కోవిడ్-19 నిర్ధారణ అయిన వారికి

హోమ్ ఐసొలేషన్ కిట్స్ పంపిణీ

(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

ప్రకాశంజిల్లా తర్లుపాడు మండలంలోని పి.హెచ్.సి. నందలి చెన్నారెడ్డి పల్లి గ్రామములోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 41 మందికి వి.ఆర్.డి.ఎల్. పరిక్షలు నిర్వహించగా వారిలో ముగ్గురికి కరోన పాజిటివ్ నిర్ధారణ అయింది. డాక్టర్ కె. వంశీకృష్ణ, మెడికల్ ఆఫిసర్ గారి ఆధ్వర్యములో నిర్ధారణ అయి, కరోన భారిన పడిన ముగ్గురు విద్యార్ధులకు “ కోవిడ్ - 19 హోమ్ ఐసొలేషన్ కిట్స్ “ పంపిణీ చేయడం జరిగింది.    ఈ కార్యక్రమములో పాల్గొన్న విద్యార్ధులు మరియు వారి తల్లిదండ్రులకు “ హోమ్ ఐసోలేషన్ “ గురించి వారికి వివరిస్తూ, తీసుకొనవలసిన జాగ్రత్తలలో భాగంగా ప్రతి ఒక్కరూ మాస్క్ వాడుట, భౌతిక దూరం పాటించుట మరియు శానిటైజర్ ద్వారా చేతులు పరిశుభ్రంగా ఉంచుకొంటూ తమ ఆరోగ్యాలతో పాటు తమ వారి ఆరోగ్యాలను సైతం కాపాడుకొనే విధంగా జాగ్రత్తల గురించి తెలియచేశారు. ఈ వరుస క్రమములో ఇప్పటివరకు తర్లుపాడు, తుమ్మలచెరువు, తాడివారిపల్లె మరియు చెన్నారెడ్డిపల్లె గ్రామాలలోని పాఠశాలల విద్యార్ధుల నుండి కోవిడ్-19  పరిక్షల కొరకు నమూనాలను సేకరించడం జరిగింది. రేపు మంగళ వారము (17-11-2020) చెన్నారెడ్డిపల్లె గ్రామానికి కోవిడ్-19 పరిక్షల కొరకు సంజీవని బస్సు రావడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు కూడ సద్వినియోగ పరచుకోవలసిందిగా తెలియచేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: