సమ్మెను విజయవంతం చేయండి

పీడీఎస్ యూ పిలుపు

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

సామాజిక భద్రత కార్మిక రైతు,ప్రజల రక్షణకై బిజేపి మోడి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు వ్యతిరేకిస్తూ కార్మిక గర్జన  నవంబర్ 26 సార్వత్రిక సమ్మె ను విజయవంతం చేయలని పీడీఎస్ యూ  విద్యార్థి సంఘాలు నాయకులు పిలుపునిచ్చారు. నంద్యాల పట్టణంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్ యూ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.ఎం.డీ.రఫీ  మాట్లాడుతూ భారత ప్రజలు కార్మిక వర్గం రక్తం చిందించి సాధించుకున్న కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం ఏకాపక్షంగా రద్దు చేసి కార్పొరేట్లకు,బూర్జువాలా అనుకూల లేబర్ కోడ్లులను చట్టబద్ధం  చేసి పెట్టుబడిదారీ పాశవిక శ్రమదోపిడికి మార్గం సుగమం చేసిందని ఆవేదన వ్యక్తంచేశారు,రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోడీకి వత్తాసు పలుకుతూ కార్మిక హక్కులను కలరాస్తున్నది అని మోడీ ప్రభుత్వం పార్లమెంటులో తీసుకొచ్చిన అన్ని బిల్లలకు  మద్దతు తెలుపుతూ ఓట్లు వేసిందని, అందులో భాగంగానే నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధుల నుండి అక్రమంగా 830 కోట్లు దారిమళ్లించింది ఇసుక సరఫరా నిలిపివేసిన కాలంలోనూ, కరోన కష్ట కాలంలో వారిని ఏవిదంగా అదుకోలేదు,కానీ  వారి సంక్షేమ పధకాలను నిపివేయాడం మోడీ ఫాసిస్టు పాలనకు నిదర్శనమని విమర్శించారు,కార్మిక హక్కులు కాపాడే దిశగా జరుగుతున్న సమ్మె లో కార్మికులందురు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో పీడీఎస్ యూ డివిజన్ నాయకులు బాలు, మహేంద్ర,మహేంద్ర,నాయక్ మొదలైన వారు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: