విద్యకోసం ఎంత ఖర్చుకైనా ప్రభుత్వం సిధం
ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
నంద్యాల పట్టణంలోని ఐదవ వార్డు నబి నగర్ లో ఉన్న ఉర్దూ మదర్సా లో వైయస్సార్ ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన జగనన్న విద్య కనుకను ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇన్ని సంవత్సరాలుగా ఎంతోమంది ముఖ్యమంత్రులు పని చేశారు గాని ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్యపైన ప్రత్యేక శ్రద్ధ ఉంచడం జరిగిందన్నారు. విద్యార్థుల తరపున జగనన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్న ఉన్నారు అలాగే విద్య కోసం ఎంత డబ్బు ఖర్చు చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని, నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సరికొత్త హంగులతో రూపొందిస్తున్నామన్నారు.
అలాగే అమ్మ ఒడి కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలలకే కాకుండా ప్రైవేట్ పాఠశాలలకు మదరసాల కూడా అందిస్తున్నామన్నారు వైఎస్సార్ ప్రభుత్వం కులం మతం వర్గం చూడమని నిజమేనా లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందజేస్తామన్నారు. కొంత మంది రాజకీయ నాయకులు కులాల మధ్య చిచ్చు పెట్టి విడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు వాటన్నిటినీ నమ్మకుండా అందరూ అన్నదమ్ముల వలె ప్రశాంతంగా ఉండాలని తెలియజేశారు. నంద్యాల పట్టణంలో జూనియర్ కాలేజీ రావడం జరిగిందని, వాటికోసం పట్టణంలోని టేక్కే మున్సిపల్ పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలకు పంపి వారికి మంచి విద్యను భవిష్యత్తు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ డాక్టర్ నౌమాన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇషాక్ భాష, మాజీ కౌన్సిలర్ చాంద్ బి, ఐదవ వార్డు వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ ఆరిఫ్ నాయక్, మాజీ కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్, దేశం సుధాకర్ రెడ్డి, మాదరస ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు
Post A Comment:
0 comments: