సలాం కుటుంభానికి న్యాయంచేయాలని కోరుతూ

రేపు రస్తారోకో

గోడపత్రిక విడుదల చేసిన అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం గోడపత్రిక విడుదల చేశారు. ఈ సంధర్భంగా ఆవాజ్ జిల్లా కన్వీనర్ మస్తాన్ వలి, జానో జాగో (ముస్లింల అభివృద్ది వేదిక) సంఘం జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా, పిడిఎస్ యూ జిల్లా సహాయ కార్యదర్శి రఫీ, ఐయుఎంఎల్ జిల్లా కార్యదర్శి సలాం మౌలానా, అవాజ్ కమిటీ అధ్యక్షులు బాబుల్లా ,ఎంహెచ్పిఎస్  జిల్లా అధ్యక్షుడు  యూనిస్, మైనారిటీ రైట్స్ ఫోరమ్ అధ్యక్షులు షేక్ మహబూబ్ బాషా,  ఇన్సాఫ్ కమిటీ నాయకులు షరీఫ్ లు  మాట్లాడుతూ

 గోడ పత్రికలను విడుదల చేస్తున్న నేతలు

అబ్దుల్ సలాంకు న్యాయం జరగాలంటే సీబీఐ విచారణ జరిపించాలని, సిఐ క్రైంపార్టీ పోలీసులు గంగాధర్,  అతని టీంను రిమాండ్ చేసి విధుల నుండి శాశ్వతంగా తొలగించాలని, వారి ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ వారితో విచారణ జరిపించాలని, దొంగతనం జరిగిన నాటి నుండి సలాం నిమిషాంబ బంగారు అంగడి యజమాని కుమారుడు కుటుంబ సభ్యులు, గంగిశెట్టి శ్రీధర్, పోలీసులు, ప్రజా ప్రతినిధులు వీరందరి కాల్ డేటా బయటికి తీయాలని డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం పట్టణంలోని స్థానిక సంజీవ్ నగర్ గెట్ నందు రాస్తారోకో కార్యక్రమం చేపడుతున్నామని ప్రజలు అందరు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఆవాజ్ కమిటీ నేత మస్తాన్ వలి

 

జానోజాగో సంఘం నేత సయ్యద్ మహబూబ్ బాషా

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: