రక్తదానం చేస్తాం...కుల, మతాల అడ్డు గోడల్ని కూలుద్దాం
ముస్లిం నగారా పిలుపు
(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపూర్ ప్రతినిధి)
అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గుడిబండ మండలం కేకాతి కి చెందిన విషాలాక్షమ్మ రక్తహీనతతో మరియు చరణ్య తలసీమియా తో ఇద్దరికీ బీ పాజిటివ్ రక్తం కోసం ఇబ్బంది పడుతుంటే ముస్లిం నగారా ఆదుకొంది. బాధితులకు రక్తం అవసరముందని ముస్లిం నగారా అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ కు ఈ విషయం తెలిసింది. ఆయన తన అనుబంధ సంస్థ టిప్పు సుల్తాన్ మానవతా సంస్థ అధ్యక్షుడు షేక్ షబ్బీర్ తో సంప్రదించి టిప్పు సుల్తాన్ మానవతా రక్తదానం సభ్యులు తర్కారీ నస్రు.అల్లాబకష్ లు రక్తదానం చేశారు ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ
1000 మంది టిప్పు సుల్తాన్ మానవతా రక్తదానం సభ్యులు అనునిత్యం అత్యవసర సమయాల్లో రక్తదానo చేస్తున్నామని కుల మతాలకు అతీతంగా వర్గ వర్ణాలకు అతీతంగా రక్తదానo చేస్తాం కుల మతాల అడ్డు గోడల్ని కూలుద్దాం రక్త దానం చేస్తాం ప్రాణదాతలుగా మారుదాం అని ఆచరణాత్మక ప్రయత్నం చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ యూనియన్ అధ్యక్షుడు సోమశేఖర్ రెడ్డి గారు .బాబు.షేక్ షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: