ప్రేమ, మానవత్వం, సమానత్వం...
ఇవే వారిని ఇస్లాంలోకి మారేలా చేశాయి...కత్తి భయంతో కాదు
ఇస్లాం స్వీకరించిన ప్రపంచ ప్రముఖులు
మన దేశ చరిత్రనే కాదు...ప్రపంచ చరిత్ర కూడా వక్రీకరించబడింది. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఆయా దేశాలలోని కొన్ని స్వార్థ ప్రయోజకుల స్వార్థ ప్రయోజనాల కోసం వారి అనుకూలంగా చరిత్ర వక్రీకరించబడింది. అందుకే కత్తితోనే ఇస్లాం వ్యాపించిందన్న నిందన ఇస్లాం సమాజంపై మోపబడింది. అందుకే నాటి నుంచి నేటి వరకు ఇస్లాంపై అనేక అపోహలు. కానీ ఇపుడు రాజ్యాలు పోయి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అయినా రోజుల్లో కూడా సామాన్యుల మాట అటువుంచి ఎందరో ప్రముఖులు ఇస్లాంను స్వీకరిస్తున్నారు. ఏదో ఆషామాషీగానో ప్యాషన్ గానో వీరు ఇస్లాంను స్వీకరించడంలేదు. కాకపోతే ఇస్లాంను లోతుగా అధ్యయనం చేశాకే వారు ఇస్లాంలోకి మారుతున్నట్లు వారు స్వయంగా ప్రకటించిన మాటల చేతే అర్థమవుతుంది. ఇపుడు ఆలోచించాంచాల్సింది ఒక్కటే. ఇస్లాంపై ఎవరైనా బురద చల్లే ముందు ఓ సారి వాస్తవంగా ఇస్లాం ఏమిటో అర్థం చేసుకోవాలి. ఇస్లాం గురించి లోతగా అధ్యయనం చేయాలి. అపుడే ఇస్లాం గొప్ప తనం అర్థమవుతుంది. ఇస్లాం ఏ మతం వారిని ఇబ్బంది పెట్టదని, తన తోటివారితోనే మానవత్వంగా మెలగమని ఇస్లాం చెబుతుందని బోధపడుతుంది.
ఇస్లాం అనేది సంపూర్ణ ధర్మం. ఇది మానవాళికి పూర్తి మార్గదర్శకత్వం ఇస్తుంది. ప్యూ రీసెర్చ్ నివేదిక ప్రకారం, ఇస్లాం వేగంగా అభివృద్ధి చెందుతున్న ధర్మం గా గుర్తించబడింది. ప్రపంచ వ్యాప్తంగా అనేకులు ఇస్లాం చే ప్రభావితులై దానిని అధ్యయనం, పరిశోధన చేసి ముస్లింలు గా మారారు. తమ జీవితాలను మెరుగు పరుచుకొని శాంతి పొందారు. ప్రపంచ వ్యాప్తంగా ఇస్లాం ధర్మం లోకి పలువురు ప్రముఖులు మారారు. వారు వివిధ వృత్తులు, వివిధ ప్రాంతాలకు చెందినవారు. ఇస్లాం మతంలోకి మారిన తరువాత వారి జీవితాలు పూర్తిగా మారిపోయాయి.
మైక్ టైసన్(Mike Tyson)
ఆ జాబితాను చూడండి:
ఎ.ఆర్ రెహమాన్ (అల్లాహ్-రాఖా రెహ్మాన్)
A.R. Rahman (Allah-Rakha Rahman)
భారతీయ ప్రజల అభిమాన సంగీతకారుడు, ప్రసిద్ధ స్వరకర్త గాయకుడు, ఏ.ఆర్.రెహమాన్ హిందూ కుటుంబం లో దిలీప్ కుమార్ గా జన్మించాడు. అతని తల్లి తన వివాహానికి ముందు ఇస్లామిక్ మహిళ, సూఫీ తత్వాన్ని అనుసరించేది. ఎ.ఆర్ రెహమాన్ ఖాదిరి ఇస్లాంను కలుసుకున్నాడు, ఇస్లాం విలువలను నేర్చుకున్నాడు. ఆయన నుండి ప్రేరణ పొంది ఇస్లాం స్వీకరించాడు.
ముహమ్మద్ అలీ
Muhammad Ali/Cassius Clay
ముహమ్మద్ అలీ ప్రసిద్ధ బాక్సింగ్ ఛాంపియన్. ఒలింపిక్ పతక విజేత. అతను విశ్వాసం ద్వారా క్రైస్తవుడు. అతని పేరు పుట్టుకతో కాసియస్ క్లే. కానీ 1992 లో తన 20 సంవత్సరాల వయస్సులో, ఆఫ్రికన్ అమెరికన్ల శ్రేయస్సు కోసం కొనసాగుతున్న నేషన్ ఆఫ్ ఇస్లాం లో చేరాడు. ఈ ఉద్యమం ముహమ్మద్ అలీని ప్రేరేపించింది. త్వరలో మాల్కం X యొక్క మార్గదర్శకత్వంలో ఇస్లాం ధర్మం స్వీకరించాడు. అంతేకాక అతను సూఫీ తత్వాన్ని అభ్యసించడం ప్రారంభించాడు.
మైక్ టైసన్(Mike Tyson)
ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్, మైక్ టైసన్ తన విశ్వాసాన్ని మార్చుకుని ఇస్లాం ధర్మం లోకి మారారు. అత్యాచారానికి పాల్పడినందుకు 1992 నుండి 1995 వరకు జైలులో ఉన్నాడు. ఆయన ఇస్లాం ధర్మం లోకి మారడం గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. కానీ అతను 2010 లో మక్కాలోని హోలీ కాబా ముందు తన ఫోటోను ట్వీట్ చేసిన తరువాత, ప్రజలందరూ అతని ధర్మ పరివర్తన గురించి తెలుసుకున్నారు
షర్మిలా ఠాగూర్ అకా బేగం ఆయేషా సుల్తాన్
Sharmila Tagore Aka Begum Ayesha Sultan
షర్మిలా ఠాగూర్ భారతదేశపు ప్రసిద్ధ, అవార్డు పొందిన నటి. ప్రఖ్యాత భారత ముస్లిం క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడిని ప్రేమించిన తర్వాత ఆమె తన విశ్వాసాన్ని విడిచి ఇస్లాం ధర్మం లోకి మారారు. మన్సూర్ అలీ ఖాన్‌ను వివాహం చేసుకోవడానికి గాను ఆమె 1969 లో ఇస్లాం ధర్మం లోకి మారారు. ఆమె కుమారుడు సైఫ్ అలీ ఖాన్ ప్రసిద్ద బాలివుడ్ నటుడు.
కరీం అబ్దుల్-జబ్బర్
Kareem Abdul-Jabbar
స్టార్ ఎన్బిఎ(NBA) ఆటగాడు ఫెర్డినాండ్ లూయిస్ ఆల్సిండోర్ జూనియర్, ముస్లిం వారసత్వం (heritage) చే ప్రభావితుడు అయి తన విశ్వాసాన్ని మార్చుకుని ఇస్లాం ధర్మం స్వికరించినాడు. తరువాత అతనికి కరీం అబ్దుల్-జబ్బర్ అనే కొత్త పేరు కూడా వచ్చింది.
జానెట్ జాక్సన్ Janet Jackson
జానెట్ జాక్సన్ ప్రసిద్ద గాయకుడు మైఖేల్ జాక్సన్ సోదరి. ఆమె ఒక ప్రఖ్యాత నటి / గాయని. వాసిం అల్ మన Wissam Al Mana అనే ముస్లింను వివాహం చేసుకోవడానికి ఆమె 2013 లో ఇస్లాం స్వికరించినది. తరువాత ఆమె వినోద పరిశ్రమ నుండి ప్రైవసీ పొందటానికి పరిశ్రమ నుండి రిటైర్ అయ్యింది
వీరు ఇస్లాం ధర్మం స్వీకరణ కొరకు తమ జీవితాలను మార్చుకున్న కొంతమంది నయా (convert) ముస్లింలు.
✍️ రచయిత-మహమ్మద్ అజ్గర్ అలీ
రాజనీతి తత్వ శాస్త్ర విశ్రాంత అధ్యాపకులు
సెల్ నెం-94915-01910
Excellent
రిప్లయితొలగించండి