వ్యాపారులకు పెట్టుబడి సహాయం కింద 10వేలు
మునిసిపల్ కమీషనర్ వెంకట కృష్ణ
మాట్లాడుతున్న కమిషనర్
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
వ్యాపారులకు పెట్టుబడి సహాయం కింద 10వేల రూపాయలు పెట్టుబడి సహాయం కింద అందజేయడం జరుగుతుందని మునిసిపల్ కమీషనర్ వెంకట కృష్ణ తెలిపారు. మునిసిపల్ కౌన్సిల్ హల్ నందు బుధవారం మునిసిపల్ కమీషనర్ అధ్యక్షతన పట్టణము నందు గల విధి విక్రయదారులు, చిరు వ్యాపారులకు సమావేశము నిర్వహించడం జరిగినది. ఈ సమావేశము నందు కమీషనర్ వెంకట కృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వము ఇచ్చిన మాట మేరకు కరోన కష్టకాలంలో చిరు వ్యాపారులకు పెట్టుబడి సహాయం కొరకు జగనన్న తోడు, పి.యం స్వామిది ద్వారా 10000/- రూపాయలు బ్యాంకుల ద్వారా పట్టణ ప్రాంతాలలోని చిరు వ్యాపారులకు 0% వడ్డీకే రుణాలు ఇప్పించడం జరుగుతుందన్నారు.
తీసుకున్న ఋణము తిరిగి సక్రమంగా బ్యాంకులకు చెల్లిస్తే మరల ఋణము పెంచి ఇచ్చుటకు బ్యాంకర్లు సుముఖంగా ఉన్నారని తెలిపారు. పట్టణములో నేటి వరకు సుమారుగా 3800 మందికి పైగా పై పథకాల ద్వారా లబ్ధిచేకూరడమైనదన్నారు. మిగిలిన లబ్ధిదారులకు కూడా ఈ నెలాఖరులోపు అర్హులందరికీ రుణాలు మంజూరు చేయగలమన్నారు. ఈ కార్యక్రమంలో సిఎంఎం విజయ భాస్కర్ రెడ్డి, మెప్మా సిబ్బంది సుజాత, విద్యాసాగర్, నాగరాణి, హిమ బిందు, బ్యాంకు అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: