జిల్లావ్యాప్తంగా సాంఘిక సంక్షేమ హాస్టల్ తెరవాలి

అద్దె (ప్రైవేట్)వసతిగృహాలు పై చర్యలు తీసుకోవాలి

ప్రగతిశీల యువజన సంఘం జిల్లా నాయకులు నవీన్ 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ హాస్టల్ లను తెరవాలని  ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్) డిమాండ్ చేసింది. గురువారంనాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రగతిశీల యువజన సంఘం ((పీవైఎల్) జిల్లా నాయకులు నవీన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కరోనా  విజృంభించిన మొదల విద్యాసంస్థలు అన్ని కూడా మూసుకుపోవడం జరిగింది అన్నారు.. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో విద్యా సంస్థలను ఓపెన్ చేశారన్నారు.. విద్యార్థులు చాలా మంది సుదూర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడే హాస్టల్లో ఉంటూ విద్య అభ్యసిస్తూ ఉండేవారు ఇప్పుడు విద్యాసంస్థల ఓపెన్ అయినా కూడా హాస్టల్ తీర్చుకోలేని పరిస్థితి ఈ జిల్లాలో ఏర్పడింది..విద్యార్థులు బయట ప్రైవేట్ హాస్టల్ లోనో తెలిసినా బంధువుల ఇళ్ళలో ఉంటూ విద్యను అభ్యసిస్తున్నారు.. దీన్ని ఆసరాగా తీసుకుని ప్రైవేట్ హాస్టల్ వాళ్ళు ఒక రోజుకి ఒక విద్యార్థి నుండి 150 నుండి 200 రూపాయలు వసూలు చేస్తున్నారు..అసలే కరోన వల్ల పనులేక ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడిన విషయం అందరికి తెలిసిందే. విద్యార్థులు ప్రైవేట్ హాస్టల్ లో డబ్బులు చెలించలేక చదువుకు దూరమవుతున్నారు అన్నారు.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జిల్లాలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ హాస్టల్ తక్షణమే తెరిచి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని తెలియజేసారు..హాస్టల్ తెరవడం వల్ల విద్యార్థులుకు న్యాయం చేసిన వారు అవుతారు అన్నారు.. హాస్టల్స్ ఓపెన్ చేయకపోతే జిల్లా వ్యాప్తంగా హాస్టల్ విద్యార్థులుతో కలిసి పెద్ద ఎత్తున ప్రగతిశీల యువజన సంఘం ((పీవైఎల్)   ఆధ్వర్యంలో ఉద్యమాలకు చేస్తాం అని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.... ఈ కార్యక్రమంలో ప్రగతిశీల యువజన సంఘం డివిజన్ నాయకులు రఫీ, అఖిల్,రవి, తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: