పేద గిరిజన నిరుద్యోగులకు జగనన్న మరో వరం...
గిరిజన పక్షపాతి సీఎం జగన్
గిరిజన గుడాలకు ఇంటర్నెట్ సౌకర్యంతో వైసీపీ ప్రభుత్వం పెద్దపీట
గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు నాయక్
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, తాజాగా ఆయా వర్గాలతోపాటు పేద గిరిజన నిరుద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించాలని నిర్ణయం తీసుకోవడం శుభసూచకమని గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు నాయక్ హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని స్థానిక జిపిఎస్ కార్యాలయంలో గిరిజన నాయకులతో సమావేశం నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు నాయక్ మాట్లాడుతూ నిరుపేద నిరుద్యోగుల ఎస్టీలకు మినీ ట్రక్కులు కల్పించి ఆర్థిక భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషమన్నారు. అదే విధంగా ఏ ప్రభుత్వం చెయ్యని విధంగా 60% సబ్సిడీ ఇచ్చి 30% ఎస్టి కార్పొరేషన్ ద్వారా మంజూరు అయ్యేలా జిల్లా వ్యాప్తంగా గిరిజనులకు 21 వాహనాలను అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ఇంత భారీ స్థాయిలో సబ్సిడీ ఇవ్వడం ఇదే మొదటిసారి అని, గిరిజన పక్షపాతిగా సీఎం జగన్ నిలిచిపోతారన్నారు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారన్నారు. అదే విధంగా మన రాష్ట్రంలోని ప్రతి గిరిజన గూడేనికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తూ, కొండ కోనల మధ్య ఉండే గిరిశిఖర గ్రామాలకు సైతం ఇంటర్నెట్ సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం శుభసూచకమని అన్నారు. ప్రతి గిరిజన గ్రామానికి ఈ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ఇంటర్నెట్ సౌకర్యం కల్పించిందని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నూతనంగా ఏర్పాటుచేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ నిర్వహణకు ఇంటర్నెట్ తప్పనిసరి కావడంతో సైబర్ నెట్ కార్పొరేషన్ ద్వారా అదేవిధంగా ఎక్కడో అడవుల్లో ఉంటూ ప్రపంచంలో జరిగే ప్రతి విషయాలను వారు తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం మంచిదన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి రవి నాయక్, కర్నూలు జిల్లా అధ్యక్షులు బాలునాయక్, ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ విజయ్ నాయక్, జిపిఎస్ జాయింట్ సెక్రెటరీ బాల నాయక్, వెలుగోడు కార్యవర్గ సభ్యులు విక్రమ్ నాయక్, జిపిఎస్ నాయకులు జనార్దన్ నాయక్, తదితరులు పాల్గొన్నారు
Post A Comment:
0 comments: