పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన...

లంబోదర క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 మూవీ

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

లేడీ ఓరియెంటెడ్ కథతో లంబోదర క్రియేషన్స్ తమ తొలి చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ ప్రొడక్షన్ నెంబర్ 1 మూవీ బుధవారం పూజా కార్యక్రమాలతో సంస్థ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభమైంది. సుశాంత్ కంతుల, జెస్సిక అమనపు జంటగా నటిస్తున్నారు. రాజేష్ భూపతి ఈ చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. నారి, ద పవర్ ఆఫ్ వుమెన్ అనే పేరును వర్కింగ్ టైటిల్ గా పెట్టుకున్నారు. స్వీటీ, బాలాజీ, జబర్దస్త్ నవీన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా దర్శకుడు రాజేష్ భూపతి మాట్లాడుతూ...లేడీ ఓరియెంటెడ్ గా సాగే చిత్రమిది.

 

నారి, ద పవర్ ఆఫ్ వుమెన్ అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ కు వెళ్తున్నాం. లవ్ యాక్షన్ తో పాటు డివోషనల్ అంశాలు నేపథ్యంగా ఉంటాయి. ప్రేక్షకులను థిల్ కు గురిచేసే కథా కథనాలతో సినిమాను రూపొందిస్తున్నాం. వచ్చే నెల 15వ తేదీ నుంచి తొలి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభిస్తాం. కడప, హైదరాబాద్ లోని పలు లొకేషన్ లలో మూడు షెడ్యూల్స్ లో చిత్రీకరణ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాం. అన్నారు.ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ - సందీప్ కుమార్, సంగీతం - కార్తిక్ వెంకటేష్, ఆర్ట్ - ఆనంద్, స్టంట్స్ - బాలచందర్


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: