సెప్టెంబర్ 2020

 20 వ సారి రక్త దానం చేసిన మదర్ యూత్ సభ్యుడు దిలీప్

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల మండలం పెద్ద కొట్టాల గ్రామానికి చెందిన బ్రహ్మ ఆంజనేయులు అనారోగ్యంతో బాధపడుతూ నంద్యాల గవర్నమెంట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు అతన్ని పరీక్షించిన డాక్టర్లు కేవలం నాలుగు పాయింట్లు మాత్రమే అర్జెంటుగా ఇతనికి రక్తం ఎక్కించాలి అని చెప్పారు  వారి బంధువులు మదర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళి సంప్రదించగా వెంటనే స్పందించి  దిలీప్ ఫోన్ చేసి విషయం చెప్పగా వెంటనే నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్లి బి పాజిటివ్ రక్తదానం చేయడం జరిగింది రక్తదానం చేసిన దిలీప్ ను మరియు మదర్  యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళి అభినందించడం జరిగింది.

కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలని ఉందా..అయితే  www.jaanojaago.com లోకి విజిట్ చేయండి...కొత్త కొత్త విషయాలను తెలుసుకోండి. 1, 2, 3, 4,...ఇలా పేజీలు తిరగేయండి. కొత్త కొత్త కథనాలు చదవండి

 గని గ్రామంలో భూసేకరణపై

 రైతులతో సబ్ కలెక్టర్ కల్పన కుమారి సమీక్షా

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

బుధవారం నంద్యాల సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి గడివేముల మండలం గని గ్రామంలోని భూసేకరణ కార్యక్రమంలో భాగంగా రైతులతో సమీక్ష నిర్వహించారు. ఈ  సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు గని గ్రామంలో పట్టా భూములు కలిగిన 7 మంది రైతులతో సమీక్షా నిర్వహించామని, రైతులకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలను పరిశీలించామన్నారు. ఈసమీక్ష గురించిన నివేదికను  జిల్లా కలెక్టర్ వీరపాండియన్ గారికి సమర్పించుతామన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కార్యాలయం పరిపాలనాధికారి హరీనాథరవు, గని గ్రామ రైతులు పాల్గొన్నారు.

కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలని ఉందా..అయితే  www.jaanojaago.com లోకి విజిట్ చేయండి...కొత్త కొత్త విషయాలను తెలుసుకోండి. 1, 2, 3, 4,...ఇలా పేజీలు తిరగేయండి. కొత్త కొత్త కథనాలు చదవండి

 ఎంపీ దృష్టికి జర్నలిస్టుల సమస్యలు

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

 కరోనా పరిస్థితుల్లో వృత్తి ధర్మంగా విధుల్లో ఉంటున్న వర్కింగ్ జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించాలని, వైద్యులకు, పారిశుధ్య కార్మికులకు, పోలీసులకు  కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 50 లక్షల ఇన్సూరెన్స్ స్కీమ్ వర్కింగ్ జర్నలిస్టులకు  వర్తించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఎపిడబ్ల్యూజేఎఫ్ )నాయకులు  నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డిని కోరారు. బుధవారం ఎపిడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధి బృందం ఎంపీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా నాయకులు మౌలాలి, ప్రభాకర్ లు పలు సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. కరోనా కష్టకాలంలో జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారిని ఆదుకునేలా కృషి చేయాలన్నారు. కరోనా బారిన పడిన జర్నలిస్టులకు 25 వేల రూపాయలు తాత్కాలికంగా ఆర్ధిక సహాయం అందజేయాలన్నారు. కోవిడ్ తో మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు 25 లక్షలు అందజేయాలని, కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే బెనిఫిట్స్ జర్నలిస్టులకు అందేలా కృషి చేయాలని ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డిని కోరారు.

కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలని ఉందా..అయితే  www.jaanojaago.com లోకి విజిట్ చేయండి...కొత్త కొత్త విషయాలను తెలుసుకోండి. 1, 2, 3, 4,...ఇలా పేజీలు తిరగేయండి. కొత్త కొత్త కథనాలు చదవండి

 పోరాట ఫలితమే

ముస్లిం, ప్రజా సంఘాల నాయకులు



(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల ఉర్దూ జూనియర్ కళాశాల భవనాలు కేటాయించడం భూక్ హర్తాళ్ పోరాట ఫలితమే అని నంద్యాల ముస్లిం ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. జమాతే ఇస్లామి హింద్ నాయకులు అబ్దుల్ సమద్, ఆవాజ్ కమిటీ డిస్టిక్ కన్వీనర్ మస్తాన్ వలి, ఇన్సాఫ్ జిల్లా నాయకులు బాబా ఫక్రుద్దీన్, పిడిఎస్యు మైనార్టీ నాయకులు రఫీ, ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ జిల్లా అధ్యక్షులు సలాం మౌలానా, కాంగ్రెస్ మైనార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్లా, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ పట్టణ కార్యదర్శి మస్తాన్ ఖాన్, ఎస్ ఐ ఒ నాయకులు సద్దాం, ఎంఐఎం నాయకులు సమీర్,నాయకులు మాట్లాడుతూ ఉర్దూ కళాశాల భవనాలకు తాత్కాలికంగా మంజూరు కావడనికి "భూక్ హర్తాళ్" ఫలితమే అని పై నాయకులు తెలియజేశారు.అలాగే కేంద్రం నిధుల నుండి శాశ్వత భవనాలు నిర్మించి భవిష్యత్తులో ఉర్దూ డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని  కళాశాలలో మౌలిక వసతులు, అధ్యాపకుల నియామకం చేయాలని డిమాండ్ చేశారు.అలాగే నంద్యాల పార్లమెంట్ లోని ఉర్దూ యూనివర్సిటీ కావాలని కోరారు.

కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలని ఉందా..అయితే  www.jaanojaago.com లోకి విజిట్ చేయండి...కొత్త కొత్త విషయాలను తెలుసుకోండి. 1, 2, 3, 4,...ఇలా పేజీలు తిరగేయండి. కొత్త కొత్త కథనాలు చదవండి

సీబీఐ కోర్టు తీర్పు బాధాకరం

సయ్యద్ నిసార్ అహ్మద్

సయ్యద్ నిసార్ అహ్మద్

(జానోజాగో వెబ్ న్యూస్-ఏపీ ప్రతినిధి)

బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో నిందితులంతా దోషులేనని సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పు బాధాకరంగా ఉందని జానోజాగో(ముస్లింల అభివృద్ది వేదిక) సంఘం జాతీయ అధ్యక్షులు సయ్యద్ నిసార్ అహ్మద్ పేర్కొన్నారు. ఈ తీర్పుపై మళ్లీ స్థానిక హైకోర్టుకి వెళ్లాల్సిన అవశ్యత ఉందని, ఈ  దిశగా ముస్లిం మేధావులు సమాలోచనలు చేయాలని ఆయన కోరారు. బాబ్రీ మసీదు కూల్చివేత అన్నది దేశంలో అందరికీ తెలిసిన విషయమేనన్నారు. పది నెలల కిందటే ఇదే విషయంలో సుప్రీం కోర్టు ఇది నేరపూరిత చర్య అని వ్యాఖ్యానించిందని ఆయన గుర్తుచేశారు. కానీ సీబీఐ కోర్టు మాత్రం ఈ కేసును కొట్టేయడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.  అందరూ నిర్దోషులైతే మసీదును కూల్చిందెవ్వరూ అని ఆయన ప్రశ్నించారు. 

కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలని ఉందా..అయితే  www.jaanojaago.com లోకి విజిట్ చేయండి...కొత్త కొత్త విషయాలను తెలుసుకోండి. 1, 2, 3, 4,...ఇలా పేజీలు తిరగేయండి. కొత్త కొత్త కథనాలు చదవండి

 బజాజ్ ప్రైవేట్ ఫైనాన్స్ ఆగడాలపై 

చర్యలు తీసుకోవాలి 

నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారికి ఎఐఎస్ఎఫ్ వినతి 



(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

బజాజ్ ప్రైవేట్ ఫైనాన్స్ ఆగడాలపై చర్యలు తీసుకోవాలని నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారికి ఎఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చినట్లు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ధనుంజయుడు తెలిపారు. నిత్యం బజాజ్ ఫైనాన్స్ సిబ్బంది వేధింపులు ఎక్కువ అయ్యాయని,  వారిపై చర్యలు తీసుకోవాలని, ప్రతి నిత్యం ఫోన్ కాల్స్ తో వేధింపులు, బెదిరింపులకు  పాల్పడుతున్నారని, బజాజ్ ఫైనాన్స్ ఎత్తివేసే వరకు పోరాటం సాగిస్తామని, భాదితులతో 5వ తేదీ నుండీ నిరాహార దీక్షలు చేపడుతామని ఆర్వీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రాజునాయుడు, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ధనుంజయుడు, జీవిఎస్ జిల్లా  అధ్యక్షులు రవీంద్ర నాయక్ లు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నంద్యాల పద్మావతి నగర్లో ఉన్న బజాజ్ ఫైనాన్స్ ఆగడాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనీ, ఆర్ధికంగా రకరకాల పేర్లతో వేలకు వేల రూపాయలు పెనాల్టీల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనీ వెంటనే ఈ బజాజ్ ఫైనాన్స్ సంస్ధపై చర్యలు తీసుకొని, నంద్యాలలో ఈ సంస్ధను ఎత్తివేయాలని కోరుతూ బుధవారం నాడు నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో ఆర్వీఎఫ్ , ఏఐఎస్ఎఫ్, జీవీఎస్ సంఘాల ఆధ్వర్యంలో నంద్యాల సబ్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారిని కలిసి సమష్యను వివరించి అనంతరం వినతి పత్రం అందజేశామన్నారు. సున్నా వడ్డీకే బజాజ్ ఫైనాన్స్ సంస్ధలో వస్తువులను కొనుగోలు చేయండీ అంటూ తప్పుడు ప్రకటనలు, ప్రచారాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తూ కొనుకోలు చేస్తున్న సమయంలో బజాజ్ కార్డుకు ఒక రేటు తర్వాత వస్తువు ఫ్రాసెసింగ్ ఫీజు పేరుతో మరో దోపిడీ, ఒక్క ఈఎంఐ కట్టకపోయినా, ఒక్క రోజు సమయం ఆలస్యమైనా చెక్ బౌన్స్ ల పేర్లతో వేల రూపాయలు వసూలు చేస్తున్నారని వారు అన్నారు. ఇదేంటని ప్రశ్నించిన వారిని మాటలతో దాడి చేస్తూ ఇష్టం వచ్చిన పని చేసుకోండని బెదిరిస్తున్నారన్నారు. 

కరోనా విపత్కర పరిస్ధితులలో ఉపాధి లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే బజాజ్ ఫైనాన్స్ లో పని చేసే సిబ్బంది నిత్యం రోజుకు 10 నుండి 15 సార్లు ఫోన్ కాల్స్ చేస్తూ వ్యంగంగా మాట్లాడుతున్నారని, ఈఎంఐ చెక్ బైన్స్ లు కట్టకపోతే ఇళ్ల వద్దకు వస్తాం, కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తాం అని రకరకాలుగా బెదిరిస్తున్నారన్నారు. నంద్యాలలో బజాజ్ సంస్ధలో 15 వేలు నుండి 18 వేల మంది కస్టమర్లు ఉన్నారనీ, నిత్యం వేథింపులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే స్పందించి ఈ బజాజ్ ఫైనాన్స్ సంస్ధపై చర్యలు తీసుకోవాలని కోరారు.

కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలని ఉందా..అయితే  www.jaanojaago.com లోకి విజిట్ చేయండి...కొత్త కొత్త విషయాలను తెలుసుకోండి. 1, 2, 3, 4,...ఇలా పేజీలు తిరగేయండి. కొత్త కొత్త కథనాలు చదవండి

 సీబీఐ కోర్టు తీర్పు బాధాకరం

వెల్పేర్ పార్టీ ఆప్ ఇండియా నేత ఐ.ఎ.అహమ్మద్

(జానోజాగో వెబ్ న్యూస్-విశాఖ ప్రతినిధి)

బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో నిందితులంతా నిర్దోషులేనని సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పు బాధాకరంగా ఉందని వెల్పేర్ పార్టీ ఆప్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఐ.ఎ.అహమ్మద్ పేర్కొన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన దేశమంతా చూసిందన్నారు. ఇదే విషయంలో సుప్రీం కోర్టు ఇది నేరపూరిత చర్య అని పది నెలల కిందటే వ్యాఖ్యానించిందని ఆయన గుర్తుచేశారు. కానీ సీబీఐ కోర్టు మాత్రం ఈ కేసును కొట్టేయడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. 28 ఏళ్ల సుధీర్ఘ విచారణ, 49 మంది దోషులున్న ఈ కేసులో అంతా నిర్దోషులా అని ఆయన ప్రశ్నించారు. అందరూ నిర్దోషులైతే మసీదును మరి ఎవరు కూల్చారు అని ఆయన ప్రశ్నించారు. ఈ కూల్చివేత కేసులో ఎవరికైనా శిక్షపడిందా అని ఆయన ప్రశ్నించారు. మసీదు కూల్చివేశారని సుప్రీం కోర్టులో కూడా నిరూపితమైందన్నారు.  2019 నవంబర్ 9న ఆయోధ్య వివాదం తుదితీర్పులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందని ఆయన గుర్తుచేశారు. వివాదాస్పద భూమిలోని 2.77 ఎకరాల భూమిని రామజన్మభూమి కోసం ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేసి వాటికి అప్పగించాలని కేంద్రాన్ని ఆదేశిస్తూనే బాబ్రీ మసీదు కూల్చివేయబడినందున మరో చోట మసీదును నిర్మించేందుకు వీలుగా ప్రభుత్వం ఐదు ఎకరాల భూమిని ఉత్తర్ ప్రదేశ్ సున్ని సెంట్రల్ వక్ప్ బోర్డుకు అప్పగించాలని అదే తీర్పులో ప్రభుత్వానికి ఆదేశించిందని ఆయన గుర్తుచేశారు. దీనిని బట్టి మసీదు కూల్చివేత జరిగిందని స్పష్టంగా సుప్రీంకోర్టు పేర్కొందని ఆయన పేర్కొన్నారు. వాస్తవం ఇలావుంటే బాబ్రీ మసీదు కేసులో నిందితులంతా నిర్దోషులేనని ఎలా చెప్పగలరు అని కోర్టు తీర్పుపై ఆయన పేర్కొన్నారు. బాబ్రీ మసీదు ఎవరూ కూల్చకుండానే కూలిపోయిందా అని ఆయన ఆశ్చర్యం వ్యక్తంచేశారు. సుప్రీం కోర్టు స్వయంగా మసీదు కూల్చివేశారని తీర్పులో స్పష్టంగా పేర్కొన్నా సీబీఐ కోర్టు ఇలా తీర్పు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ కోర్టు తీర్పుపై మళ్లీ హైకోర్టు లో ఛాలేంజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలని ఉందా..అయితే  www.jaanojaago.com లోకి విజిట్ చేయండి...కొత్త కొత్త విషయాలను తెలుసుకోండి. 1, 2, 3, 4,...ఇలా పేజీలు తిరగేయండి. కొత్త కొత్త కథనాలు చదవండి

 వక్ఫ్ ఆస్థుల్ని పరిరక్షించండి...

ముస్లిం వెల్పేర్ ఆపోసియేషన్ డిమాండ్

ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాకు వినతిపత్రం ఇస్తున్న నేతలు

(జానోజాగో వెబ్ న్యూస్-గుంటూరు జిల్లా ప్రతినిధి)

రాష్ట్రంలో ప్రస్తుతం వక్ఫ్ బోర్డ్ పూర్తిగా నిద్ర వస్థలో ఉన్నది అనడానికి ఒక చిన్న ఉదహరింపు వక్ఫ్ సంబంధిత ఆస్తులు కబ్జాకు గురికావడమే...వక్ఫ్ చట్టాన్ని తమ చుట్టం గా చేసుకుంటున్నారని  ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ రఫీ పేర్కొన్నారు. ఆయన ఇదే విషయమై ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాను  ఆయన కలిశారు. ఇదే ఘటనలను పొన్నూరు శాసన సభ్యులు కిల్లారి రోశయ్య కు కూడా తెలియజేయడం జరిగిందని రఫి తెలిపారు. దీనిపై స్పందించి దర్గా కార్యక్రమాలలో ఎవరు అడ్డంకులు కలిగించిన ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే కిల్లారి రోశయ్య కూడా స్పష్టంచేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా రఫి మాట్లాడుతూ  కొంత మంది వక్ఫ్ అధికారుల సోమరితననికి ఆసరాగా చేసుకుంటూ కబ్జా ఖోర్ల కబంధ హస్తాలో ఇప్పటికే కొన్ని వేల కోట్ల వక్ఫ్ భూములు చిక్కుకొని ఉండగా తాజాగా ఆంధ్రప్రదేశ్ లోనే ఎంతో పేరు ప్రఖ్యాతులతో పాటు కోట్లలో వార్షిక ఆదాయం  కలిగిన దర్గా, పెదాకాకని బాజి బాబా దర్గా...అయితే ఈ దర్గా ఆదాయం పై కన్నేసిన కొంత మంది దర్గా భక్తులు వక్ఫ్ బై యూసర్ క్రింద దాదాపు కొన్ని వందల సవంచరాల నుండి భక్తుల సౌకర్యార్థం వినియుగిస్తున్న పల్లాలమ్మ చెరువు ప్రాంతన్ని టార్గెట్ చేసుకొని ఇంటి ముసుగులో అన్యమత కట్టడానికి పూనుకోవడం జరుగుతుంది అని రఫీ గారు తెలిపారు ఈ అక్రమ కట్టడాల విషయం తెలిసి కూడా దర్గా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అడ్డుకట్ట వేయలేకపోవడం గత ఒక సవంచరం పాటుగా చాప కింద నీరుగా జరుగుతున్న వ్యవహారం. గత ఆదివారం జరుగుతున్న అక్రమ కట్టడం తహసిల్దార్ గారి చురవతో ఆపివేయడం జరిగిన సంగతి తెలుసుకున్న దర్గా ఇఓ ఆఘమేఘాల మీద అధికారులను కలిసి తన వైపు నుండి ఫిర్యాదు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. దర్గాను అభివృద్ధి పరిచే విషయంలో పొన్నూరు శాసనసభ్యులు కిలారి రోశయ్య ఎంతో చొరవ చూపుతూ దర్గా కు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలని, దర్గా ప్రాంతాన్ని ఒక ప్రముఖ్య పర్యాటక కేంద్రంగా చేయాలనే సంకల్పాన్ని సైతం ఇటువంటి స్వార్ధపరుల చర్యల వలన కుంటుపడే అవకాశం లేకపోలేదు. దీనిపై స్పందించిన మంత్రి వెంటనే రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ సీఈవో గారిని విచారించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారని జరిగినది అని రాష్ట్ర ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ రఫీ తెలిపారు మంత్రి గారికి కలిసిన వారిలో ఎం ఐ ఎం బాజిద్ బాష, ముస్లిం వెల్ఫేర్ టౌన్ అధ్యక్షుడు మహబూబ్ బాష, ముస్లిం నాయకులు ఇమామ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలని ఉందా..అయితే  www.jaanojaago.com లోకి విజిట్ చేయండి...కొత్త కొత్త విషయాలను తెలుసుకోండి. 1, 2, 3, 4,...ఇలా పేజీలు తిరగేయండి. కొత్త కొత్త కథనాలు చదవండి

 తెరపైకి కులం కార్డు...?

ఏపీలో బీజేపీ అస్త్రం ఇదేనా..?

కొత్త వ్యూహంతో సోమువీర్రాజు ఏపీ రాజకీయాలను మలుపు తిప్పుతారా?

జనసేనతో అందుకేనా కమలం దోస్తీ...?

ఆసక్తికరంగా మారుతున్న ఏపీ రాజకీయాలు



(జానోజాగో వెబ్ న్యూస్-ఏపీ ప్రతినిధి)

దక్షిణాది రాష్ట్రాలలో కుల రాజకీయాలకు పెట్టింది పేరు. ఇందుకు ఏపీ ఏమీ మినహాయింపు కాదు. ఏపీలో రెండు పార్టీలు, రెండు కులాలుగా సాగిపోతున్న రాజకీయాన్ని మరో మలుపు తిప్పేందుకు కమలం పార్టీ ప్రయత్నిస్తోందా...? ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజు కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు కొత్త వ్యూహాలు రచిస్తున్నారా...? తన సామాజిక వర్గం నుంచే ఈ ప్రయత్నం ప్రారంభించి త్వరలో దీనికి ఓ రూపు తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నారా..? కాపు రాజకీయాన్ని బీజేపీ ఇకమీదట జనసేనతో కలిసి బలంగా చేయబోతుందా? ఇంతకీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి వ్యూహాలు ఏమిటి...? అన్నది ఇపుడు ఆసక్తిగా మారింది. 


 

ఏపీలో జనాభా పరంగా మెజారిటీ ఉన్న కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కాపు సామజిక వర్గానికి చెందిన సోము వీర్రాజుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టడంతో ఆయన కాపు ఓట్ల సమీకరణపై దృష్టి సారించారు. ముఖ్యంగా రాష్ట్రంలో తమ బలం, బలగం ఏంటన్న దానిపై స్పష్టత కలిగిన సోము వీర్రాజు బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు దూకుడు ప్రదర్శిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సోము వీర్రాజు ఇప్పటికే చిరంజీవితో పాటు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను కలిశారు. ముద్రగడ వంటి కాపు నేతలను తనకు సహకరించాలని కోరడం ద్వారా కొత్త సమీకరణాలకు తెరలేపారు. ఉభయగోదావరి జిల్లాల్లో బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు సోమువీర్రాజు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇక్కడి కాపు నాయకులను ఆకర్షించే పనిలో ఆయన బిజీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.


 

కాపు నేత సీఎం అవుతారని

కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలను, క్రియాశీల కార్యకర్తలను బీజేపీలోకి ఆహ్వానించే పనిలో రాష్ట్ర నాయకత్వం నిమగ్నమైనట్లు తెలుస్తోంది. పార్టీలో చేరాలని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కాపు నేతలకు సోము వీర్రాజు టీం నుంచి ఫోన్లు వెళ్తున్నాయట. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని..కాపు నేత సీఎం అవుతారని చెబుతున్నారట. ఇప్పుడు పార్టీలోకి వస్తే తగిన గుర్తింపుతో పాటు పదవులు ఇస్తామని ఆశల వల విసురుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓ రాష్ట్ర స్థాయి నేతను బీజేపీ నేతలు కలిసి సంప్రదింపులు జరిపారట. పార్టీలో చేరితే అత్యున్నత స్థాయి కల్పిస్తామని హామీ కూడా ఇచ్చేశారట. కానీ సదరు నాయకుడు కమలనాధుల ప్రతిపాదనకు ముఖం మీదే నో చెప్పేసినట్లు లోకల్‌గా టాక్‌ వినిపిస్తోంది. అలాగే టీడీపీలో అధికంగా ఉన్న కోనసీమ కాపు నేతలకు బీజేపీలో చేరాలని పదే పదే ఫోన్లు వస్తున్నట్లు మరో చర్చ జరుగుతోంది. రాబోయే కాపు ప్రభుత్వంలో అన్ని విధాలా ఆదుకుంటామని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే మీకే నష్టమని కూడా చెబుతున్నారట. ఇలా కాపులు అధికంగా ఉన్న జిల్లాల్లో టీడీపీ దిగువ క్యాడర్ లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆపరేషన్‌ ఆకర్ష్ ప్రయోగిస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. 

ఆ రెండు జిల్లాలపై వీర్రాజు ఫోకస్ :

 గతంలో బీజేపీ పవనాలు వీచినప్పుడు కాకినాడ, రాజమండ్రి, నర్సాపురంలో ఆ పార్టీ గెలిచింది. కాపు సామాజిక వర్గాన్ని ఓటు బ్యాంకుగా మర్చుకునే ప్రయత్నం చేస్తున్న కమలం పార్టీ..పోలింగ్ బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. అంతర్వేదిలో రథం తగులబడిన ఘటనపై రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టడం వెనక గోదావరి జిల్లాల్లో పార్టీని బలోపేతం చేసే వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడి ప్రజాసమస్యలతో పాటు ప్రభుత్వ లోపాలపై పోరాటాలు చేయడం ద్వారా జనాల దృష్టిని ఆకర్షించాలన్నది ఎత్తుగడగా కనిపిస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఆందోళనలు ఎగసిపడుతుండటంతో..ఉభయ గోదావరి జిల్లాలపై సోము ఫోకస్‌ చేసినట్లు ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. జనసేనతో కలిసి పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ క్యాడర్‌కు సోము వీర్రాజు పిలుపునిస్తున్నారట. జగన్‌ ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలపై ప్రజాక్షేత్రంలో ముమ్మర పోరాటాలు చేయాలని దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.

కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలని ఉందా..అయితే  www.jaanojaago.com లోకి విజిట్ చేయండి...కొత్త కొత్త విషయాలను తెలుసుకోండి. 1, 2, 3, 4,...ఇలా పేజీలు తిరగేయండి. కొత్త కొత్త కథనాలు చదవండి

 పోరాటాల ఫలితమే భవనాల కేటాయింపు

ముస్లిం ప్రజా సంఘాలు

తమ పోరాట ఫలితంగానే నంద్యాల ఉర్దూ కళాశాల భవనాలు మంజూరయ్యాయని నంద్యాల ప్రజా సంఘాల నేతలు పేర్కొన్నారు. ప్రజా సంఘాల నేతలు అబ్దుల్ సమద్, మస్తాన్ వలి, బాబ ఫకృద్దీన్, ముహమ్మద్ రఫీ, మౌలానా సలాం, మస్తాన్ ఖాన్, సద్దాం హుసేన్ పేర్కొన్నారు. నంద్యాలలో ఉర్దూ కళాశాల మంజూరైన రెండు సంవత్సరాలుగా భవనాలు కేటాయించలేదు. ఒక దశలో కళాశాలను మూసివేస్తారని విధ్యార్ధుల తల్లిదండ్రులు అసహనానికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో జమాఆతె ఇస్లామి హింద్, ఆవాజ్, ఇన్సాఫ్, పీడియస్యూ మైనార్టీ సెల్, యంఐయం,యూఐయంయల్, కాంగ్రెస్ మైనార్టీ సెల్, యస్ఐఒ ముస్లిం ప్రజా సంఘాలు సోమవారం భూక్ హర్తాళ్ నిర్వహించి దశలవారి కార్యచరణ ప్రకటించారు. దీనితో అధికారులు స్పందించి తాత్కాలికంగా టెక్కె మున్సిపల్ పాఠశాల కేటాయించారు. ఏమైన పోరాట ఫలితంగా ఉర్దూ కళాశాలకు బిల్డింగ్ చూపటం స్వాగతిస్తున్నామని అబ్దుల్ సమద్, మస్తాన్ వలి, బాబ ఫకృద్దీన్, ముహమ్మద్ రఫీ, మౌలానా సలాం, మస్తాన్ ఖాన్, సద్దాం హుసేన్ తదితరులు పాల్గొన్నారు. నంద్యాలకు మంజూరైన ప్రధాన మంత్రి జనవికాస్ కార్యక్రమం కింద మంజూరైన పథకాలు సైతం అమలుకు పూనుకోవాలని తెలిపారు.

కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలని ఉందా..అయితే  www.jaanojaago.com లోకి విజిట్ చేయండి...కొత్త కొత్త విషయాలను తెలుసుకోండి. 1, 2, 3, 4,...ఇలా పేజీలు తిరగేయండి. కొత్త కొత్త కథనాలు చదవండి

 టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ‘చిత్రపటం’

కవి ఫిల్మ్ సిటీ సమర్పణలో, శ్రీ క్రియేషన్స్ పతాకంపై పార్వతీశం(నూకరాజు), శ్రీవల్లి హీరోహీరోయిన్లుగా ప్రముఖ దర్శకుడు బండారు దానయ్య కవి దర్శకత్వంలో, పుప్పాల శ్రీధర్ రావు నిర్మిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘చిత్రపటం’. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ప్రస్తుతం టాకీ పార్టు పూర్తి చేసుకుంది. 


 

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు బండారు దానయ్య కవి మాట్లాడుతూ.. ‘‘విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో జరిగే యూత్ & ఫ్యామిలీ సబ్జెక్ట్ ఇది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అందమైన లోకేషన్లలో చిత్రీకరణ జరిపాం. కోట శ్రీనివాసరావు కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే పోసాని, శరణ్యగారు, నారెన్, బాహుబలి ప్రభాకర్ వంటి సీనియర్ ఆర్టిస్టులందరూ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేసే అంశాలతో, యూత్‌ని ఆకట్టుకునే సంగీతంతో ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను. అలాగే నెక్స్ట్ షెడ్యూల్‌లో పాటల చిత్రీకరణ జరపనున్నాం..’’ అని అన్నారు.

చిత్ర నిర్మాత పుప్పాల శ్రీధర్ రావు మాట్లాడుతూ.. ‘‘మా డైరెక్టర్ కవిగారు సినీ ఇండస్ట్రీలో పాటల రచయితగా అందరికీ సుపరిచితమైన వ్యక్తే. ఆయన చెప్పిన కథ అద్భుతంగా ఉంది. అలాగే ఆయన సినిమా తీస్తున్న విధానం ముచ్చటేస్తుంది. శరవేగంగా షూటింగ్ చేస్తూ నిర్మాతల మనిషి అనిపించుకుంటున్నాడు. మా సినిమాలో సీనియర్ ఆర్టిస్టులందరూ నటిస్తున్నారు. టాకీ పార్ట్ ఫినిష్ అయ్యింది. నెక్స్ట్ మంత్‌లో ఓ ప్రముఖ ఆడియో కంపెనీ ద్వారా పాటలను ఆవిష్కరించనున్నాం’’ అని అన్నారు.


 

పార్వతీశం, శ్రీవల్లి, కోట శ్రీనివాసరావు, బాలాచారి (‘విద్యార్థి’ సినిమా డైరెక్టర్) పోసాని, శరణ్య, నారెన్, బాహుబలి ప్రభాకర్, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎస్. మురళీ మోహన్ రెడ్డి, ఎడిటర్: వినోద్, డిజైనర్: అజయ్, పి.ఆర్.ఓ: బి. వీరబాబు, నిర్మాత: పుప్పాల శ్రీధర్ రావు; కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం: బండారు దానయ్య కవి.

కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలని ఉందా..అయితే  www.jaanojaago.com లోకి విజిట్ చేయండి...కొత్త కొత్త విషయాలను తెలుసుకోండి. 1, 2, 3, 4,...ఇలా పేజీలు తిరగేయండి. కొత్త కొత్త కథనాలు చదవండి

 భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనాలు ఎన్నో

భగత్ సింగ్ కుటుంబానికి మౌలానా హబీబర్ రెహ్మాన్ ఆశ్రయం

తమ పూర్వికులను ఆశ్రయమిచ్చిన ఇంటిని ఇప్పటికీ భగత్ సింగ్ కుటుంబం సందర్శిస్తోంది

ఇదే మన భారతదేశ గొప్పతనం

भगत सिंह के परिवार को शरण देने वाले मौलाना हबीबुर्रहमान लुधियानवी 



భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అని నేటికీ ప్రపంచ వ్యాప్తంగా కథలు కథలుగా చెప్పుకోవడానికి కారణం ఏమిటీ...దానికి  ఓ లెక్క ఉంది. భారతదేశ గడ్డపైన పుట్టిన ప్రజలు వివిధ మతాలు, ఆచారాలను కలిగివున్నా ఒకరినొకరు సోదరభావంతో మెలగడమే. ఇలాంటి ఎన్నో ఘటనలకు నెలవు మన భారతగడ్డ. హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు ఇలా భారతదేశంలని అన్ని వర్గాలు ఏకమవ్వడం వల్లే మన దేశానికి స్వాతంత్య్రం సిద్దించింది. ఇది బ్రిటీష్ వారు సైతం అంగీకరించే సత్యం. అందుకే భారతదేశ స్వాతంత్య్ర సాధనలోనే కాదు నాటికి, నేటికీ ఏనాటికైనా నా దేశం భిన్నత్వంలో ఏకత్వమే. బ్రిటీషర్ల గుండెల్లో రైళ్లు పడిగెత్తించిన మన పోరాట యోధుడు భగత్ సింగ్. అలాంటి భగత్ సింగ్ కుటుంబానికి కష్టకాలంలో ఆశ్రయం కల్పించింది మరో స్వాతంత్య్ర పోరాట యోధుడు మౌలానా హబీబర్ రెహ్మాన్. ఇది మన దేశంలోని భిన్నత్వంలోని ఏకత్వానికి నిదర్శనం.

భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రాణాలర్పించి నేటికీ, ఏనాటికి భారతీయులకు స్పూర్తిదాతలుగా నిలిచిన వారిలో భగత్ సింగ్ ఒకరు. ఆయన్ని షాహీద్ ఎ అజామ్ కూడా అంటారు. స్వాతంత్ర్య పోరాటంలో, అతని ఆలోచనలు యువతను ఉత్తేజపరిచాయి. సర్దార్ భగత్ సింగ్, ఆయన త్యాగాలు యావత్తు దేశం నేటికీ స్మరించుకొంటోంది. 

భగత్ సింగ్ భారతదేశంలో యువతకు రోల్ మోడల్. అతను దుష్ట ఆంగ్ల పాలనకు తలవంచడానికి నిరాకరించారు. ధైర్యంగా విప్లవాత్మకంగా  పోరాడారు. సర్దార్ భగత్ సింగ్ గురించి చాలా కథలు ఉన్నాయి. 1929 లో, బ్రిటిష్ ప్రభుత్వం భగత్ సింగ్ పట్ల కర్కశయంగా వ్యవరించినది. పార్లమెంట్  సెంట్రల్ హాల్ (సెంట్రల్ హాల్) లో భగత్ సింగ్ బాంబులు విసిరినప్పుడు  బ్రిటిషర్లు భగత్ సింగ్ కుటుంబం. వారి సన్నిహితుల పై నిర్దయతో కక్షపురిత చర్యలను ప్రారంభించారు.


 

ఆ సమయంలో పంజాబ్లో చాలా ప్రభావవంతమైన మౌలానా హబీబుర్రహ్మాన్ కస్మి తన ఇంటిలో భగత్ సింగ్ కుటుంబానికి ఆశ్రయం ఇచ్చారు. వారు ఒక నెలకు పైగా మౌలానా హబీబ్ ఇంట్లో  అతిథిగా ఉన్నారు. మౌలానా హబీబర్ రెహ్మాన్ కూడా ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రబోస్‌తో సన్నిహితంగా ఉండేవారు. భారత జాతీయ ఉద్యమం లో ముఖ్యమైన పాత్ర పోషించాడు. మౌలానా హబీబ్-ఉర్-రెహ్మాన్ లుధియాన్వి ఒక అరేన్ (తెగ) కు చెందినవాడు మరియు 1857 నాటి భారత తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ వలసరాజ్యాల పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు జరిపిన స్వాతంత్ర్య సమరయోధుడు షా అబ్దుల్ ఖాదిర్ లుధియాన్వి యొక్క ప్రత్యక్ష వంశస్థుడు.

1857 నాటి భారత తిరుగుబాటు సమయంలో హబీబ్-ఉర్-రెహ్మాన్ లుధియాన్వి తాత షా అబ్దుల్ ఖాదిర్ లుధియాన్వి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీపై సాయుధ తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు మరియు పంజాబ్ నుండి వారిపై తిరుగుబాటు చేసిన వారిలో మొదటివాడు. అతను ఒక పెద్ద పోరాట శక్తిని సేకరించి బ్రిటిష్ వారిని లూధియానా నుండి మాత్రమే కాకుండా పానిపట్ నుండి కూడా తరిమికొట్టాడు. ఈ పోరాట శక్తిలో ముస్లింలు, హిందువులు మరియు సిక్కులు ఉన్నారు. మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్‌కు మద్దతుగా దిల్లికి వెళ్లారు. అతను 1857 లో డిల్లి లోని చాందిని చౌక్ వద్ద వేలాది మందితో కలిసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తన ప్రాణాలను త్యాగం చేసినాడు..

మౌలానా హబీబ్-ఉర్-రెహ్మాన్ లుధియాన్వి 3 జూలై 1892 న పంజాబ్ లోని లుధియానాలో జన్మించారు. మౌలానా హబీబ్-ఉర్-రెహ్మాన్ లుధియాన్వి మౌలానా అబ్దుల్ అజీజ్ కుమార్తె బీబీ షఫతున్నిసాను వివాహం చేసుకున్నారు.. 

ఆయన భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు. ఖిలాఫత్ ఉద్యమం మరియు నాన్ కో ఆపరేషన్ ఉద్యమంలో మౌలానా చాలా చురుకుగా పనిచేశారు. మౌలానా హబీబుర్ రెహ్మాన్ 1921 డిసెంబర్ 1 న మొట్టమొదటసారి  అరెస్టు చేయబడ్డాడు. లూధియానాలో వారి ఉత్తేజకరమైన ప్రసంగాల  వల్ల, అక్కడి ప్రజలు  బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు, ఆ తర్వాత అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపారు. వారు 14 సంవత్సరాలు దేశంలోని అనేక  జైళ్లలో  గడిపారు మరియు హింసను అనుభవించారు. 

మౌలానా బంధువులు కూడా జాతీయోద్యమం లో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు, స్వాతంత్ర్య సమరయోధురాలు అయిన  అయిన మౌలానా భార్య షఫతున్నిసా బీబీకూడా జాతీయోద్యమం లో పాల్గొని   బ్రిటిష్ పోలీసుల చేతిలో  క్రూరమైన అణచివేతకు గురి అయినారు.. 

జమైత్-ఉల్-ఉలామా-ఎ-హింద్‌లో కీలక పాత్ర పోషించిన లుధియాన్వి  ఒక విప్లవ వక్త మరియు భారతదేశంలో బ్రిటిష్ పాలనను అంతం చేయాలనుకున్న జాతీయవాద ఉద్యమం మజ్లిస్-ఎ-అహ్రార్-ఉల్-ఇస్లాం(1920) (ది సొసైటీ ఆఫ్ ఫ్రీమెన్)  వ్యవస్థాపకులలో ఒకరు.వారు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సలహా ప్రకారం ఈ పని చేసినారని మౌలానా అంతరంగికుల వాదన.ఈ సమయంలో లుదియానా లో జరిగిన ఒక సంఘటన వారిన్ని దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందేటట్లు చేసింది.

 

మౌలానా హబీబ్ 3 జూలై 1892 న లుధియానాలో జన్మించారు. ఆయన భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు. ఖిలాఫత్ ఉద్యమం మరియు సహకారేతర ఉద్యమంలో మౌలానా చాలా చురుకుగా పనిచేశారు. మౌలానా హబీబుర్ రెహ్మాన్ 1921 డిసెంబర్ 1 న మొట్టమొదటసారి  అరెస్టు చేయబడ్డారు. లూధియానాలో వారి ఉత్తేజకరమైన ప్రసంగాల  వల్ల, అక్కడి ప్రజలు  బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు, ఆ తర్వాత అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపారు. వారు 14 సంవత్సరాలు దేశంలోని అనేక  జైళ్లలో  గడిపారు మరియు హింసను అనుభవించారు.  1929 లో మజ్లిస్ ఎ అహ్రార్ పార్టీని మౌలానా హబీబర్ రెహ్మాన్ స్థాపించినారు. వారు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సలహా ప్రకారం ఈ పని చేసినారని మౌలానాఅంతరంగికుల వాదన.ఈ సమయంలో లుదియానా లో జరిగిన ఒక సంఘటన వారిన్ని దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందేటట్లు చేసింది. 

1929 లో, బ్రిటిష్ 'డివైడ్ అండ్ రూల్' విధానం ప్రకారం పంజాబ్‌లోని లుధియానాలోని గ్రాస్ మండి చౌక్ వద్ద హిందువులు మరియు ముస్లింల కోసం వేరు వేరు గా నీటి కుండల ఉంచారు. మౌలానా  మౌలానా హబీబర్ రెహ్మాన్ దానిని తీవ్రంగా వ్యతిరేకించారు. "సబ్కా పానీ ఏక్ హై" పేరుతో ఒక ప్రచారాన్ని ప్రారంభించారు. ఇది దేశవ్యాప్తంగా  వ్యాపించింది. లూధియానాలో ఈ విషయంపై పెద్ద నిరసన జరిగింది, ఇందులో పండిట్ నెహ్రూ కూడా పాల్గొన్నారు.

మౌలానా హబీబర్ రెహ్మాన్ ఎల్లప్పుడూ బ్రిటిష్ వారికి తలనొప్పి కల్గించేవారు.. 1931 లో, లుధియానాలోని రాయల్ జామా మసీదు సమీపంలో వందలాది బ్రిటిష్ అధికారుల సమక్షంలో వారు  భారత జెండాను ఎగురవేసారు. వారిని ఆపడానికి భారీ పోలీసు బలం కూడా చేరుకుంది. వారిని  అరెస్టు చేశారు. బ్రిటీష్ ప్రభుత్వం, వారిని సిమ్లా, మనాలి, ధర్మశాల, ముల్తాన్, లూధియానాతో సహా వివిధ జైళ్లలో 14 సంవత్సరాలు ఉంచారు.మౌలానా హబీబర్ రెహ్మాన్ 2 సెప్టెంబర్ 1956 న మరణించారు. అప్పటి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఆయనకు సన్నిహితులు అని చెబుతారు. నెహ్రు అభ్యర్థన మేరకు మౌలానా హబీబర్ రెహ్మాన్‌ను డిల్లి లోని జామా మసీదు సమీపంలోని స్మశానవాటికలో ఖననం చేశారు.  ఈ సమాచారం అంతా ప్రసిద్ధ చరిత్రకారుడు మాస్టర్ తారా సింగ్ రాసిన 'హిస్టరీ ఫ్రీడమ్ మూవ్మెంట్ ఇన్ ఇండియా' పుస్తకంలో ఉంది. మాస్టర్ తారా సింగ్ కూడా మౌలానాకు సన్నిహితులు.

మౌలానా హబీబర్ రెహ్మాన్ మనమడు లూధియానాలోని షాహి జామా మసీదు ఇమామ్ మౌలానా హబీబుర్రహ్మాన్ కస్మిII ప్రకారం, సర్దార్ భగత్ సింగ్ కుటుంబ వాసులు ఇప్పటికీ నాడు తమ పూర్వికులకు ఆశ్రయం కల్పించిన ఆ ఇంటిని సందర్శిస్తారు. తమ పూర్వీకులు చెప్పిన సమాచారాన్ని గుర్తు చేసుకొంటారు. భగత్ సింగ్ సోదరుడి కుమారుడు సంధు కూడా తరచుగా ఇక్కడకు వస్తాడు. అతను అభిప్రాయంలో మౌలానా హబీబుర్రహ్మాన్ గొప్ప వ్యక్తి నిజమైన దేశభక్తుడు. వారి కుటుంభ దేశబక్తులగల  కుటుంభం అని అంటాడు..

-Twocircles.net సౌజన్యం తో

✍️ రచయిత-సల్మాన్ హైదర్ 

కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలని ఉందా..అయితే  www.jaanojaago.com లోకి విజిట్ చేయండి...కొత్త కొత్త విషయాలను తెలుసుకోండి. 1, 2, 3, 4,...ఇలా పేజీలు తిరగేయండి. కొత్త కొత్త కథనాలు చదవండి

 ఇవి పాటిస్తే...మీరే.. 

సమర్థులైన నిర్వాహకులు..నాయకులు

దివ్య ఖురాన్ లో మేనేజ్మెంట్  సూత్రాలు



దైనందిన జీవితంలో మంచి మార్గంలో నడపటమే కాదు అన్నిరంగాల్లో తమ సమర్థత నిరూపించుకొనే మార్గం నిర్దేశం కూడా ఇస్లాం చేస్తోంది. ఇది ఏకైక మార్గంగా ఖురాన్ అని చెబుతోంది. ఇస్లాం ను ప్రపంచజనాభా లో    దాదాపు 23%మంది జనాబా ప్రపంచవ్యాప్తం గా  160 కోట్ల మంధి  ప్రజలు అనుసరిస్తున్నారు. ఇస్లాం ఒక మతమే కాదు, అది ఒక జీవన విధానం అని చెప్పవచ్చును. అల్లాహ్ చే అవతరింపబడిన అంతిమ గ్రంధం అయిన  దివ్యఖురాన్ లో అన్నీ సమస్యలకు అనగా వ్యక్తిగత, ఆర్థిక, రాజకీయ లేదా వ్యాపార సమస్యలకు  సమాధానాలు పొందవచ్చును. దివ్య ఖురాన్  మనవాళికి సంపూర్ణ విజ్ఞానాన్ని, మార్గదర్శకత్వాన్ని  అంధించే గ్రంథం. దివ్య ఖురాన్  మానవ జీవితం లోని అన్నింటికీ సమాధానాలు చెప్పే, భోదించే, మార్గదర్శకం చూపే దేవుని చేత అవతరింప బడిన సమగ్ర గ్రంధం అని చెప్పవచ్చును.


 

1500 సం. లకు పూర్వమే  ఇస్లాం మేనేజ్మెంట్ సూత్రాలను వివరించినది. మేనేజ్మెంట్ పై వ్రాయబడిన అతి ఉత్తమ గ్రంధం గా  దివ్య ఖురాన్ ను పరిగణించవచ్చును. ఆధునికాలం లో ముఖ్యమైన శాస్త్రంగా పరిగణించబడే  మేనేజ్మెంట్,  దివ్య ఖురాన్ నుండి గ్రహించబడినది. 16,17 శతాబ్ధాలలో ప్రచారం లోనికి వచ్చిన అనేక ఆధునిక మేనేజ్మెంట్ సూత్రాలను 14 శతాబ్ధాల క్రిందనే దివ్య ఖురాన్ ప్రకటించినది.  దివ్య ఖురాన్ లోని  దాదాపు 300 ఆయతులు మేనేజ్మెంట్ సూత్రాలను వివరిస్తాయి. 


 

ఇస్లామిక్ మేనేజ్మెంట్ కు ముఖ్య ఆధారాలుగా దివ్య ఖురాన్ సున్నత్ అనగా హదీసులను పరిగణించవచ్చును. సంస్థలకు , ప్రజలకు  సరియైన మార్గం చూపే విధానంగా ఇస్లామిక్ మేనేజ్మెంట్ ను పరిగణించవచ్చును. నాయకులు, వివిధ సంస్థల ఆదిపతులు ఇస్లామిక్ మేనేజ్మెంట్ సూత్రాలను పాటించటం ద్వారా తమ అనుచరులలో ఏకత్వాన్ని సాదించి, సంస్థ ప్రతిష్టను, దాని గుణాత్మక విలువను పెంచవచ్చును. 


 

ఇస్లామిక్ మేనేజ్మెంట్ సూత్రాలుగా క్రింది వాటిని వివరించవచ్చును.

1. నిజాయితీ 2. నైపుణ్యం 3. దేశభక్తి 4. సరియైన స్థానం లో సరైన వ్యక్తి , 5. క్రమశిక్షణ 6. పని విభజన 7. ఆజ్ఞా ఏకత్వం 8.కేంద్రీకరణ – వికేంద్రీకరణ 9. సంస్థ శ్రేయసుకు ప్రదమ ప్రాధాన్యత 10. సరియైన వేతనం 11. ఆర్థిక వ్యవస్థ 12. అందరికీ సమ  న్యాయం 13. సమిష్టి ప్రయత్నాలు 14. శ్రమ విలువ 15. మినహాయింపు 16. జవాబుదారీ తనం 17. అల్లాహ్ అందు విశ్వసముంచుట –తవక్కుల్ 

 ఇస్లామిక్ మేనేజ్మెంట్ లక్షణాలు 

 ఇస్లామిక్ మేనేజ్మెంట్ ప్రాధమిక పునాదులుగా దివ్య ఖురాన్, హదీసు, లను పేర్కొనవచ్చును. అదే విదంగా ప్రవక్త (స.ఆ.స.) మరియు వారి సహచరులను ఇస్లామిక్ మేనేజ్మెంట్ కు నిజమైన ప్రతినిదులు గా భావించవచ్చు. ఆర్థిక అబివృది ఇస్లామిక్ మేనేజ్మెంట్ యొక్క అంతిమ లక్ష్యం కాదు.పరలోక సంక్షేమానికి మేనేజ్మెంట్ సూత్రాలను ఉపయోగించుకోవాలి. కార్మికులతో మంచి సంబంధాలను గలిగి , సమూహ భావనను ప్రోత్సహించవలెను. నాయకునికి, అంతిమ దైవం అల్లాహ్ కు జవాబుదారీ తనం వహించవలసి ఉంటుంది. అల్లహ ప్రతినిది గా మాత్రమే నాయకుడిని భావించాలి. ఆస్తి అల్లాహ్ చే ప్రజలకు ఇవ్వబడిన ట్రస్ట్ గా భావించాలి. సంప్రదింపుల ద్వారానే నిర్ణయాలు తీసుకొన బడాలి. పదవిలో ఉన్న వారు దురాశతో , ఆ స్థానాన్ని దుర్వినియోగ పరచరాదు. శాంతి, అబివృద్ధి,ఇతర సౌకర్యాల కల్పనకు ఇస్లామిక్ మేనేజ్మెంట్ ఉపయోగ పడును.  ఇస్లామిక్ మేనేజ్మెంట్ సూత్రాలు వ్యక్తిగత,కుటుంబ,సామాజిక,ఆర్థిక,రాజకీయ సంస్థలకు వర్తించును.మత, నైతిక సూత్రాలకు వ్యతిరేకం గా కపటం,అనుకరణ పనికి రాదు. నిర్వహణ అనేది ఒక విశ్వవ్యాప్త భావన అందులో ఆలోచనకు,ప్రకటనకు స్వేశ్త్చ కలదు. స్పర్ధ లేదా పోటీ తత్వం అనేది  మంచి పనులు చేయుటకు ఉపయోగపడే సాధారణ పద్దతి.


 

దివ్య ఖురాన్ లో ఆధునిక మేనేజ్మెంట్ లేదా నిర్వహణ సూత్రాలు.

1.పనులను ఇతరుల చేత నిర్వహింప చేయడం గా మేనేజ్మెంట్ ను నిర్వచించవచ్చు.- ఇతరుల ద్వారా పనులను నిర్వహింప చేసే అదికారిగా, మేనేజర్ ను చెప్పవచ్చును. ఏమి చేయాలో తెలిసిన మరియు ఇతరుల ద్వారా ఎలా చేయిచాలో తెలిసిన  అదికారిగా మేనేజర్ ను చెప్పవచ్చును.      

దివ్య ఖురాన్ ప్రకారం “వారిలో కొందరికి మరి కొందరిపై అంతస్తులవారిగా ఆదిక్యం ఇచ్చాము. వారు ఒకరునొకరిని సేవించుకోవటానికి”. –(43;32) 

ఆధునిక మేనేజ్మెంట్ తత్వాన్ని, గమనాన్ని   ఈ ఆయత్ ద్వారా తెలుసుకోవచ్చును. వ్యక్తి క్షమత లేదా శక్తి  ఆధారం గా అనుకూలమైన క్రమానుగత శ్రేణి ని ,బాద్యతల విభజనను, తెలుసు కోవచ్చును .

 2.మేనేజ్మెంట్ మరొక ముఖ్య లక్షణం నాయకత్వం

నాయకుడు లేని సమూహం, (సాధారణం గా జరిగే  సమూహ నిర్ణయానికి లేదా సమూహం చేసి పనికి  వ్యతిరేకం గా)  తన ఇష్ట మొచ్చినట్లుగా ప్రవర్తించును.

ముగ్గురు వ్యక్తులు కలసి ప్రయాణించేటప్పుడు, వారు తమలో ఒకరిని నాయకుని గా ఎన్నుకోవాలి.- అబూ దావూద్  హదీసు సంఖ్య 2608. పై హదీసు ద్వారా నాయకత్వ ప్రాధాన్యతను గమనించవచ్చు.

3.మేనేజ్మెంట్ మరొ ముఖ్య సూత్రం సమూహ చర్చలు. 

జపాన్ దేశస్తులు సమూహ చర్చలకు (షూరా) గల ప్రాధాన్యతను గుర్తించినప్పుడు, దాని అవశ్యకతను మిగతా ప్రపంచం కూడా గుర్తించినది.

దివ్య ఖురాన్ లో ఈ భావనను వివరించడమైనది.

“.......తమ వ్యవహారాలను పరస్పర సంప్రదింపుల ద్వారా నడుపుకొనే వారికోసం ”.- 42;38 

“వారి తప్పులను  మన్నించు,వారిని క్షమించు అని అల్లాహ్ ను ప్రార్దించు. ధర్మానికి సంబందించిన పనిలో వారిని కూడా సంప్రదించు. ఐతే ఒక నిర్ణయాన్ని తీసుకొని దాన్ని అమలు పరచటానికి సంకల్పించినపుడు అల్లాహ్ పై భారం వేయి. తననే నమ్ముకొని పని చేసే వారంటే అల్లాహ్ కు ఎంతో ఇష్టం”. – 3;159

ఇస్లాం సామాజిక జీవితం నుంచి ఈ సూత్రాన్ని గ్రహించవచ్చు. ప్రవక్త (స.ఆ.స.) భోదనలను ఆలకించేటప్పుడు.యుద్దాలలో పాల్గొనేటప్పుడు, ప్రవక్త అనుచరులు(సాహబా) ఈ సూత్రాన్ని పాటించే వారు. 

4. అదికార వ్యవస్థ పట్ల గౌరవం, విధేయత ఇతరులనుంచి పనిని పొందుటకు మరియు పని నిర్వహించుటకు గౌరవం మరియు విదేయత అనేవి  ముఖ్య మూల సూత్రాలు. న్యాయ బద్ధమైన,సరియైన  ఆజ్ఞాలను పొంది వాటిని బాద్యతాయుతంగా నెరవేర్చుట పని పొందిన వారికి ఆవశ్యకం. 

దివ్య ఖురాన్ ప్రకారం “విధేయత చూపండి అల్లాహ్ కు, విధేయత చూపండి ప్రవక్తకు, మిలొ అదికారం అప్పగించబడిన పెద్దలకు” – 4;59.

5. అందరికీ సమానవకాశాలు

అందరకు సమానవకాశాలు అనగా  సంస్థలోని అందరూ సబ్యులకు సమానంగా ,తగినంతగా ఎదగాటానికి, అదేవిదంగా ప్రతిఫలం పొందటానికి అవకాశం కల్పించవలయును .

“మానవులారా!మేము మిమ్మల్లి ఒకే పురుషునినుండి, ఒకే స్త్రీ నుండి సృజించాము. తరువాత మీరు ఒకరినొకరు పరిచయం చేసుకొనేందుకు మిమ్మల్లి జాతులుగాను, తెగలు గాను చేశాము.వాస్తవానికి మేలో అందరికంటే ఎక్కువభయభక్తులు కలవాడే, అల్లాహ్ దృష్టి లో ఎక్కువ  గౌరవపాత్రుడు, నిశ్చయంగా అల్లాహ్ సర్వ జ్ఞానం కలవాడు.సకల విషయాలు తెలిసిన వాడు.” -49;13

 అధికత్వం, బాద్యత కలిగిఉండటం అల్లాహ్ దృష్టి లో భయబక్తులకు,గౌరవ పాత్రతకు(తక్వాకు)  చిహ్నం.

6. ప్రేరణ మరియు నిశ్చయం–

పని చేయాలనే నిశ్చయం ప్రేరణకు దారి తీస్తుంది. ఒక మేనేజర్ తన క్రింది  ఉద్యోగులతో వ్యవహరించే తీరు అతని నిశ్చయ శైలి, మరియు అతను కల్పించే ప్రేరణపై అధారపడి ఉండును.

దివ్య ఖురాన్ లో ఈ బంగారు సూత్రాన్ని పొందుపర్చటం జరిగింది.

“ప్రవక్త! నేవే గనుక కర్కశుడువు,కఠిన హృదయుడవు అయినట్లైతే వారందరూ నీ చుట్టుపక్కలనుండి దూరంగా పోయేవారు. వారి తప్పులను మన్నించు , వారినిక్షమించు అని అల్లాహ్ ను సంప్రధించు. ధర్మానికి సంభందించిన  పనిలో వారిని కూడా సంప్రదించు”. – 3;159

క్రింది ఉద్యోగులలో ప్రేరణ మరియు పని పట్ల నిబద్ధతను కల్పించుటను  పై ఆయత్ తేటతెల్లం చేయు చున్నది.

7. ఆజ్ఞా ఏకత్వం –

తన అధికారులను, కార్మికులను నడపడానికి సంస్థ ఒకే ఆచరణాత్మక వ్యూహం ను కలిగి ఉంటుంది.  

“ఒకవేళ ఆకాశంలో, భూమిలో ఒక్క అల్లాహ్ తప్ప ఇతర  దేవుళ్ళు కూడఉంటే, అప్పుడు (భూమ్యాకాశాల)రెంటింటి వ్యవస్థ చిన్న బిన్నమై ఉండేదిది”. -21;22

పైన వివిరించిన ఆయత్ ఆజ్ఞా ఏకత్వాన్ని, సరియైన మార్గదర్శకాన్ని చూపుతుంది.

8. వ్యక్తి కన్నా సంస్థ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యానతను ఇచ్చుట –

ఒక సంస్థ ప్రయోజనాల కన్నా వ్యక్తి లేదా వ్యక్తుల సమూహా ప్రయోజనాలు అధికం కాదు. ఇస్లాం అనగా శాంతి, ముస్లిం అనగా తన్ను తాను భగవంతునికి సమర్పించుకొనుట. 

“తనకు కావలసినదే, తన సోదరునికి కూడ కావాలనే కోరుకొనేవాడే నిజమైన  నిజాయతిపరుడు అన్న విషయాన్ని నా జీవితం మీద అధికారం ఉన్న వాని సాక్షిగా ప్రమాణం చేయు చున్నాను” అని ప్రవక్త (స.ఆ.స.)అన్నారు. –హదీసు-బుఖారి.

9. పనికి తగిన సరియైన వేతనము-

 కార్మికులు తమ శ్రమ కు తగిన సరియైన మరియు సంతృప్తి కరమైన వేతనం పొందాలి.

“కార్మికుని చెమట ఆరక ముందే అతని వేతనం చెల్లించాల” అని ప్రవక్త (స.ఆ.స.) అన్నారు. 

ఇది కార్మికులను, ఉద్యోగులను సంతృప్తి పరుస్తుంధి. 

10. వృధాను అరికట్టుట –

ముడి సరుకు,మానవ శక్తి, ఇందనము, యంత్రపరికరాల ఉపయోగం లో వృధాను అరికట్ట లేక పోయిన వ్యయం పెరిగి, లాభాలు తగ్గును. ఆధునిక కాలం లో టొయోటా సంస్థ ఈ సూత్రాన్ని పాటించి అత్యంత లాభాలు సాదించే తయారీ సంస్థ గా రూపొందినది. 

దివ్య ఖురాన్ లో వృధాను, అనవసర ఖర్చును తగ్గించే ఆదేశాలు ఇవ్వబడినాయి.

“ఆదాము సంతానామా! ప్రతి ఆరాదనా సమయంలో మీ వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ వహించండి. తినండి, త్రాగండి, అల్లాహ్ మితిమీరిన వారిని ప్రేమించడు” – 7-31

“బంధువుల పట్ల మీ విధులను నిర్వహించండి. పేదవారిపట్ల, బాటసారులపట్ల, మీ విధులను నిర్వర్తించండి. వృధా ఖర్చు చేయకండి”. -17-26

“వృధా ఖర్చు చేసేవారు షైతాను సోదరులు, షైతాను తన ప్రభువునకు కృతగ్నుడు” – 17-27

పై ఆయతులు ముస్లింలను వృధా ఖర్చు చేయవద్దని ఆదేశించును.

11. మోయలేని భారమును  మోయుట – 

దివ్య ఖురాన్ లోని ఈ క్రింధి ఆయతులు అధిక భారం పై ఆదేశాలు ఇస్తున్నాయి.

“శక్తికి మించిన భారం ఎవరిమీదా మోపకూడదు”. – 2;233 

“ఏ ప్రాణి పైన అల్లాహ్ దాని శక్తి సామర్ధ్యాలకుమించిన బరువు బాద్యతలను మోపడు.......ప్రార్ధించండి ప్రభూ! ఏ బరువును మోసే శక్తి మాలో లేదో, దానిని మాపై పెట్టకు.” – 2;286

పైన వివరించ ఆయతులు ఏ వ్యక్తిని లేదా యంత్రాన్ని అధికంగా వినియోగించ వద్దని సూచించుతున్నాయి. అదే విధంగా పైన వివరించిన విషయాలు మానవ జీవితం లోని అన్నీ రంగాలకు, అన్నీ వృతులకు ఒక విధం గా  చెప్పాలంటే జీవన సత్యం(దీన్)  ను వివరిస్తున్నాయి.

12. సదా నాణ్యతా నిర్వహణ – 

వినియోగదారుని సంతృప్తి ఒక సంస్థ మనుగడకు, పెరుగుదలకు ఆవశ్యకం అన్నది జగమెరిగిన సత్యం. 

నాణ్యతా నిర్వహణ (quality management) ప్రస్తావన దివ్య ఖురాన్ లో కూడ కలదు. 

“తూకాన్ని, కొలతను పూర్తిగా పాటించండి. ప్రజలకు వారి వస్తువుల విషయం లో నష్టం కలిగించకండి”. 7;85

“నా జాతి ప్రజలారా! అల్లాహ్ ను ఆరాదించండి...... కొలుచుటలో, తూచుటలో తక్కువ చేయకండి.......నా జాతి సోదరులారా! కచ్చితంగా ,న్యాయం గా పూర్తిగా కొలవండి, తూచండి, ప్రజలకు వారి వస్తువులను తక్కువ చేసి ఇవ్వకండి.భూమి పై సంక్షోభవాన్నివ్యాపింప జేస్తూ తిరగకండి” 11;84-85. 

ఒక ముస్లిం వ్యాపారి దృస్టిలో వ్యాపారం అనేది కేవలం తన వినియోగదారులను, తన వ్యాపారాన్ని నిలబెట్టే మార్గం మాత్రమే , మిగతాది అల్లాహ్ చూసుకొనును. 

“ఇక ఐహిక సంపదనైతే, తాను కోరిన వారికి లెక్కలేకుండా ఇచ్చే అధికారం అల్లాహ్ కె ఉంది” 2-212

“అల్లాహ్ స్వయంగా ఉపాధి ప్రధాత, గొప్ప శక్తి సంపన్నుడు, అత్యంత ద్రుడమైన వాడు” 51-58

ప్రొఫెసర్ యాకుత్ కిర్బాస్ అబిప్రాయం లో ఆధునిక నాణ్యతా నిర్వహణకు (Modern Quality Management)  సంబందించిన అన్నీ విషయాలు దివ్య ఖురాన్ మరియు హదీసులలో లబించును.

13. ఇచ్చిన మాటను, వాగ్ధానములను, ఒడంబడికలను నిలబెట్టు కొనుట

 వ్యాపారం సక్రమంగా నిర్వహించాలంటే వ్యాపారి తను చేసిన వాగ్దానములను నిలబెట్టుకోవాలి. డాక్టర్ స్టీఫన్ ఆర్ కోవె అబిప్రాయం ప్రకారం వాగ్ధానభంగము వ్యాపారమును అతిత్వరగా నష్ట పరచును. 

దివ్య ఖురాన్ ముస్లింలకు వాగ్ధానం పై అనేక ఆదేశాలు ఇచ్చినది.

“విశ్వాసులరా!  కట్టుబాట్లను పూర్తిగా పాటించండి” – 5;1. 

“అల్లాహ్ సాక్షి గా చేసిన ప్రమాణాలను దృడపరచిన తరువాత భంగపరచకండి”.  16-91

“చేసిన వాగ్ధానాన్ని నెరవేర్చండి. నీస్సందేహంగా వాగ్ధానం విషయం లో మీరు సమాదానం చెప్ప వలసి ఉంటుది” – 17-34.

14. అవసరం మించి నిల్వ ఉంచుట – 

ఇస్లాం ప్రకారం ముస్లిం వ్యాపారి అవసరాన్ని మించి అధిక మొత్తాన్ని  నిల్వ ఉంచుట (hoarding) నేరము.  

దివ్య ఖురాన్ లోని ఈ క్రింది ఆయతులను పరిశీలించండి. 

“మేము అల్లాహ్ మార్గంలో ఏమి ఖర్చు పెట్టాలి? అని వారు అడుగుతారు. “మీ నిత్యవసరాలకు పొగా మిగిలినది “ అని నీవు వారికి చెప్పు.” -2-219

“వెండి, బంగారాలను పోగు చేసి వాటిని దైవ మార్గంలో ఖర్చు పేట్టని వారికి వ్యధాభరితమైన శిక్ష యొక్క శుభ వార్తను అంద జేయండి” 9-34.

15. చూడకుండా,పరిశీలించకుండా దేనిని నమ్మ వద్దు.

దివ్య ఖురాన్ ఆదేశం ప్రకారం ప్రతి ముస్లిం తాను పొందిన సమాచారం యొక్క నిజ నిజాలను స్వయం గా వెళ్ళి చూసి  నిర్ధారణ చేసుకోకుండా ఒక అబిప్రాయానికి లేదా నిశ్చయానికి రారాదు

“మీకు తెలియని విషయం వెంటపడకండి. నిశ్చయంగా కళ్ళు, చెవులు, మనసు అన్నింటి విషయంలోనూ విచారణ జరుగుతుంది”.  17-36

 అల్లాహ్ చే అవతరింపబడిన అంతిమ గ్రంధం అయిన  దివ్య ఖురాన్ లో అన్నీ సమస్యలకు అనగా వ్యక్తిగత,ఆర్థిక,రాజకీయ లేదా వ్యాపార సమస్యలకు  సమాధానాలు పొందవచ్చును. వాటిని మానవ జీవితంలోని సామాజీక,రాజకీయ, ఆర్థిక అంశాలకు అన్వయించవలసి ఉంటుంది. ఇస్లాం ప్రభోదించిన నిర్వహణా సూత్రాలు (management) సర్వ కాలాలకు, సర్వ దేశాలకు మరియు సర్వులకు వర్తించుతాయి. దివ్యా కొరాన్, హదీసులు చెప్పిన నిర్వహణా సూత్రాలను   గత 1600 సం. ల నుండి  అమలు పర్చటం జరుగుతుంది. 

  ప్రపంచీకరణ నేపద్యంలో ఒక ఉన్నతాధికారి (CEO)విశ్వ వ్యాప్తం గా ఉన్న తన సంస్థలను జాగ్రతగా, సమర్ధవంతం గా నిర్వ హించ వలసి ఉంటుంది. ఇస్లాం అందుకు అవసరమైన విజయవంతమైన నిర్వహణ సూత్రాలను అందించును. బిన్న మతవిశ్వాసాలు, బిన్న సంస్కృతులు ఉన్న,  ప్రపంచంలోని  అన్నీ ప్రాంతాల లోని అధికారులకు,క్రింది ఉద్యోగులకు  అవసరమైన నిర్వహణా సూత్రాలను ఇస్లాం అంద చేస్తుంది. దివ్య ఖురాన్, హదీసులలోని నిర్వహణ సూత్రాలు సదా శిరోధార్యం.

 రిఫరెన్సు   

• The Toyota Way by Jeffrey K. 

• Built to Last by Jim Collins. 

• The 8th Habit by Dr. Stephan R. Covey

• Henri Fayal’s 14 Principles of Management by Mohammad Saad -.

• Management in Islam by Javed Omar.

• Wikipedia.

• Modern Quality Management by Saudi Gazette

• Principles of Islamic Management by M A C S N O T E.

• The Inspired Manager, 40 Islamic Principles for Successful Management by Shabeer Ahmad and Maaz Gazdar .

• దివ్య ఖురాన్ – TIP-షేక్  హమీదుల్లా షరీఫ్

✍️ రచయిత-ముహమ్మద్ అజ్గర్ అలీ

రాజనీతి తత్వ శాస్త్ర అధ్యాపకులు 

రాజనీతి శాస్త్ర  శాఖాధిపతి(Rtd.) తెనాలి.

సెల్ నెం-94915-01910

కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలని ఉందా..అయితే  www.jaanojaago.com లోకి విజిట్ చేయండి...కొత్త కొత్త విషయాలను తెలుసుకోండి. 1, 2, 3, 4,...ఇలా పేజీలు తిరగేయండి. కొత్త కొత్త కథనాలు చదవండి

జాలిగా తిరిగేందుకు..

ఇపుడున్నది మామూలు పరిస్థితి కాదు

60 సంవత్సరాలు పై బడితే-అతిజాగ్రత్తగా ఉండాలి



ఏం చేద్దాం ఊరికే ఇంట్లో కూర్చుంటే ఏం తోచడంలేదు...అలా బయటికి తిరగేసి వస్తాను...ఏమైతే అది అవుతుంది అని కోవిడ్-19 వేళ తరుచూ ప్రతి ఒక్కరి నోటి నుంచి వచ్చే మాట. చిన్న పిల్లలు మొదలు పెద్ద వారి వరకు అందరిదీ ఇదే తంతు. మరి కరోనా వైరస్ ఇంకా అంతం కాని ఈ పరిస్థితుల్లో జాలిగా అలా బయట గడిపివద్దామనుకొంటే వెంటిలేటర్ ముచ్చట కూడా మీరు తెలుసుకోవాలి. మీరు ఈ కింద సూచించిన జాగ్రత్తలు జాగ్రత్తగా చదివారంటే ఇంటి నుండి బయటకేరారు! మరీ ముఖ్యంగా 60 ఏళ్లు పైనపడి ఉన్నవారు ఇంట్లోనే ఉండాలి. ఎటువంటి రిస్క్ తీసుకోకూడదు.


 

 వెంటిలేటర్ల గురించి తెలుసుకోండి.

 వెంటిలేటర్‌లో ఉండడం అంటే ఏమిటో అర్థం కానివారు, అడ్డంగా  తిరిగి మాల్స్ లేదా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్ వంటి రద్దీగా ఉండే ప్రదేశాల్లోకి వెళ్లేసి జాలీగా తిరిగి ఆనందం  పొందాలనుకునే వారు తెలుసుకోండి. మీరు తెలుసుకోవలసినదేమిటంటే, వెంటిలేటర్ నోటిపై ఉంచిన ఆక్సిజన్ మాస్క్ కాదు, రోగి హాయిగా పడుకుని పత్రికలు చదువుతు రిలాక్స్ గా ఉండేకి. అదేమీ ఆషామాషీ వ్యవహారం కాదు.


 

 కోవిడ్ -19 కోసం వెంటిలేషన్ అనేది బాధాకరమైన ఇంట్యూబేషన్ తో మొదలవుతుంది. ఇది మీ గొంతు ద్వారా క్రిందకు వెళ్లి మీరు జీవించే వరకు లేదా మీరు చనిపోయే వరకు అక్కడే ఉంటుంది.  ఇక అనస్థీషియా లో 2 నుండి 3 వారాల వరకు కదలకుండా, తరచుగా తలక్రిందులుగా, నోటి నుండి శ్వాసనాళం వరకు ఒక గొట్టంతో చొప్పించబడుతుంది. ఊపిరితిత్తుల యంత్రం యొక్క లయకు ఊపిరి పీల్చుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

రోగి మాట్లాడలేరు, తినలేరు, లేదా సహజంగా ఏమీ చేయలేరు - యంత్రం మిమ్మల్ని సజీవంగా ఉంచుతుంది అంతే.  దీని నుండి వారు అనుభవించే అసౌకర్యం మరియు నొప్పి అంతాఇంతకాదు, యంత్రానికి అవసరమైనంత కాలం ట్యూబ్ టాలరెన్స్ ఉండేలా వైద్య నిపుణులు మత్తుమందులు మరియు నొప్పి నివారణ మందులను ఇవ్వాలి.  ఇది కృత్రిమ కోమాలో ఉండటం లాంటిది.

ఈ చికిత్సలో 10-20 రోజుల తరువాత, ఒక యువ రోగి 40% కండర ద్రవ్యరాశిని కోల్పోతాడు. నోరు లేదా స్వర తంతువుల గాయం, అలాగే పల్మనరీ లేదా గుండె సమస్యలను పొందుతాడు.

ఈ కారణంగానే వృద్ధులు లేదా అప్పటికే బలహీనంగా ఉన్నవారు చికిత్సను తట్టుకోలేక చనిపోతారు.  మనలో చాలా మంది ఈ పడవలో ఉన్నారు ... కాబట్టి మీరు ఇక్కడ మునిగే అవకాశాన్ని పొందకూడదనుకుంటే తప్ప సురక్షితంగా ఉండండి.  ఇది ఫ్లూ కాదు.

మీ కడుపులోకి ఒక గొట్టాన్ని జోడించండి, మీ ముక్కు ద్వారా లేదా ద్రవ ఆహారం కోసం చర్మం ద్వారా, విరేచనాలు సేకరించడానికి మీ బట్ చుట్టూ ఒక స్టిక్కీ బ్యాగ్, మూత్రాన్ని సేకరించడానికి ఒక పైపు, ద్రవాలు మరియు మెడిసన్ ఇవ్వడాని కి IV లైను, మీ బిపిని పర్యవేక్షించడానికి ఒక లైన్  ప్రతి రెండు గంటలకు మీ అవయవాలను పునః స్థాపించడానికి మరియు మీ 104 ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడటానికి మంచు చల్లటి ద్రవాన్ని ప్రసరించే చాప మీద పడుకోపెట్టాలి.  చక్కగా లెక్కించిన మెడిసన్  మోతాదులు, నర్సుల బృందాలు, మరియు వర్కర్లు చాలామందిపై ఇది పూర్తిగా ఆధారపడి ఉంటుంది.  అందువల్ల, నా సీనియర్ సిటిజన్ స్నేహితులందరినీ నేను అభ్యర్థిస్తున్నాను, బయటకు వెళ్లవద్దు.

వ్యాప్తి ని ఆపండి, సురక్షితంగా ఉండండి, ఇంటి వద్దే ఉండండి మరియు బాగా సేఫ్ గా ఉండండి.

✍️ రచయిత-డాక్టర్ సి. ప్రభాకర రెడ్డి MS MCh (CTVS)

గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు 

కర్నూలు. ఆంధ్రప్రదేశ్,

కోవిడ్ కమాండ్ కంట్రోల్ ప్రత్యేక అధికారి

కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలని ఉందా..అయితే  www.jaanojaago.com లోకి విజిట్ చేయండి...కొత్త కొత్త విషయాలను తెలుసుకోండి. 1, 2, 3, 4,...ఇలా పేజీలు తిరగేయండి. కొత్త కొత్త కథనాలు చదవండి

 నేషనల్ ఉమెన్స్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్వేతా శెట్టిని కలిసిన 

కర్నూలు జిల్లా అధ్యక్షురాలు హసీనా బేగం

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నేషనల్ ఉమెన్స్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్వేతా శెట్టిని హైదరాబాద్ లోని తన నివాసంలో మంగళవారం కర్నూలు జిల్లా అధ్యక్షురాలు హసీనా బేగం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లాలో కురిసిన భారీ వర్షాల అంచనాలు మరియు వాటి వల్ల నష్టపోయిన కుటుంబాల గురించి హసీనా బేగం వివరించారు. అనంతరం పార్టీ సభ్యత్వ నమోదు మరియు జిల్లా వ్యాప్తంగా కమిటీలు ఏర్పాటు చేయడంపై సుమారు మూడు గంటల పాటు చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్వేత శెట్టి మాట్లాడుతూ వర్షాల ప్రభావంతో నష్టపోయిన పేద ప్రజలకు తమ వంతు ఆర్థిక సహాయం అందిస్తామని, అలాగే సభ్యత్వ నమోదు, కమిటీల విషయంలో కర్నూలు జిల్లా నేషనల్ ఉమెన్స్ పార్టీ అధ్యక్షురాలు ఎస్ హసీనా బేగం గారికి త్వరలోనే పూర్తి బాధ్యతలు అప్పజెపుతామన్నారు. అలాగే నేషనల్ ఉమెన్స్ పార్టీ ఆధ్వర్యంలో హసీనా బేగం చేస్తున్న వివిధ కార్యక్రమాలను ఆమె ప్రశంసించడం జరిగింది.

కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలని ఉందా..అయితే  www.jaanojaago.com లోకి విజిట్ చేయండి...కొత్త కొత్త విషయాలను తెలుసుకోండి. 1, 2, 3, 4,...ఇలా పేజీలు తిరగేయండి. కొత్త కొత్త కథనాలు చదవండి

 బెస్ట్ అవైలబుల్ స్కూల్(BSA) విద్యార్థులను ఆదుకోవాలి

బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం,మాదిగ విద్యార్థి సమైఖ్య డిమాండ్



(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి దళిత,గిరిజన విద్యార్థుల కోసం నెలకొల్పిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ప్రస్తుత ప్రభుత్వము ఎత్తివేయడం అనుకోవడం శోచనీయం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం,మాదిగ విద్యార్థి సమైఖ్య నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవి చంద్ర కిషోర్ రెడ్డికి నంద్యాల ఎమ్మార్వో రవి కుమార్ కు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం,మాదిగ విద్యార్థి సమైఖ్య నేతలు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు వంకిరి రామచంద్రుడు, ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి బాయికాటి బెనర్జీ,జిల్లా సహాయ కార్యదర్శి షేక్. రియాజ్ మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం  బెస్ట్ అవైలబుల్ స్కూళ్లను ఎత్తివేయడానికి ప్రయత్నం చేస్తుందని రెండవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ప్రవేశం లేదు అంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటం వలన విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురి అవుతున్నారని, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో చదువుతున్న పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు అధికారులు జగనన్న అమ్మ ఒడి అప్లై చేసుకోమని చెప్పి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం  బెస్ట్ అవైలబుల్ స్కూల్ అను ఎత్తివేయాలని అనుకోవడం చాలా బాధకరమని,మాజీ సీఎం స్వర్గీయ వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఉన్నత స్కూళ్లలో చదవాలని బెస్ట్ అవైలబుల్ స్కూల్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తన తండ్రి ఆశాయమైన బెస్ట్ అవైలబుల్ స్కూళ్లను యధాతధంగా నిర్వహించాలని,2018,19,20 సంవత్సరాలకు సంబంధించిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ బకాయిలు వెంటనే విడుదల చేసి, స్కూల్ యాజమాన్యాలను ఆదుకోవాలని వారు నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవి చంద్ర కిషోర్ రెడ్డి గారికి,MRO రవి కుమార్ గారికి విన్నవించారు అనంతరం ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థులకు న్యాయం చేస్తారని ఆయన హామీ ఇచ్చారు, MRO రవి కుమార్ గారు మాట్లాడుతూ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆయన విద్యార్థి నాయకులకు హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో రాజు,కిరణ్,రంగ స్వామి తదితరులు పాల్గొన్నారు.

కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలని ఉందా..అయితే  www.jaanojaago.com లోకి విజిట్ చేయండి...కొత్త కొత్త విషయాలను తెలుసుకోండి. 1, 2, 3, 4,...ఇలా పేజీలు తిరగేయండి. కొత్త కొత్త కథనాలు చదవండి

 అధికారుల నిర్లక్ష్యం... కట్ట తెగడానికి కారణం

హోసింగ్ బోర్డ్ కాలనిలో పర్యటన.

రోడ్లు..కాల్వలు ఏర్పాటుచేయండి.

మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

హోసింగ్ బోర్డ్ కాలనీ శివారులో కట్ట తెగటానికి కేసి కెనాల్ అధికారులే కారణమని,గతంలో హెచ్చరించిన అధికారుల నిర్లక్షంతోనే జరిగిందని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.హోసింగ్ బోర్డ్ కాలనిలో వరదలకు కట్ట తెగిపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఆయన మాజీ కౌన్సికర్లతో కలసి పర్యటించారు.


కాలనీ శివారులో కట్ట తెగిన ప్రాంతంలో పర్యటించారు.సమీపంలో వుంబ ప్రజలను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోసింగ్ బోర్డ్ కాలనీ శివారులో గతంలో పడిన వర్షాలకు కొద్దిమేర కట్టతెగడంతో అప్పట్లో కేసి కెనాల్ అధికారులకు చెపోడం జరిగిందన్నారు. వుంబఠాధికారుల దృష్టికు తీసుకొని వెళతామని చెప్పి నిర్లక్షసమ్ వహించారని అన్నారు.అధికారులు నిర్లక్ష్యం చేయకుండా కట్టను బలోపేతం చేసివుంటే నేడు కట్ట తెగేసి కాదని ఆవేదన వ్యక్తం చేశారు.మూడురోజులు వర్షాలు భారీగా కురవడం,ఒక్కసారిగా వరద నీరు రావడంతో వత్తిడి ఒక్కసారిగా పెరగడం కత్తితో పాటు సమీప ప్రాంతాల్లో రోడ్లు కోసుకుని పోయాయని అన్నారు.


 

నాయకులు ,అధికారులు రాజకీయాలు పక్కనపెట్టి ప్రజలను దృష్టిలో పెట్టుకొని సమస్యను యుద్ధప్రాతిపదికన మరమత్తులుచేయాలన్నారు. హోసింగ్ బోర్డ్ కాలనీలో రోడ్లు,కాల్వలు ఏర్పాటుచేయాలని విజ్ఞేప్తి చేశారు.మురుగునీరు లేకుండా కాల్వలు శుభ్రం చేయాలని,అంటురోగాలు భారిన పడకుండా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు.మాజీ కౌన్సిలర్లు,తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు.

కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలని ఉందా..అయితే  www.jaanojaago.com లోకి విజిట్ చేయండి...కొత్త కొత్త విషయాలను తెలుసుకోండి. 1, 2, 3, 4,...ఇలా పేజీలు తిరగేయండి. కొత్త కొత్త కథనాలు చదవండి

 మదర్సా విద్యార్థుల కోసం.. 

తన సొంత నిధులతో

ఉదారతచాటుకొన్న నంద్యాల ఎమ్మెల్యే



(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

కర్నూలు జిల్లా నంద్యాలలోని బస్టాండ్ ప్రాంతంలో  భీమవరం రహదారిలోని ఆల్ ఫూర్ఖాన్ ఈద్గా వద్ద మొన్న ముంచెత్తిన వరదల వల్ల మదరసలో చదువుకునే పిల్లల పుస్తకాలు పాడైపోయాయి అని బోధకులు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి తెలపగా వెంటనే స్పందించి తన సొంత నిధులతో పుస్తకాలు మరియు విద్యార్థులకు అవసరమైన ఫర్నీచర్ ను ఇస్తాను అని మాట ఇవ్వడం జరిగింది.


 

అనంతరం ఈద్గాహ్ (స్మశానవాటిక) ను పరిశీలించి అవసరమైన మరమ్మతులు, ప్రహరీ గోడ మరియు ఈద్గా సంబంధించిన మరమ్మతులు చేయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ ఇషాక్ బాష, మాజీ కౌన్సిలర్లు కలాం బాషా, సమద్, ఆరిఫ్, సాదిక్, మదరస నిర్వాహకులు, స్థానిక నాయకులు సయ్యద్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలని ఉందా..అయితే  www.jaanojaago.com లోకి విజిట్ చేయండి...కొత్త కొత్త విషయాలను తెలుసుకోండి. 1, 2, 3, 4,...ఇలా పేజీలు తిరగేయండి. కొత్త కొత్త కథనాలు చదవండి

...........................

 జర్నలిస్టుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా 

ఎమ్మెల్యే శిల్పా హామీ

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఎపిడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఎపిడబ్ల్యూజేఎఫ్ )రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు  జర్నలిస్టుల సమస్యలు ప్రజాప్రతినిధుల దృష్టికి కార్యక్రమంలో భాగంగా మంగళవారం నంద్యాలలో ఎపిడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధి బృందం ఎమ్మెల్యేను కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు.


 

పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. కరోనా బారిన పడిన జర్నలిస్టులకు తక్షణ సహాయం కింద 25 వేల రూపాయలు ఇవ్వాలని, కోవిడ్ తో మృతి చెందిన జర్నలిస్టు కుటుంబానికి 25 లక్షలు రూపాయలు ఆర్ధికంగా తోడ్పాటు అందించాలని, ఫ్రంట్ లైన్ వారియర్స్ గా జర్నలిస్టులను గుర్తించాలని, కేంద్రం ప్రకటించిన 50 లక్షల ఇన్సూరెన్స్ స్కీమ్ ను జర్నలిస్టులకు వర్తింపజేయాలని తదితర సమస్యలను ఎపిడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధి బృందం నాయకులు మాదాల శ్రీనివాసులు, డి. మౌలాలి, ప్రభాకర్ జి.నగేష్ లు ఎమ్మెల్యే కు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే శిల్పా  రవిచంద్ర కిశోర్ రెడ్డి ఫెడరేషన్ ప్రతినిధులతో మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరానికి కృషి చేస్తానన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. కోవిడ్ బారిన పడిన జర్నలిస్టులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా సీఎం చర్యలు తీసుకున్నారన్నారు. జర్నలిస్టులు కోరుతున్నట్లు కరోనా సోకిన జర్నలిస్టులకు 25వేల రూపాయలు ప్రభుత్వం ఇచ్చేలా కృషి చేస్తానన్నారు. అలాగే నంద్యాల పట్టణంలో దీర్ఘకాలంగా జర్నలిజంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేలా కృషి చేస్తానన్నారు. గతంలో తన తండ్రి ప్రత్యేకంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని అయితే ప్రస్తుతం ఆవిధంగా ఇవ్వడానికి లేదని ఏమాత్రం అవకాశం ఉన్న జర్నలిస్టు కాలనీ ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర ఫెడరేషన్ ప్రతినిధులకు తెలిపారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో జర్నలిస్టులు సురేష్, ఇక్బాల్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఉన్నారు.

కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలని ఉందా..అయితే  www.jaanojaago.com లోకి విజిట్ చేయండి...కొత్త కొత్త విషయాలను తెలుసుకోండి. 1, 2, 3, 4,...ఇలా పేజీలు తిరగేయండి. కొత్త కొత్త కథనాలు చదవండి

 గాన గంధర్వునికి

సినీ మ్యూజిషియన్స్ యూనియన్ ఘన నివాళి!!



(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా ప్రతినిధి)

భువి నుంచి దివికేగిన గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంకి సినీ మ్యూజిషియన్స్ యూనియన్ ఘన నివాళులర్పించింది. సంఘం గౌరవాధ్యక్షులు ఆర్.పి.పట్నాయక్, అధ్యక్షురాలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ, రఘు కుంచె, సురేఖామూర్తి, అనూప్ రూబెన్స్, రవివర్మ, శ్రీకాంత్, వేణు, మణి- నాగరాజ్, బల్లేపల్లి మోహన్, రవిశంకర్, ఎం.వి.కె.మల్లిక్, శివరామ్ వింజమూరి, కె.ఎం.రాధాకృష్ణ,- ఎస్.ఏ.ఖుద్ధూస్, వెంగీ సుధాకర్, మాధవి తదితరులు బాలు గొప్పతనాన్ని, ఆయనతో తమకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.


 

ప్రత్యక్షంగా హాజరు కాలేకపోయిన పలువురు ప్రముఖులు జూమ్ యాప్ ద్వారా తమ సంతాపాన్ని ప్రకటించారు. వారిలో కె.రాఘవేంద్రరావు, మాధవపెద్ది సురేష్, మనో, రామాచారి, కోటి, ఎం.ఎం.శ్రీలేఖ, శ్రీరామచంద్ర, వినోద్ బాబు, పార్థసారథి, శారదాసాయి, వి.కనకదుర్గ,  శ్రీకృష్ణ, కౌసల్య, నూతన, సందీప్, శశికళ, ప్రవీణ్ తదితరులు ఉన్నారు!!


 

కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలని ఉందా..అయితే  www.jaanojaago.com లోకి విజిట్ చేయండి...కొత్త కొత్త విషయాలను తెలుసుకోండి. 1, 2, 3, 4,...ఇలా పేజీలు తిరగేయండి. కొత్త కొత్త కథనాలు చదవండి