ఆదుకోండి

ప్రభుత్వ సాయం కోసం రైతన్న ఆశలు

నివర్ తుఫానుతో పెద్ద ఎత్తున్న పంట నష్టం

(జానోజాగో వెబ్ న్యూస్-తర్లు పాడు ప్రతినిధి)

ప్రకాశం జిల్లా  తర్లుపాడు నందు  గత రెండు రోజులుగా   కురుస్తున్న   వందల ఎకరాల లో   పంటలు నీట మునిగిపోయాయి.   మండలంలో ప్రధానంగా  మిర్చి, పత్తి, వినుము, పప్పు శనగ, వరి, మరియు కంది పంటలు   నీటిలో మునిగి ఉన్నాయి. రైతులు  ఇప్పటికే    లబోదిబో అంటున్నారు.   అధికారులు పంట నష్టం అంచనా వేసే పనిలో ఉన్నారు. 
 లక్షల్లో పెట్టుబడి పెట్టి    చేతికొచ్చే సమయంలో   అకాల వర్షంతో పంట నష్టం. అయ్యే అవకాశాలు  ఉన్నాయని, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో ప్రధానంగా పప్పు శనగ, 200 వందల ఎకరాలు, మిరప200 వందల ఎకరాలు,  పత్తి100 ఎకరాలు మినుము, వరి గా50 ఎకరాలు, కంది50 ఎకరాలలో నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ అధికారులు. ఒక అంచనాకు వచ్చారు. ఈతుఫాను  ఎక్కువ రోజులు యిలాగే సాగినట్లు అయితే పంట నష్టం భారీగా పెరిగే అవకాశం కూడా ఉందని, వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి పంట నష్టం అంచనావేసి రైతులను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: