా నిలిచి సామాజిక కట్టుబాట్లు తెంచి విద్య వెలుగులు ప్రతి వాడా ప్రసరింపజేసిన నవ చైతన్య క్రాంతి మహాత్మా ఫూలే అని, అటువంటి మహాత్మునికి దేశం గర్వపడే స్మారకాన్ని నిర్మించి, అయన ఖ్యాతిని విశ్వవ్యాప్తం చెయ్యాలని" అన్నారు. మహాత్మా ఫూలే ఆశయసాధనలో ప్రతిఒక్కరూ పీడిత ప్రజల విద్య. సామజిక అభివృద్ధికి తోడ్పాటు అందించాలని, తద్వారా ఫూలే ఆశయాలను సజీవంగా నిలిపినవారమౌతామని, అదేవిధంగా ఇటువంటి మహనీయులకు మనస్పూర్తిగా గుర్తు చేసుకోవాల్సిన అవశ్యకత చాలా ఉంది. అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పిసిసి మెంబర్ వాసు, సేవాదల్ రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ ఖాన్, జిల్లా కార్యదర్శి బాలకృష్ణ, జిల్లా ట్రెజరర్ ఎస్ వై డి ప్రసాద్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఆర్ టి సి ప్రసాద్, అహ్మద్, మైనారిటీ నాయకుడు కటిక కాశీం, యూత్ కాంగ్రెస్ నాయకులు పసుపుల అజయ్, మహబూబ్ బాషా, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: