ఎకరాకు 20 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి
కాంగ్రెస్ నేత జై లక్ష్మీ నరసింహ యాదవ్ డిమాండ్
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
నివర్ తుఫాన్ తాకిడికి దెబ్బతిన్న రైతన్నలకు ఎకరాకు 20 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని కాంగ్రెస్ నంద్యాల పార్లమెంటు జిల్లా అధ్యక్షులు జై లక్ష్మీ నరసింహ యాదవ్ డిమాండ్ చేశారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో బాచుపల్లి ఆలమూరు నరసాపురం గ్రామాలలో పంట పొలాలను లక్ష్మీ నరసింహ యాదవ్ పరిశీలించారు. శుక్రవారం తుపాను వల్ల నష్టపోయిన రైతుల పొలాలను పరిశీలించిన అనంతరం కాంగ్రెస్ నంద్యాల పార్లమెంటు జిల్లా అధ్యక్షులు జై లక్ష్మీ నరసింహ యాదవ్ మాట్లాడుతూ నీవర్ తుఫాన్ తాకిడికి దెబ్బతిన్న రైతులు లబోదిబోమంటున్నారు. నంద్యాల పార్లమెంట్ లో 30000 ఎకరాల్లో వరి పంట చేతికొచ్చే సమయంలో మినుముపంట ను రైతన్నలు వేశారు. పూత దశలో ఉన్న పంట పూలు రాలిపోవడంతో రైతులు నష్టపోయారు.
పంట నష్టాన్ని అంచనా వేసి అధికారుల దృష్టికి తీసుకొని వెళతామని పేర్కొన్నారు. ఏడాదిలో కరోనా, మూడుసార్లు వాతావరణ మార్పుల్లో కల్గిన తుఫానుల వల్ల రైతన్నలు నష్టపోతున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. దేశంలో అందరికడుపు నింపుతున్న రైతన్నలు ఏళ్లుగా మట్టిని నమ్ముకొని లాభ, నష్టాలు చూడకుండా, మనోధైర్యంతో నష్టాలను భరిస్తూ పంటలు వేస్తున్నారు.గిట్టుబాటు ధరలు లేకపోయినా, అకాల వర్షాలతో నష్టపోతున్న,అప్పుల భారం దిగమింగుకొని రైతులు పంటలు పండిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతే వెన్నెముక అని చెప్పే రైతుల కు నష్టపరిహారం ఇచ్చేదిశగా చూడాలన్నారు.
నంద్యాల నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో నష్టపోయిన రైతులను ఎకరాకు 20 వేల చొప్పున ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్నారు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఐదు వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు కేటాయించే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు నాగభూషణం, మోహన్, కాంగ్రెస్ యువ నాయకులు మన్సూర్, సురేంద్ర, నరేష్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment:
0 comments: