ఉడుంపట్టు దీక్ష

సలాం కుటుంబానికి న్యాయం జరగాలి...అపుటిదాక పోరాటమే

సిబిఐ విచారణ జరపడం లో... దోషులను శిక్షించడంలో సీఎం విఫలం

నంద్యాల అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ

ఆరో రోజుకు చేరుకొన్న దీక్షలు

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

ఏదీ ఏమైనా సరే న్యాయం జరగాలి....దోషులకు కఠిన శిక్షపడితేనే అబ్దుల్ సలాం కుటుంభానికి సంపూర్ణ న్యాయం. అందుకే మా దీక్ష...ఇది ఉండుపట్టు దీక్ష అని నంద్యాల అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ దీక్షలను కొనసాగుతోంది. ఓ కేసులో విచారణ నిమిత్తం వేధింపులకు గురిచేయడంతో కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చెందిన అబ్దుల్ సలాం కుటుంబ సభ్యులు నలుగురు గూడ్స్ రైలు కింద ఆత్మహత్య చేసుకొన్న విషయం తెలిసిందే. పోలీసుల వేధింపుల వల్లే  ఈ ఆత్మహత్య చేసుకొంటున్నామని స్వయంగా అబ్దుల్ సలాం కుటుంబ వీడియో రికార్డ్ లో పేర్కొని మరీ ఆత్మహత్యచేసుకొంది. దీంతో న్యాయం కోసం నంద్యాల అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ ఏర్పాటై సుధీర్ఘ ఉద్యమం సాగుతోంది. 


 

ఇదిలావుంటే అబ్దుల్ సలాం కుటుంభానికి పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని నంద్యాల అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ నాలుగు డిమాండ్లతో నంద్యాల అబ్దుల్ సలాం నాయ పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష  6  వ  రోజుకు చేరుకొంది. ఆరవ రోజు దీక్షను ఎస్డీపీఐ నంద్యాల అసెంబ్లీ అధ్యక్షులు ఇక్బాల్  గారు ప్రారంభించారు. పీడీఎస్ యూ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.ఎం.డీ.రఫీ  అధ్యక్షత  జరిగిన ఈ దీక్షలో  అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటి సభ్యులు ఫాజిల్ దేశాయ్, డివిజన్ ప్రెసిడెంట్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా,ఇద్రిస్ షేక్ డివిజన్ సెక్రెటరీ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ,షేక్ ఇక్బాల్ భాష అసెంబ్లీప్రెసిడెంట్, ఎస్డీపీఐ డా..అబూబకర్ అసెంబ్లీ సెక్రటరీ ఎస్డీపీఐ కరీముల్లా, అసెంబ్లీ కమిట,మెంబర్ ఎస్డీపీఐ సనావుల్లా, అయ్యలురు ప్రెసిడెంట్ ఎస్డీపీఐ,మహమ్మద్ హనీఫ్,పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకమిటీ మెంబర్ అయ్యలూరు మహబూబ్ బాషా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కమిటీ మెంబర్ కానాల,మా భాష నిరాహార దీక్షలకు కూర్చున్నారు.


 

ఈ దీక్షా శిబిరానికి ఎస్.డీ.పీ.ఐ  అసెంబ్లీ అధ్యక్షులు ఇక్బాల్, పాపులర్ ఫండ్ ఆఫ్ ఇండియా డివిజన్ కార్యదర్శి ఫాజిల్ దేశాయ్,ఇద్రిస్ షేక్  డివిజన్ సెక్రెటరీ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా , మాట్లాడుతూ మూడు కేజీల బంగారాన్ని బయటికి తీయాలి. దోషులను అరెస్ట్ చేసి వాళ్ళ ఉద్యోగాలకి తొలగించాలి వారిని అరెస్టు చేయాలి. వాళ్ల ఆస్తులను జప్తు చేయాలి. అప్పుడే అబ్దుస్సలామ్ కుటుంబానికి నిజమైన నివాళులు అర్పించారు అవుతారని అన్నారు. ఆవాజ్ జిల్లా కన్వీనర్ మస్తాన్ వలి,పీడీఎస్ యూ జిల్లా సహాయ కార్యదర్శి రఫీ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు సీఎం జగన్ మోసం చేస్తున్నారని ఎందుకంటే టీడీపీ నుండి రాజీనామా చేసి వైసీపీ లోకి చేరి నేటి వరకు ఇప్పటివరకు ఎటువంటి  పదవి లేదు అలాగే నుండి ఎస్ డి పి ఐ నుండి వై.సీ.పీ లో చేరి టిడిపి గుంటూరులో జరిగిన నారా హమారా టిడిపి హమారా జరిగిన సదస్సులో నే ఆందోళన చేసిన అభివృద్ధి హబీబుల్లాకు ఇప్పటివరకు ఎటువంటి పదవి లేదు. మైనార్టీ వారికి ఉపాధి కల్పన రుణాలు పెళ్లి కానుక రైతు ఆత్మహత్య కు  ఎక్స్ గ్రేషియా గా లేదు. కరుణ కష్టకాలంలో ఉపాధ్యాయులు ఇబ్బంది వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సాయం లేదు. బెస్ట్ ట్రావెల్స్ స్కూల్లో కూడా పెండింగ్ ఉన్న బిల్లును తక్షణమే చెల్లించాలి, అలాగనే ఆ స్కూల్లో కూడా ప్రారంభించాలి. నంద్యాల మున్సిపాలిటీ 44  కార్మికుల కూడా వాళ్ల వీధుల్లో తీసుకోవాలి. పై సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రస్థాయిలో తీసుకుపోదామని పైన ఆయన హెచ్చరించారు.


ఈ 6   వ రోజు  దీక్షకు ఆవాజ్ కమిటీ జిల్లా కన్వీనర్ మస్తాన్ వలి, జానో జాగో(ముస్లింల అభివృద్ది వేదిక) సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా , పిడిఎస్ యూ జిల్లా సహాయ కార్యదర్శి రఫీ ,ప్రగతిశీల యువజన సంఘం జిల్లా నాయకులు నవీన్, ఐయూఎంఎల్ జిల్లా అధ్యక్షులు కరిముల్లా మస్తాన్,  ఎంఆర్ఎఫ్ నంద్యాల డివిజన్ అధ్యక్షులు మహబూబ్ బాషా, చిన్న వ్యాపార సంఘం మండల అధ్యక్షులు మహబూబ్ బాషా తదితరులు హాజరై తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: