సమస్యల పరిష్కారం కోసం కదిలిరండి

కేంద్ర లెబర్ కమిషనర్ కు వినతిపత్రం

ఐజేయూ, టీయూడబ్ల్యూజే పిలుపు

(జానోజాగో వెబ్ న్యూస్-తెలంగాణ ప్రతినిధి)

సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రం ఇచ్చేందుకు కేంద్ర లేబర్ కమిషన్ కార్యాలయానికి జర్నలిస్టులు తరలిరావాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ కోరారు. ఈ మేరకు వారు ఓ ప్రకటన విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా అపరిష్కృతంగా ఉన్న మన డిమాండ్ల పరిష్కారం కోరుతూ, నవంబర్ 16 "జాతీయ మీడియా డే" ను పురస్కరించుకొని సోమవారం  ఉదయం 10.30 గం.లకు నల్లకుంట, డిడి కాలనీలో గల కేంద్ర లేబర్ కమిషనర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని  సమర్పించ నున్నాము. ఐజేయూ, టీయూడబ్ల్యూజే బాధ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మీరు తప్పక హాజరై విజయవంతం చేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాం.అని జర్నలిస్టులకు టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ కోరారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: