పేద వధువుకు బీరువా, పవిత్ర ఖురాన్ విరాళం

జమాతే ఉలమా హింద్, ఎంహెచ్ పీఎస్ నేతల వితరణ

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

జమాతే ఉలమా హింద్ ఖలీల్ మౌలానా ఆధ్వర్యంలో ఎంహెచ్ పీఎస్ నేత యూనుస్ సారథ్య లో  పేద వధువుకు బీరువా, పవిత్ర ఖురాన్ విరాళంగా అందజేసినట్లు నంద్యాల డివిజన్ జమాతే ఉలేమా హింద్  అధ్యక్షులు మౌలానా ఖలీల్ అహ్మద్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నందమూరి నగర్ కు  చెందిన పేద వధువు పెళ్లికి జమాతే ఉలేమా హింద్ ఆధ్వర్యంలో బీరువా, పవిత్ర ఖురాన్ విరాళంగా అందజేశామన్నారు  ములనుపేటలోని తన ఆఫీస్ నందు శనివారం వధువు తల్లికి బీరువా, పవిత్ర ఖురాన్ ను  అందజేశారు.
ఈ కార్యక్రమంలో  ముస్లిం హక్కుల పోరాట సమితి నంద్యాల జిల్లాఅధ్యక్షులు యూనుస్ మాట్లాడుతూ ఎవరైనా పేద వధూవరులు ఉంటే తమ దగ్గరకు వచ్చి ఒక్క నెల ముందు మాకు చెబితే మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అబుల్ హాది, చౌక్ మసీద్ హాఫిజ్ ఈషాక్  సాబ్, ఎంహెచ్ పీఎస్ నాయకులు, నూర్బాషా, అబ్బాస్ అలీ, ఎస్.ఎం.డీ. కైఫ్  పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: