దేశంలోనే నెంబర్ వన్ సీఎం

18 మాసాలోనే తన సత్తా నిరూపించుకున్న జగన్

వైసీపీ నేత డాక్టర్ ఏలూరి వెల్లడి

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

తన దూరద్రుష్టి,పరిణితి చెందిన ఉద్దండిడిగా, చాకచక్యం ద్వారా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ కేవలం18 మసాల పరిపాలనలొనే దేశంలో నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలిచిపోవడం తెలుగు ప్రజలు గర్వించదగ్గ విషయమని రాష్ట్ర వైసీపీ సీనియర్ నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు. గత ఎన్నికల్లో ముందు చూపుతో ఒడిపోతాననే ఆలోచనతో చంద్రబాబు ఖాళీ ఖజానాతో రాష్ట్రాన్ని జగన్ కు అప్పజెప్పారని, అయితే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తన పరిపాలన దక్షతతో ప్రజలపై ఏ మాత్రం భారం వేయకుండా మరోవైపు ఆదాయ వనరులను పెంపొందించుకుంటు వినూత్న కార్యక్రమాలను అమలుపరుస్తున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో జగన్ ప్రజలకు ఏమైతే వాగ్దానాలు ఇచ్చారో అవిఅన్నీ నవరత్నాల కార్యక్రమాల ద్వారా అమలు చేసిన ఘనత వైసిపి ప్రభుత్వానికే దక్కిందని గుర్తు చేశారు. అర్హులైన వారందరికీ డిసెంబర్ 25 న నివాస యోగ్యం కల్పించడం జరుగుతుందని,అలాగే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు  సన్న చిన్న కారు రైతులకు ఉచితంగా బోర్లు, దశలవారీగా మధ్యనిషేదం, పేద విద్యార్థులకు ఆంగ్ల బోధన, అమ్మ ఒడి, జలకళ, చిరు వ్యాపారులకు ప్రోత్సాహక రుణాలు మంజూరు తదితర ప్రజా రంజక కార్యక్రమాలను ముఖ్యమంత్రి జగన్ అమలుపరిచారని,దింతో దేశంలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శప్రాయులయ్యారని ఆయన గుర్తు చేశారు. పరిపాలన ద్వారా దేశాన్ని ఆకర్షించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు అర్ధరహితమైన విమర్శలు చేస్తున్నాయని, అయితే వీటిని ప్రజలు ఎక్కడ విశ్వసించడం లేదని అన్నారు. అందుకు ఉదాహరణ ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపుమేరకు దిగ్విజయంగా ముగిసిన పాదయాత్రలేనని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలకు పార్టీలకు,వర్గాలకు రహితంగా మద్దతు పలకాలని రాష్ట్ర వైసీపీ నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: