నేషనల్ డిగ్రీ కళాశాలలో ఐసిఐసిఐ

బ్యాంక్ నందు సీనియర్ ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రాంగణ ఎంపికలు

నేషనల్ విద్యాసంస్థల అధినేత డా.ఇంతియాజ్ అహ్మద్

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నేషనల్ డిగ్రీ కళాశాలలో ఐసిఐసిఐ బ్యాంక్ నందు సీనియర్ ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రాంగణ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు నేషనల్ విద్యాసంస్థల అధినేత డా. యస్.ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 28వ తేదీ శనివారం నేషనల్ డిగ్రీ కళాశాలలో ఐ నిట్,  ఐఎఫ్బిఐ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రాంగణ ఎంపికలు నిర్వహిస్తున్నామన్నారు. డిసెంబర్ 1, 1995 తర్వాత జన్మించి, ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 50% కంటే ఎక్కువ మార్కులు కలిగిన వారెవరైనా ఈ ఎంపికకు హాజరు కావొచ్చని తెలిపారు. వ్రాత పరీక్ష, మౌఖిక పరీక్ష లను నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఎంపికైన వారికి 45 రోజుల శిక్షణ తర్వాత తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఐసీఐసీఐ బాంక్ శాఖలయందు సీనియర్ ఆఫీసర్ ఉద్యోగాలలో నియమించడం జరుగుతోందన్నారు. ఎంపికైన వారికి సంవత్సరానికి 2.2 నుండి 2.60 లక్షల లోపు వేతనంతో పాటు ఇతర అలవెన్సులు ఇవ్వటం జరుగుతుందని, 25 సంవత్సరాల లోపు వయస్సు కలిగి పైన తెలిపిన విద్యార్హతలు కలిగిన ఆసక్తి గల అభ్యర్థులు 28 వ తేదీ ఉదయం 9 గంటలకు శ్రీనివాస నగర్ లో గల నేషనల్ డిగ్రీ కళాశాల యందు తమ ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు 9440293108 ను సంప్రదించాలని ఆయన తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: