సాహితి చైతన్య సారధి 'దాశరథి'

అభ్యుదయోద్యమ రథసారధి 'దాశరథి"

మాట్లాడుతున్న సోసైటీ అధ్యక్షులు ఉస్మాన్ బాష 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

ఆదునిక కవుల్లో పద్యాన్ని అభినివేశంతో వరవళ్లు తొక్కించిన చైతన్యసారథి దాశరథి కృష్ణమాచార్యులు అని వలువురు సాహితీవేత్తలు కొనియాడారు. నంద్యాల పట్టణంలోని శ్రీ రామకృష్ణ హైస్కూల్ లో ఆదివారం దాశరథి జీవితం- కవిత్వం అనే అంశంపై సెంట్రల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్, మైనూర్ వారి సౌజన్యంతో మదీనా ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ, నంద్యాల వారి ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించబడింది.

అతిథులను సన్మానం చేస్తున్న దృశ్యం 

సొసైటీ అధ్యక్షులు ఉస్మాన్ బాష మాట్లాడుతూ మైనూర్ నందలి భారతీయ భాషల నంస్థ నహకారంతో నదన్సు నిర్వహిస్తున్నామని, తెలుగు కవులు వారి సాహితీసేవలపై నదన్సు నిర్వహించడం జరిగిందని, తెలుగుకవులు-వారి సాహితీ సేవలు నేటి తరానికి అందజేయాలన్నది నదన్సు ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ప్రధాన వక్తలు తెలుగు వండితులు అన్నెం శ్రీనివాసరెడ్డి, మహబూబ్ బాష, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శేషఫణిలు పాల్గొని దాశరధి సాహిత్యం పై ప్రసంగించారు. దేశ చరిత్రను ఇతివృత్తంగా తీసుకొని తెలుగు ప్రజల్లో చైతన్యాన్ని వ్రదీవ్తం చేసిన మహాకవి దాశరథి అని గేయాన్ని, గీతాన్ని లలితంగా మలిచి ఆధునిక కవిత్వానికి దాశరథి విశిష్టతను చేకూర్చారని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ ఉపాధ్యక్షులు గని, ఉషోదయ వెంకటేశ్వర్లు, భారత్ అకాడమీ డైరెక్టర్ గోపీకృష్ణ, అకాడమీ విద్యార్థులు పాల్గొన్నారు ముఖ్య అతిథులను నిర్వాహకులు ఉస్మాన్ బాష ఆధ్వర్యంలో మనంగా సత్కరించారు.


  పాల్గొన్న విద్యార్థులు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: