వింజమూరి ఇంట కళ్యాణం.. కమనీయం 

నటుడు, నిర్మాత వింజమూరి మధు కుమార్తె నిఖిల వివాహం

వింజమూరి మధు కుమార్తె నిఖిల వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ

(జానోజాగో వెబ్ న్యూస్-తెలంగాణ బ్యూరో)

నటుడు, నిర్మాత, తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నాయకులు వింజమూరి మధు కుమార్తె డాక్టర్ నిఖిల,  డాక్టర్ రాఘవేందర్ రావుల వివాహా వేడుక గురువారం  హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. కీ.శే. శ్రీమతి & శ్రీ వింజమూరి అనసూయ (చక్రమ్మ), వెంకటయ్య గార్ల దివ్య ఆశీస్సులతో స్వస్తిశ్రీ చాంద్రమాన శార్వరి నామ సంవత్సర కార్తీక శుద్ధ ద్వాదశి గురువారం 26.11.2020 ఉదయం 8 గంటల 22 నిమిషాలకు రేవతి నక్షత్రయుక్త ధనుర్ లగ్న పుష్కరాంశ సుముహూర్తమున చి. వింజమూరి మధు- సత్యకళ దంపతుల ఏకైక పుత్రిక చి.ల.సౌ. డాక్టర్ నిఖిల వివాహము శ్రీమతి & శ్రీ బాగాయత్ మాధవి-శ్రీనివాసరావు, బాలాపూర్ గార్ల ఏకైక పుత్రుడు చి. డాక్టర్ రాఘవేందర్ రావుతో జరిగిన ఈ వివాహ మహోత్సవానికి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ, సీనియర్ జర్నలిస్ట్, నంది అవార్డు గ్రహీత ఎం. డి అబ్దుల్ , దర్శకు భరత్ పారేపల్లి  హాజరై  కల్యాణ మహోత్సవాన్ని తిలకించి నూతన దంపతులను ఆశీర్వదించారు. 
ఈ వివాహ వేడుక కన్యాదాత స్వగృహము హైదరాబాద్ లోని  పద్మాకాలనీ, నల్లకుంటలో  కన్నుల పండువగా జరిగింది. దైవజ్ఞులైన  భాగవోత్తములచే నిశ్చయించబడిన ఈ వివాహ మహోత్సవానికి బంధు మిత్రులు సపరివార సమేతంగా విచ్చేసి కల్యాణ మహోత్సవమును తిలకించి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహ మహోత్సవానికి భవ దాగమానాభిలాషులుగా  శ్రీమతి & శ్రీ వింజమూరి శోభ - వెంకటేశ్వర్లు ,  శ్రీమతి & శ్రీ వింజమూరి పద్మ- రఘు లు వ్యవహరించారు.  శ్రీమతి & శ్రీ తమటం శ్రీదేవి-డాక్టర్ రాము,  వింజమూరి ఫ్యామిలీ మరియు బంధుమిత్రుల అభినందనలతో అంగరంగ వైభవంగా కళ్యాణం.. కమనీయంగా జరిగింది

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: