వ్యవసాయ చట్టాల రద్దుకై..విద్యుత్‌ సవరణ బిల్లు ఉపసంహరణకై

నవంబర్‌ 26న జరుగు గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయండి

(జానోజాగో వెబ్ న్యూస్-తెలంగాణ ప్రతినిధి)

మోడీ ప్రభుత్వం తీసుకుని వచ్చిన 3 కార్పొరేట్‌ అనుకూల వ్యవసాయ చట్టాలు, విద్యుత్‌ సవరణ బిల్లును రద్దు చేయాలనే డిమాండ్‌తో నవంబర్‌ 26న గ్రామీణ భారత్‌ బంద్‌, 27న కేంద్ర ప్రభుత్వ కార్యాలయల ఎదుట నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని హైదరాబాద్‌ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఆర్టీసి క్రాస్‌రోడ్‌లోని రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల రాష్ట్ర కార్యాలయంలో ఈ రోజు పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐఎడబ్లూయు ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌, ఏఐకెఎస్‌ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పి.జంగారెడ్డి, టి.సాగర్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు నంద్యాల నర్సింహ్మారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు, బి.ప్రసాద్‌, ఆర్‌. వెంకట్రాములు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు, వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున పోరాటంలోకి వస్తున్నారని తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే విధంగా పోరాటాలు నిర్వహించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల నిరసనను పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తున్నదని అన్నారు. కేంద్ర వ్యవసాయ చట్టాలలో ''కనీస మద్దతు ధరల గురించి'' ఒక్క వాఖ్యం కూడా లేదన్నారు. కనీస మద్దతు ధరలను ఎత్తివేయరన్న గ్యారెంటీ లేదు. గుత్తా వ్యాపార సంస్థలతో చిన్న రైతులు వ్యాపారం చేసే అవకాశాలు లేవు. మధ్య దళారీలు అనివార్యంగా కొనుగోలు చేసి ప్రాసెసింగ్‌ యూనిట్లకు అమ్ముతారు. మధ్య దళారీ దోపిడి కొనసాగుతుంది. కాంట్రాక్టు కొనుగోలు దారుడు వ్యవసాయ ఉపకరణాలను అధిక ధరలకు రైతుకు అమ్ముతాడు. ఇప్పటి వరకు ఉపకరణాలు అమ్మే కార్పోరేట్‌, గుత్తా సంస్థలు నాణ్యతలేని విత్తనాలను, కల్తీ ఎరువులను సరఫరా చేసి రైతులకు కోట్ల రూపాయల నష్టాన్ని కలిగించారు. ఈ చట్టాలలో రైతులకు ప్రకృతి వైపరీత్యాల పరిహారం చెల్లించే అంశం ఒక్కచోట కూడా లేదు. రైతులు పంట నష్టం పొందినప్పుడు ప్రభుత్వం సహాయం చేస్తుందని, కార్పోరేట్‌ సంస్థలు కాంట్రాక్టు కుదుర్చుకున్న రేటుకు మార్కెట్‌లో ధరలు తగ్గితే నాణ్యత ప్రమాణాల పేరుతో రైతుల నుండి కొనుగోలు చేయకపోవడమే ధరలు తగ్గించడం చేస్తారు. ఒకవేళ కాంట్రాక్టు ధర కంటే మార్కెట్‌లో ధర ఎక్కువగా ఉంటే ఆ ధర చెల్లించకుండా మార్కెట్‌ ధరలను అమల పరుస్తారు. రైతులను బహిరంగ మార్కెట్‌లో అమ్ముకోకుండా కట్టడి చేస్తారు. ఆశాస్త్రీయంగా కనీస మద్దతు ధరలను నిర్ణయించారు. వ్యాపారులకు లాభం కలిగించారు. వ్యవసాయ ఉపకరణాలు, కుటుంబ శ్రమను మాత్రమే దేశ సగటు రేటుగా గుర్తించారు. కానీ వ్యవసాయ భూములపై పెట్టిన స్థిర పెట్టుబడిపై వడ్డీగానీ అరుగుదల గానీ, కౌలు గానీ గుర్తించలేదు. గత ఐదు సంవత్సరాలలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయే తప్ప తగ్గలేదు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని పథకం గత ఆదాయాలపై ప్రస్తుత ఆదాయాలు తగ్గుముఖం చూపిస్తున్నాయి. కాంట్రాక్టు ధరల బిల్లులో ఏపియంసి చట్టం నిబంధనలో ఉండవని స్పష్టం చేశారు. స్వేచ్ఛాయుత మార్కెట్‌ పేరుతో రైతులను కార్పోరేట్‌ సంస్థలకు బలి పశువులుగా చేశారు. ఇప్పటికే విద్యా, వైద్య రంగాలలో కార్పోరేట్‌ సంస్థలు సాగిస్తున్న అధిక లాభాల దుర్నీతి ప్రత్యక్షంగా మన ముందు ఉంది. ఈ బిల్లు అమలు ప్రారంభమైన కొద్ది రోజులలో ఏపియంసిలు మూత పడతాయి. ఇంత వరకు ఏపియంసిలలోని యంఎస్‌పి ధరలకన్న బహిరంగ మార్కెట్‌లో తక్కువ ధరలే అమలు జరిగాయి. యంఎస్‌పి నిర్ణయం అపితే కార్పోరేట్ల ఇష్ట ప్రకారం ధరలు నిర్ణయించబడతాయి. పెద్ద కంపెనీలతో జరిగిన ఒప్పందాలకు విత్తన రైతులు, చెరుకు, పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అని వారు పేర్కొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: