నవంబర్ 26 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను...

జయప్రదం చెయ్యాలని ఎఐటియుసి బైక్ ర్యాలీ

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియుల ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ బైక్ ర్యాలీని సిఐటియు జిల్లా కార్యదర్శి నాగరాజు, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, ఉద్యోగ, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా 15 జాతీయ కార్మిక సంఘాలు రాష్ట్రంలో 500 స్వతంత్ర ఫెడరేషన్ లు మొత్తం కలిపి నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని, ఈ సమ్మె మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ సరళీకరణ ఆర్థిక విధానాలను నిరసిస్తూ చేస్తున్న సమ్మె అని ఎన్నో సంవత్సరాల పోరాట ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలను నాలుగు కోడులుగా విభజించి కార్మికులకు ఉద్యోగులకు హక్కులు లేకుండా చేసేందుకు ఈ ప్రభుత్వాలు ఉన్నాయని దీనికి వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మెకు నంద్యాల పట్టణంలోని ఉద్యోగులు కార్మికులు ప్రజలు రైతులు పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ స్కూటర్ ర్యాలీలో సిఐటియు జిల్లా నాయకులు తోట మద్దులు, ఏఐటీయూసీ నంద్యాల నియోజకవర్గం కార్యదర్శి బాల వెంకట్, సిఐటియు అధ్యక్ష,  కార్యదర్శులు లక్ష్మణ్, గౌస్, ఐఎఫ్టియు కార్యదర్శి చౌడప్ప, సిఐటియు నాయకులు వెంకట లింగం, సుబ్బారావు,  ఏఐటియుసి నాయకులు, మహమ్మద్, లక్ష్మయ్య, రాజేంద్ర, ఐఎఫ్టియు నాయకులు భాష తో పాటు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: