ఏపీకి వర్ష గండాలు...?

కాచుకొని కూర్చున్నమరిన్ని తుఫాన్లు

ఏపీపై...వర్షాల వరుస దాడులు...?

మొన్నటి వరకు తుఫాన్లు..ఇపుడు...నివర్ 

డిసెంబర్‌ 2న 'బురేవి'.. 5న 'టకేటి'

కాష్టాల రాష్ట్రంలో వర్షాల ప్రభావం నష్టం కలిగిస్తుందా...?

(జానోజాగో వెబ్ న్యూస్-నెట్ వర్క్ డెస్క్)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మున్ముందు మరింత ముపు ఉందా..? గత కొద్ది రోజుల కిందటి వరకు భారీ వర్షాలతో అతలాకుతలమైన ఏపీ ఇపుడు తుఫాన్లకు తీవ్రంగా నష్టపోతోంది. ఎవరూ ఉహించని రీతిలో నివర్ తుఫాను ఏపీని అల్లాకల్లోలం చేస్తే...మరింత నష్టం చేసేందుకు మరిన్ని కొన్ని తుఫాన్లు ప్రమాదం మున్మందు దాగివుందని వాతావరణ శాఖ అధికార్లు చెబుతున్నారు. ఈనెల 29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.  తీవ్ర వాయుగుండం కాస్తా తుపానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. డిసెంబర్‌ నెలలో మరో రెండు తుపాన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపింది. డిసెంబర్‌2న  'బురేవి తుఫాన్' తీవ్ర ప్రభావం చూపనుందని, ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రా, రాయలసీమ పై  దీని ప్రభావం ఎక్కువ చూపిస్తుందని అధికారులు  అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 5న   మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనంతో 'టకేటి తుఫాన్' ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో డిసెంబర్‌ 7న డిసెంబరు 7 తేదీ దక్షిణ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ కు  తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఆ ప్రాంతాల్లో నివర్ ప్రభావం...?

తుఫాన్ ప్రభావం ఎపి లో నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లా ల్లో తీవ్రంగా కనిపిస్తోంది, అనేక చోట్ల రహదారులు తెగిపోయాయి, భారీ వృక్షాలు నేలకొరిగాయి, ఇటువంటి ప్రాంతాలలో అగ్నిమాపక సిబ్బంది 24గంటలూ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు, వందల మందిని వరదల నుంచి కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మూడు రోజులుగా మా సిబ్బంది తుఫాన్ ప్రాంతాలలో ప్రజల  రక్షణ చర్యలు చేపట్టారు. నెల్లూరు లో 12, చిత్తూరు లో 32, కడపలో 22, అనంతపురంలో 10, ప్రకాశం లో 11 ప్రత్యేక టీం లు పని చేస్తున్నాయని అగ్నిమాపక శాఖ  డైరెక్టర్ కె. జయరాం నాయక్  తెలిపారు. అగ్నిమాపక శాఖ పేరు 2009నుంచి డిజార్డర్స్ మేనేజ్ మెంట్ లో కలిపారు, గతంలో అనేక తుఫాన్లు లో మా‌ సిబ్బంది అనేక సాహసోపేతంగా పని‌చేశారు, ఈ తుఫాన్ లో మూడు జిల్లాల్లో 87టిం లుగా 523 మంది పనిచేస్తున్నారు, కడపజిల్లా లో ఒక అమ్మాయి నదిలో పడిపోతే వెంటనే కాపాడారు, కాళహస్తి లో  వరదలో చిక్కుకున్న ఇద్దరు రైతులను కాపాడారు అని ఆయన పేర్కొన్నారు.

పెన్నా నది ఉగ్రరూపం... ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలన్న అధికారులు

నివర్ తుపాను పోతూపోతూ చూపించిన ప్రభావం అంతాఇంతా కాదు. బాగా బలపడిన స్థాయిలో తీరం దాటిన నివర్, భూభాగంపైకి ప్రవేశించిన తర్వాత కూడా కొన్ని గంటల పాటు తుపాను స్థాయిలోనే కొనసాగడంతో ఏపీలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా, తమిళనాడుకు అత్యంత సమీపంలో ఉండే నెల్లూరు జిల్లాలో నివర్ ఎఫెక్ట్ అత్యంత తీవ్రంగా ఉంది. ఎగువ ప్రాంతాల్లోనూ వర్ష బీభత్సం కొనసాగడంతో పెన్నా నది ఉగ్రరూపం దాల్చింది. ఇప్పటికీ పెన్నా నదికి భారీ వరద వస్తుండడంతో అధికారులు పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. పెన్నా నదికి వరద పోటెత్తుతోందని, పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రదేశాలకు చేరుకోవాలని హెచ్చరించారు. ప్రజలు తక్షణమే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని రాష్ట్ర విపత్తుల శాఖ స్పష్టం చేసింది. వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని, వరద నీటిలో పశువులు, గొర్రెలు, మేకలు వదలడం వంటివి చేయరాదని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు పేర్కొన్నారు. కాగా, పైనుంచి భారీ ఎత్తున వరద నీరు వస్తుండడంతో పలు చోట్ల పెన్నా నదికి కట్టలు తెగిపోయాయి. సమీప గ్రామాల్లోకి వరద నీరు చేరుతోంది.

రేపు సీఎం ఏరియల్ సర్వే

తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు (శనివారం) ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు. అనంతరం తిరుపతిలో అధికారులతో సమీక్షించనున్నారు. నివర్‌ తుపానుపై నేడు జరిగిన కేబినెట్‌ సమావేశంలో కూడా సీఎం చర్చించారు. దెబ్బతిన్న పంటలకు డిసెంబర్‌ 30 కల్లా పంట నష్టపరిహారాన్ని అందించాలని సీఎం ఆదేశించారు. శిబిరాల్లో ఉన్నవారికి రూ.500 ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. తుపాను ప్రభావంపై సీఎం వైఎస్‌ జగన్‌ నిన్న తన క్యాంప్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. తుపాను ప్రభావం, కురుస్తున్న వర్షాలపై సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అన్ని చర్యలూ తీసుకోవాలని సీఎం ఆదేశించారు. నెల్లూరు జిల్లాలో కరెంటు షాక్‌తో మరణించిన కుటుంబాన్ని ఆదుకోవాలని సూచించారు. వర్షాలు అనంతరం పంట నష్టంపై వెంటనే అంచనాలు రూపొందించాలని, భారీ వర్షాలుకారణంగా ఏదైనా నష్టం వస్తే సత్వరమే సహాయం అందించడానికి సిద్ధం కావాలని ఆదేశాలు ఇచ్చారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: