హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లపై ఆకస్మిక తనిఖీలు చేపట్టాలి

ఆర్.వై.యూ రాష్ట్ర అధ్యక్షులు రామినేని రాజునాయుడు


(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల పట్టణంలోని కొన్ని హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్, రెస్టారెంట్ల యాజమాన్యాలు డబ్బు సంపాధనే ధ్యేయంగా ముందుకెళ్తున్నారనీ,  హోటళ్లు, రెస్టారెంట్లలో కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారని రాయలసీమ యూత్ యూనియన్ (ఆర్.వై.యూ) రాష్ట్ర అధ్యక్షులు రామినేని రాజునాయుడు అన్నారు. వెంటనే నంద్యాలలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను స్ధానిక రెవెన్యూ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని రాజునాయుడు విజ్షప్తి చేశారు. ఆదివారం నాడు స్ధానిక పాత్రికేయులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆర్.వై.యూ రాష్ట్రృ అధ్యక్షులు రామినేని రాజునాయుడు మాట్లాడుతూ హోటళ్లలో , రెస్టారెంట్లలో సరైన శుభ్రత ప్రమాణాలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనీ , చికెన్ , మటన్ లాంటి మాంసాహార పదార్ధాల్ని ఫ్రిజ్ లో నిల్వఉంచి వాటిని రెండు మూడు రోజుల వరకు వండి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ముఖ్యంగా వంట నూనె కూడా ఒక పదార్ధానికి వాడి అదెే నూనెను రకరకాల పదార్ధాలకు వాడి ప్రజల ఆరోగ్యాలను , ఆయుస్సును తగ్గిస్తున్నారని , కుల్లిపోయిన కూరగాయలను మరియు నకిలీ చికెన్ మసాలాలు నకిలీ కారంపొడి , డాల్డా ఇలా అనేక రకాలైన నాసిరకం పదార్ధాలు వాడుతున్నారని వాపోయారు. వంట రూములను కూడా శుభ్రపరచకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారనీ , బియ్యం కూడా నాణ్యత లేని బియ్యం వండుతూ అనారోగ్యాల పాలుచేస్తున్నారనీ , భోజనాల రేట్లు మాంసాహారాల రేట్లతో అధిక ధరలతో విక్రయిస్తున్నారనీ , నంద్యాలకు నిత్యం వందల గ్రామాల నుండి ప్రజలు వస్తుంటారనీ ఇటువంటి హోటళ్లను గుర్తించామనీ , తక్షణమే వాటిపై అధికారులు , ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: