ఇది ప్రేక్షకుల విజయం
కలర్ ఫోటో’ సక్సెస్ మీట్ లో ...చిత్రయూనిట్
(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా ప్రతినిధి)
సుహాస్, చాందిని చౌదరి జంటగా కొత్త దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కించిన చిత్రం కలర్ ఫోటో. అక్టోబర్ 23న ఆహా వేదికగా ఈ సినిమా విడుదలైంది. సునీల్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించారు. సాయి రాజేష్ నీలం, బెన్నీ నిర్మించిన ఈ చిత్రాన్ని సందీప్ రాజ్ తెరకెక్కించారు. వారం రోజుల తర్వాత సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు చిత్రయూనిట్. తొలివారంలో కలర్ ఫోటో చిత్రాన్ని 7 లక్షల మంది చూసారు. ఇది ప్రేక్షక విజయం అని.. మంచి సినిమాలు ఎప్పుడు వచ్చినా ఆదరిస్తారనే విషయం ఈ విజయంతో మరోసారి అర్థమైందని సంతోషాన్ని వ్యక్తం చేసారు యూనిట్. ఈ సందర్భంగా ప్రేక్షకులకు, అలాగే కలర్ ఫోటో విజయానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
నిర్మాత సాయి రాజేష్ మాట్లాడుతూ.. ’ఈ సినిమా అక్టోబర్ 23 సాయంత్రం 6 గంటలకు విడుదలైంది. రిలీజ్ అయిన తర్వాత కొందరి తప్పుడు రివ్యూస్ చూసి టెన్షన్ పడ్డాము. ఆ తర్వాత రెండు మంచి రివ్యూలు వచ్చాయి. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఆ విజయం ఆగలేదు. చాలా మంచి సినిమా తీసారంటూ అంతా కన్నీరు పెట్టుకుంటున్నారు.. సినిమా చూసిన తర్వాత ఫోన్స్ చేసి ఎమోషనల్ అవుతున్నారు. తొలివారంలోనే మా సినిమాను 7 లక్షల మంది చూసారు. టికెట్‌కు 100 రూపాయల చొప్పున లెక్క వేసుకున్నా తొలివారంలోనే మాకు 7 కోట్లు వచ్చాయి. దర్శకుడు సందీప్ రాజ్ మాకు మంచి సినిమా ఇస్తాడనుకున్నాం కానీ గొప్ప సినిమా ఇచ్చాడు. కలర్ ఫోటో చూసిన తర్వాత ఇండస్ట్రీలో కూడా చాలా మంది నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఫోన్లు చేసి అభినందిస్తున్నారు.. మా సినిమా గురించి ట్వీట్స్ కూడా చేసారు.. అంతా బాగా సపోర్ట్ చేసారు. ముఖ్యంగా అల్లు అరవింద్ గారు, బన్నీ వాసు గారు ఇచ్చిన సపోర్ట్ మరిచిపోలేం. ఆహా ప్లాట్ ఫామ్ ఇచ్చి మా సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువయ్యేలా చేసారు. నటీనటులు కూడా ప్రతీ ఒక్కరూ న్యాయం చేసారు. ఇది సమిష్టి విజయం’ అని తెలిపారు.
దర్శకుడు సందీప్ రాజ్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరికీ మనస్పూర్థిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు నేనిక్కడ ఉన్నానంటే కారణంగా వాళ్లే. వాళ్లు లేకపోతే నేను లేను. కొత్త దర్శకుడికి ఇంత ప్రోత్సాహం అందిస్తున్న అందరికీ పాదాభివందనాలు. ఈ సినిమాలో నా ఫెవరేట్ కమెడియన్, స్టార్ హీరో సునీల్ గారితో పని చేసాను. ఆయన లేకపోతే కారెక్టర్ లేదు. అలాగే ఈ సినిమాలో ప్రతీ చిన్న పాత్ర కూడా కీలకమైందే. నేను చాలా ఇబ్బంది పెట్టినా కూడా వాళ్లు మాత్రం చాలా ఓపిగ్గా భరించారు. అలాగే సాయి రాజేష్ గారు, బెన్నీ గారికి నన్ను నమ్మినందుకు కృతజ్ఞతలు. సుహాస్‌ను హీరో చేయాలనుకున్నాను.. చేసాను. నేను కథలో నా కళ్ళతో వీళ్లందర్నీ చూసాను.. అదే సినిమాలో చూపించాను. ఈ సినిమాలో పని చేసిన టెక్నీషియన్ కానీ.. నటున్ని కానీ కళ్లు మూసుకుని ఇకపై ఏ సినిమాలో అయినా పెట్టుకోవచ్చు.. ఇది నా హామీ’ అని తెలిపారు.
హీరోయిన్ చాందిని చౌదరి మాట్లాడుతూ.. ‘ఈ సినిమా విషయంలో ఇలాంటి వేడుక మరొకటి జరుపుకోవాల్సి వస్తుందని నేను ముందే చెప్పాను. ఇప్పుడు ఇదే జరిగింది. కలర్ ఫోటో నా జీవితంలో మరిచిపోలేను. ఈ చిత్రంలో చాలా మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా బ్లాక్‌బస్టర్ అని నా సినిమాపై చూడాలనుకున్న కల ఈ సినిమాతో నెరవేరింది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో పని చేసిన ప్రతీ ఒక్కరు కష్టపడి కాదు యిష్టపడి పని చేసారు..’ అని తెలిపారు.
నటుడు హర్ష మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు నాకు అంతా ఫుడీ కారెక్టర్స్ ఇచ్చారు. అలాంటి పాత్రలకే నన్ను పరిమితం చేసారు. కానీ తొలిసారి నా కెరీర్‌లో ఇంత బరువైన పాత్ర ఇచ్చినందుకు సాయి రాజేష్ అన్న, బెన్నీ అన్నకు థ్యాంక్స్. దర్శకుడు సందీప్ రాజ్ కూడా నన్ను ఏ కళ్ళతో చూసాడో కానీ మొత్తానికి చూసాడు. 2019 అక్టోబర్ 22న ఈ కారెక్టర్ నాకు సుహాస్, సందీప్ వచ్చి చెప్పారు. సరిగ్గా 2020 అక్టోబర్ 22 రాత్రి ప్రీమియర్స్ పడ్డాయి. నా కారెక్టర్ చూసి నవ్వుకుంటారేమో అనుకున్నా.. కానీ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ముఖ్యంగా కమెడియన్, నటుడికి మధ్య చిన్న హద్దు ఉంటుంది. అది దాటితే ఎబ్బెట్టుగా ఉంటుందేమో అనుకున్నా. కానీ క్లైమాక్స్ సీన్ చూసి నవ్వుకోనపుడే నేను పాస్ అయ్యానని అర్థమైపోయింది. అంతేకాదు నాకు యిష్టమైన కమెడియన్ ముందు.. యిష్టమైన సినిమా సొంతం నుంచి ఆ డైలాగ్ మళ్లీ ఆయన ముందే చెప్పడం అనేది నాకు చాలా నచ్చింది. ఇండస్ట్రీకి వచ్చిన ఏడేళ్ళ తర్వాత నన్ను నటుడిగా గుర్తించారు. ఇన్నాళ్ల నా కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు దక్కింది. ఈ విజయానికి కారణమైన అందరికీ మనస్పూర్థిగా ధన్యవాదాలు..’ అని తెలిపారు.
హీరో సుహాస్ మాట్లాడుతూ.. ‘నాకేం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. ఈ సినిమా గురించి చాలా కలలు కన్నాం.. ఎలాగైనా హిట్ కొట్టి చూపించాలనుకున్నాం. ఇప్పుడు ఇదే చేసాం. నన్ను హీరోగా యాక్సెప్ట్ చేసినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా విజయం కోసం ఎంతగానో వేచి చూసిన నా భార్యకు కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సాయి రాజేష్ అన్న, బెన్నీ అన్నకు థ్యాంక్స్’ అని తెలిపారు.
నటుడు సునీల్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కోసం అంతా యంగ్ స్టర్స్ పని చేసారు. వాళ్లతో వర్క్ చేయడం నాకు కూడా చాలా ఆనందంగా అనిపించింది. నేను ఈ సినిమాతో చాలా నేర్చుకున్నాను. నన్ను చాలా బాగా చూసుకున్నారు. అంతా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈ సినిమాలో వాళ్లు చెప్పినట్లే చేసాను. కలర్ ఫోటో చూసిన తర్వాత ఇండస్ట్రీ నుంచి కూడా చాలా కాల్స్ వచ్చాయి. కొట్టకుండా.. తిట్టకుండా.. చంపకుండా భలే భయపెట్టావ్ భయ్యా అంటూ అంతా ఫోన్ చేసి మరీ ప్రశంసించారు. అక్కడే నా కారెక్టర్ సక్సెస్ అయ్యిందని అర్థమైంది. ఇండస్ట్రీకి నేను వచ్చిందే విలన్ అవుదామని.. కానీ మనలో ఏదో కామెడీ సెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ కొద్దిగా పేరు తెచ్చుకున్నా. ఇప్పుడు కలర్ ఫోటోతో విలన్ కల కూడా నెరవేరింది. ఈ సినిమాకు గుండె చప్పుడు అంటే కాల భైరవ మ్యూజిక్. సందీప్ రాజ్ చాలా బాగా డిజైన్ చేసాడు.. హర్ష కామెడీ టైమింగ్ నాకు చాలా యిష్టం. సుహాస్ వాయిస్ అంటే నాకు చాలా యిష్టం. హీరోయిన్ చాందిని చాలా నటించింది. నిర్మాత సాయి రాజేష్ గారు మంచి ఫుడీ.. అమృత ప్రొడక్షన్స్ అని పేరుకు తగ్గట్లే అమృతం లాంటి ఫుడ్ అందించారు..’ అని తెలిపారు.ఈ సక్సెస్ మీట్‌కు సినిమాలో ప్రిన్సిపల్ పాత్ర పోషించిన సాయి, సునీల్ భార్యగా నటించిన నటి శ్రీవిద్య మహర్షి తదితరులు హాజరయ్యారు.
కింద ఇచ్చిన లింకులను కాపీ చేసుకొని గుగూల్లో పెస్ట్ చేస్తే కొత్త వార్తలు వస్తాయి. అలాకాకుండా లింక్ పై నొక్కి గో అన్న అప్షన్ నొక్కితే సంబంధిత లింక్ ఓపెన్ అవుతుంది.
సమసమాజ నిర్మాత....అన్ని వర్గాల హక్కు ప్రధాత... వెలుతురు సూర్యుడు మహా ప్రవక్త ముహమ్మద్(స) మీలాద్ ఉన్ నబి ప్రవక్త (స)జన్మదిన సందర్భంగా ప్రత్యేక వ్యాసం. https://www.jaanojaago.com/2020/10/blog-post_319.html
కామెర్లు (Jaundice) పట్ల... అప్రమత్తంగా ఉందాం....? https://www.jaanojaago.com/2020/10/jaundice.html
యునాని వైద్య అధికారులుగా.... ఎఎంయు(AMU)నుంచే 41 మంది విద్యార్థుల ఎంపిక https://www.jaanojaago.com/2020/10/amu-41.html
పేద ముస్లిం విద్యార్థులకు గొప్ప అవకాశం.... ఇంజనీరింగ్ లో ఉచిత విద్య...రెసిడెన్సియల్ సౌకర్యం ఖుభా కాలేజ్ ఆప్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వితరణ https://www.jaanojaago.com/2020/10/blog-post_773.html
బీజేపీవి... పొత్తు రాజకీయాలా ....ఉచ్చు రాజకీయాలా.... సొంత అజెండాను విస్మరించి కమలం బాటలో ప్రాంతీయ పార్టీలు https://www.jaanojaago.com/2020/10/blog-post_501.html
మరణాలకు స్ట్రోక్ రెండో అతి పెద్ద కారణం...చిన్న చిన్న మార్పుల ద్వారా స్ట్రోక్ ను కట్టడి చేద్దాం https://www.jaanojaago.com/2020/10/blog-post_208.htmlభూముల గోల్ మాల్ కు చెక్...అటహాసంగా ధరణీ పోర్టల్ ప్రారంభం.... ప్రారంభించిన సీఎం కేసీఆర్ https://www.jaanojaago.com/2020/10/blog-post_869.html
త్వరలోనే గ్రేటర్ ఎన్నికల నగారా.. నవంబర్ రెండో వారంలో షెడ్యూల్... కసరత్తు చేస్తున్న ప్రభుత్వం https://www.jaanojaago.com/2020/10/blog-post_400.html
ఏపీలో.. నవంబర్ 2 నుంచి పాఠశాలలు, కాలేజీలు....పటిష్టంగా కోవిడ్ రక్షణ చర్యలు https://www.jaanojaago.com/2020/10/2_29.html
వేడెక్కుతున్న రాజకీయం... రసోత్తరంగా కృష్ణా-గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక https://www.jaanojaago.com/2020/10/blog-post_924.html
పోలీసు అధికారుల విభజన పూర్తి ...ఏపీకి 382, తెలంగాణకు 250 మంది https://www.jaanojaago.com/2020/10/382-250.html
శరవేగంగా కర్రి బాలాజీ "బ్యాక్ డోర్" https://www.jaanojaago.com/2020/10/blog-post_921.html
విశ్వం సృష్టించబడింది.... దానికంత అదే ఏర్పడలేదు... https://www.jaanojaago.com/2020/10/blog-post_132.html
అక్షరం మనకు దూరం...మనమూ అక్షరానికి దూరం ఇలా అయితే అభివృద్ది ఎలా...? సమగ్ర పురోగతికి అక్షరమే ఆధారం...? భారతదేశంలో ముస్లింల విద్యా స్థితి-అభివృద్ధి -ఒక అవలోకనం https://www.jaanojaago.com/2020/10/blog-post_744.html
ఏంటీ పిల్లాడు ఏడుస్తున్నాడా....? అయితే....కడుపులో పేగు పురుగులున్నాయేమో చూపించండి https://www.jaanojaago.com/2020/10/blog-post_315.html
ఆ ఆస్తులను తిరిగి వక్ప్ కు అప్పగించాలి-- జానోజాగో డిమాండ్ https://www.jaanojaago.com/2020/10/blog-post_214.html
బలమైన ఎముకల కోసం ఇవి తీసుకోండి.... విటమిన్ డి...కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకొందాం https://www.jaanojaago.com/2020/10/blog-post_162.html
ఇస్లాంను ఇక్కడ గుర్తించండి... వాస్తవానికి ఇస్లాం అంటే ఇది... కానీ ఏదో వ్యక్తి చేసే వ్యక్తిగత తప్పుకి ఇస్లాంను బలిచేసే ప్రయత్నాలు https://www.jaanojaago.com/2020/10/blog-post_732.html
వయస్సు చిన్నదైనా....కనువిపు కలిగించే ప్రయత్నం... ఊరి కోసం...నాసా ఆహ్వానాన్ని వద్దనుకుంది! ఎందుకంటే...? https://www.jaanojaago.com/2020/10/blog-post_491.html
నిశ్శబ్దంతో నిండిన ప్రపంచం.... వినికిడి శక్తి కోల్పోవడంపై మీకు అవగాహన ఉందా? https://www.jaanojaago.com/2020/10/blog-post_331.html
ఆంగ్లేయుడిని హెచ్చరిస్తూ క్విట్ ఇండియా నినాదం చేసిందెవ్వరూ...? గాంధీచేత సాహస మహిళ అని ప్రశంస పొందిన ఆ ముస్లిం యోధురాలు ఎవరో తెలుసా...? https://www.jaanojaago.com/2020/10/blog-post_385.html
పచ్చబొట్టేసుకొన్న ఓ పిల్లగాడ...ఓ పిల్ల...? ఇది నీకు తెలుసా...? పచ్చబొట్లు /టాటూస్ చెమట గ్రంథులకు నష్టం కలిగించవచ్చు https://www.jaanojaago.com/2020/10/blog-post_405.html
పచ్చబొట్టేసుకొన్న ఓ పిల్లగాడ...ఓ పిల్ల...? ఇది నీకు తెలుసా...? పచ్చబొట్లు /టాటూస్ చెమట గ్రంథులకు నష్టం కలిగించవచ్చు https://www.jaanojaago.com/2020/10/blog-post_405.html
మీ త్యాగ స్పూర్తి ప్రతి మనస్సులో చెరగని ముద్ర... మీ లౌకిక సందేశం భారతదేశంలో సజీవంగా ఉంచుతాం... భారత ముద్దబిడ్డ అష్ఫాకుల్లా ఖాన్ నీకు ఇవే మా జోహార్లు....? https://www.jaanojaago.com/2020/10/blog-post_351.html
కడుపు మంట....తిరగబడేలా చేసింది.... భారత స్వాతంత్య్ర ఉద్యమంలో మరో కీలక ఘట్టం.. ఫకీర్-సన్యాసి తిరుగుబాటు https://www.jaanojaago.com/2020/10/blog-post_473.html
భారత గడ్డ విముక్తి కోసం...నెలరాలిన వీరులెందరో... అందులోని ఓ దృవతార పీర్ అలీ ఖాన్... అందుకే ఆయన 1857 భారత ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామ హీరో అయ్యారు https://www.jaanojaago.com/2020/10/1857.html
జై హింద్ నినాదాన్ని...నేతాజీ పదానికి పురుడు పోసిందెవ్వరూ...? సహాయ నిరాకరణ ఉద్యమం కోసం తన ప్రభుత్వ పదవిని త్యాగంచేసిన విజయవాడ వాసి ఎవరు...? https://www.jaanojaago.com/2020/10/blog-post_601.html
వ్యక్తి ఉన్మాదంను...మతంతో జోడించడమా... ఇది ఎంతవరకు సరైంది....? ఇస్లాంను ఖురాన్ బోధనల్లో...ప్రవక్త ముహమ్మద్ (స) ఆచరణతో చూడాలి https://www.jaanojaago.com/2020/10/blog-post_454.html
ఎముకల బ్యాంక్ – మీ ఎముకలను ప్రేమించండి... ఆస్టియోపోరోసిస్ – అసలు పట్టించుకోని విషయం--డాక్టర్ జి.సతీష్ రెడ్డి https://www.jaanojaago.com/2020/10/blog-post_197.html
విల్లు పట్టే అల్లూరికి తుపాకి పట్టడం నేర్పిందెవ్వరూ...?.... హిందూ మహాసభకు అధ్యక్షత వహించిన ముస్లిం ప్రముఖుడెవ్వరూ...? https://www.jaanojaago.com/2020/10/blog-post_890.html
మన రక్తంలో... హిమోగ్లోబిన్ శాతం కూడా ముఖ్యమే..? హిమోగ్లోబిన్ - మెరుగుపరిచే ఆహారాలు! https://www.jaanojaago.com/2020/10/blog-post_651.html
అలా ఆ స్వాతంత్య్ర సమరయోధులను....ఉరి శిక్షనుంచి ఆయన రక్షించారు https://www.jaanojaago.com/2020/10/blog-post_149.html
కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలని ఉందా..అయితే www.jaanojaago.com లోకి విజిట్ చేయండి...కొత్త కొత్త విషయాలను తెలుసుకోండి. 1, 2, 3, 4,...ఇలా పేజీలు తిరగేయండి. కొత్త కొత్త కథనాలు చదవండి