కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలి

వామపక్ష ట్రేడ్ యూనియన్లు డిమాండ్

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

కార్మిక వ్యతిరేక కోడ్లు, రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలని దేశవ్యాప్తంగా వామపక్ష కార్మిక సంఘాలు ఏఐటియుసి, సిఐటియు,ఐఎఫ్టియు 9 దేశ వ్యాప్తంగా కార్మిక  సంఘాలు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పిలుపులో భాగంగా గురువారం టెకే మార్కెట్ యార్డులో సభ నిర్వహించడం జరిగింది, అనంతరం టేక్క మార్కెట్ యార్డ్ నుండి భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభకు అధ్యక్షులుగా ఏఐటియుసి అధ్యక్షులు శ్రీనివాసులు, సిఐటియు పట్టణ అధ్యక్షులు డి. లక్ష్మణ్ అధ్యక్ష అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా సిఐటియు  ప్రధాన కార్యదర్శి నాగరాజు,  ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ


 

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని, ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పి ఎందుకు ప్రయత్నిస్తుందని  స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండా వారితో వెట్టిచాకిరి చేయిస్తుందని అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర వేతన చట్టం చేయాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం అమలు చేసి  వారిని రెగ్యులర్ చేయాలని అంగన్వాడి ,ఆశ ,మధ్యాహ్న, భోజన పథకం, మున్సిపాలిటీ లలో పనిచేసే కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని బిల్డింగ్ కార్మికులను ఆదుకోవాలని, విద్యుత్ ప్రైవేటీకరణ ను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు అదేవిధంగా కార్మికుల హక్కులను కాపాడాలని భవిష్యత్తులో బిజెపి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మికులంతా ఐక్య ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అనంతరం సిఐటియు జిల్లా నాయకులు తోట ముద్దులు, సిఐటియు పట్టణ కార్యదర్శి కె.ఎం. గౌస్, ఏఐటియుసి నియోజకవర్గం కార్యదర్శి  వెన్న బాల వెంకట్, ఐఎఫ్టియు కార్యదర్శి చౌడప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం గెలిపిస్తే కార్మికుల జీవితాలు మారుతాయని అందరూ ఓట్లేసి గెలిపించిన తరువాత ముఖ్యమంత్రి జగన్ కార్మికులను ఉద్యోగులను నట్టేట్లో ముంచారని భవన నిర్మాణ కార్మికులకు పనులే కాకుండా చేశారని  వారి  సంక్షేమ నిధి నుండి ప్రతి ఒక్కరికి పదివేలరూపాయలు ఇవ్వాలని

 

అలాగే రైతులకు నష్టం కలిగించే విద్యుత్ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని, అంగన్వాడి, ఆశ ,మధ్యాహ్న భోజన పథకం ప్రభుత్వ పథకాల్లో పనిచేసే కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సి ఐ టి యు ఉపాధ్యక్షులు వెంకట లింగం, శంకరయ్య ,అన్నమ్మ ,తిరుపతయ్య అమృత్ బేగం, ఏ ఐ టి యు సి నాయకులు లక్ష్మయ్య ,రవికుమార్ ఈశ్వరమ్మ, నాగేశ్వరరావు ,రంగా రెడ్డి తో పాటు పెద్ద ఎత్తున అంగన్వాడి మున్సిపల్ కార్మికులు ఆరె ఆర్ ఎస్ ఎస్ కార్మికులు, ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులు, సహకార ఉద్యోగులు ,ఆటో, హమాలి ఆశ ఐకెపి కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: