షాహిదాకు న్యాయం చేయాలి
కాంగ్రెస్ నేత డాక్టర్ చింతల మోహన్ రావు
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
షాహిదా కుటుంబానికి న్యాయం చేయాలని, దోషులను కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత డాక్టర్ చింతల మోహన్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు మాట్లాడుతూ అనంతపురం జిల్లా షాహిదా కు న్యాయం చెయ్యండి. బోయ రఘు తో పాటు మిగతా నలుగురి మానవమృగాల చేతిలో బలైన దూదేకుల షాహిదకు న్యాయం చేయాలని నంద్యాల కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కల్యాణ దుర్గం చాపిరి గ్రామానికి చెందిన దూదేకుల షాహిదా ను అదే గ్రామానికి చెంది బోయ రఘు ప్రేమ పేరుతో మోసం చేసి అతి కిరాతకంగా చెరువులో తోసి చంపాడు,దీనిపై17వ తేదీ రాత్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు సరిగా స్పందించలేదన్నారు,మరుసటిరోజు నిందితుడు రఘును పోలీస్ స్టేషన్ కు తరలించిన తప్పించుకు పోయాడని పోలీసులు చెప్పడం బాధాకరమన్నారు.
,17వ తేదీ చనిపోతే22వ తేదీ వరకు విషయాన్ని దాచిన నిందితుడు రఘు ను వెంటనే అరెస్టు చేసి తగిన శిక్ష విధించాలని ఆవేదన వ్యక్తంచేశారు.గత కొంతకాలం నుంచి ముస్లిం లపై దాడులు పెరిగాయని కఠినమైన చర్యలు తీసుకోకపోతే మరింత ఘోరాలు జరుగుతాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణ న్యాయం చేయాలని, ఎటువంటి రాజకీయ ప్రలోభాలకు లొంగ కుండా తగిన చర్యలు తీసుకొని ఆ అమ్మాయి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో సేవాదల్ రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ ఖాన్, నంద్యాల కాంగ్రెస్ కమిటీ మైనార్టీ నాయకులు కటిక కాసిం, యూత్ కాంగ్రెస్ నాయకులు పసుపుల అజయ్, చల్లా ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు
Post A Comment:
0 comments: