నివర్ తుఫాన్ తాకిడికి 40 హెక్టర్లలో వరి పంట నేలపాలు 

పరిశీలించిన అధికార్లు

ఆందోళనలో అన్నధాతలు

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల మండలం భీమవరం గ్రామంలో 40 హెక్టర్లలో వరి పంట నివర్ తుఫాన్ తాకిడికి నేలకొరగడంతో రైతన్నలు లబోదిబో మంటున్నారు. 300 ఎకరాల్లో మినుముపంటను రైతన్నలు వేశారు. పూత దశలో ఉన్న పంట పూలు రాలిపోవడంతో రైతులు నష్టపోయారు. శుక్రవారం వ్యవసాయాధికారిని కావ్య గ్రామంలోని పంటపొలాలను పరిశీలించారు. పంట నష్టాన్ని అంచనా వేసి అధికారుల దృష్టికి తీసుకొని వెళతామని పేర్కొన్నారు. ఏడాదిలో కరోనా, మూడుసార్లు వాతావరణ మార్పుల్లో కల్గిన తుఫానుల వల్ల రైతన్నలు నష్టపోతున్నారు.
నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని భీమవరం రైతులు వేడుకుంటున్నారు. దేశంలో అందరికడుపు నింపుతున్న రైతన్నలు ఏళ్లుగా మట్టిని నమ్ముకొని లాభ నష్టాలు చూడకుండా, మనోధైర్యంతో నష్టాలను భరిస్తూ పంటలు వేస్తున్నారు. గిట్టుబాటు ధరలు లేకపోయినా, అకాల వర్షాలతో నష్టపోతున్నా అప్పుల భారం దిగమింగుకొని రైతులు పంటలు పండిస్తున్నారు. ప్రభుత్వాలు రైతే వెన్నెముక అని చెప్పే నాయకులు రైతులకు నష్టపరిహారం ఇచ్చేదిశగా చూడాలని కోరుతున్నారు. నంద్యాల నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ను పరిశీలిస్తున్న అధికారులు నంద్యాల మండలం భీమవరం గ్రామంలో 40 హెక్టర్లలో వరి పంట నివర్ తుఫాన్ తాకిడికి నేలకొరగడంతో రైతన్నలు లబోదిబో మంటున్నారు. 300 ఎకరాల్లో మినుముపంటను రైతన్నలు వేశారు. పూత దశలో ఉన్న పంట పూలు రాలిపోవడంతో రైతులు నష్టపోయారు.
శుక్రవారం వ్యవసాయాధికారిని కావ్య గ్రామంలోని పంటపొలాలను పరిశీలించారు. పంట నష్టాన్ని అంచనా వేసి అధికారుల దృష్టికి తీసుకొని వెళతామని పేర్కొన్నారు. ఏడాదిలో కరోనా, మూడుసార్లు వాతావరణ మార్పుల్లో కల్గిన తుఫానుల వల్ల రైతన్నలు నష్టపోతున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని భీమవరం రైతులు వేడుకుంటున్నారు. దేశంలో అందరికడుపు నింపుతున్న రైతన్నలు ఏళ్లుగా మట్టిని నమ్ముకొని లాభ నష్టాలు చూడకుండా, మనోధైర్యంతో నష్టాలను భరిస్తూ పంటలు వేస్తున్నారు. గిట్టుబాటు ధరలు లేకపోయినా, అకాల వర్షాలతో నష్టపోతున్నా అప్పుల భారం దిగమింగుకొని రైతులు పంటలు పండిస్తున్నారు. ప్రభుత్వాలు రైతే వెన్నెముక అని చెప్పే నాయకులు రైతులకు నష్టపరిహారం ఇచ్చేదిశగా చూడాలని కోరుతున్నారు. నంద్యాల నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: