నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

సిపిఐ డిమాండ్

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల డివిజన్లో పలు మండలాలలో గత మూడు రోజులుగా నిషా తుఫాన్ వల్ల వచ్చిన వర్షాలతో వేల ఎకరాలు వరి ధాన్యం ఇతర పంటలు మునిగి నష్టపోవడం జరిగిందని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వము నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, పట్టణ కార్యదర్శి ప్రసాద్, ఏఐటీయూసీ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసులు,  బాల వెంకట్. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యదర్శి సోమన్న, ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి సుబ్బరాయుడు, సిపిఐ  నాయకులు మహమ్మద్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం సీపీఐ కార్యాలయంలో మాట్లాడుతూ వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: